Asianet News TeluguAsianet News Telugu

ఆసుపత్రిలోనే కోర్కె తీర్చాలని భార్యపై ఒత్తిడి: దిమ్మ తిరిగే షాకిచ్చిన వైఫ్

అదనపు కట్నం కోసం భార్యను తీవ్రంగా వేధిస్తున్న భర్త ఉదంతమిది. భర్త కొట్టిన దెబ్బలకు కాళ్లు విరిగి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని కోరిక తీర్చాలని  నిందితుడు బలవంతపెట్టాడు.  

Sujatha complaints against her husband for harassment in srikakulam district
Author
Srikakulam, First Published Aug 27, 2018, 3:56 PM IST


శ్రీకాకుళం: అదనపు కట్నం కోసం భార్యను తీవ్రంగా వేధిస్తున్న భర్త ఉదంతమిది. భర్త కొట్టిన దెబ్బలకు కాళ్లు విరిగి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని కోరిక తీర్చాలని  నిందితుడు బలవంతపెట్టాడు.  ఆసుపత్రిలోనే కాదు ఇంట్లో కూడ పిల్లల ముందే  కోర్కె తీర్చాలని బలవంతపెట్టేవాడని బాధితురాలు ఆరోపిస్తోంది. ఈ విషయమై  బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకొంది.

శ్రీకాకుళం రూరల్ మండలం కనుగులవానిపేటలో జాడ నాగరాజు  నివాసం ఉంటున్నాడు.  ఆయనకు మొదటి భార్య చనిపోవడంతో  ఎనిమిదేళ్ల క్రితం ఆముదాలవలస మండలం సొట్టవానిపేట గ్రామానికి చెందిన సుజాతను రెండో వివాహం చేసుకొన్నాడు.  సుజాతకు తల్లి దండ్రులు చనిపోయారు.. నాగరాజు మొదటి భార్యకు  ఓ కూతురు, ఓ కొడుకు ఉన్నారు.

అయితే సుజాతను వివాహం చేసుకొన్న తర్వాత  మొదటి భార్య పిల్లల ఎదుటే  సుజాతను కామవాంఛను తీర్చాలని  నాగరాజు ఒత్తిడి తెచ్చేవాడని బాధితురాలు ఆరోపిస్తుంది.

సుజాత తండ్రి మరణించిన తర్వాత ఇన్సూరెన్స్ డబ్బులు ఇటీవలే వచ్చాయి.అయితే ఈ డబ్బులను తీసుకురావాలని నాగరాజు సుజాతను వేధించాడు. అయితే ఆ డబ్బులతో తనకు సంబంధం లేదని  బాధితురాలు చెప్పింది.  ఈ విషయమై భార్య, భర్తల మధ్య గొడవ చోటు చేసుకొంది.  దీంతో ఆమె  తన సోదరి ఇంటికి చేరుకొంది. 

అయితే సుజాత సోదరి ఇంటికి ఆగష్టు 12 వ తేదీన చేరుకొన్న నాగరాజు  సుజాతతో గొడవకు దిగాడు.  అంతేకాదు ఇన్సూరెన్స్ డబ్బులు తెస్తేనే ఇంటికి రావాలని ఆమెను బెదిరించాడు. ఆ డబ్బులతో తనకు సంబంధం లేదని ఆమె తేల్చి చెప్పింది.

దీంతో ఆగ్రహంతో సుజాతపై నాగరాజు రాయి ఎత్తేశాడు. ఆమె తప్పించుకొంది. అయితే రాయి ఆమె కాలుపై పడింది. దీంతో కాలు విరిగిపోయింది. సుజాత సోదరుడు  ఆమెను ఆసుపత్రిలో చేర్చాడు.

సుజాత ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. మూడు రోజుల తర్వాత ఆసుపత్రికి వచ్చిన  నాగరాజు  బాధితురాలితో గొడవ పెట్టుకొన్నాడు. ఆ తర్వాత ఆసుపత్రిలోనే తన కోర్కె తీర్చాలని పట్టుబట్టాడు. 

బలవంతంగా ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. ఆసుపత్రిలో ఉన్న రోగులు, వారి బంధువులు కేకలు వేయడంతో  నాగరాజు పారిపోయాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఈ ఫిర్యాదు ఆధారంగా సుజాతకు పోలీసు కాపలా ఏర్పాటు చేశారు. 

ఈ వార్తలు చదవండి

ట్రయాంగిల్ లవ్ స్టోరీ: ప్రియురాలి స్నేహితురాలితో ఎఫైర్, ట్విస్టిచ్చిన ఫస్ట్ లవర్

బ్యూటీషీయన్ కేసు: పద్మపై నూతన్ కుమార్ భార్య సంచలనం

దారుణం: కూతుళ్లపై ఏడాదిగా తండ్రి రేప్, దిమ్మ తిరిగే షాకిచ్చిన భార్య

వివాహేతర సంబంధం: బెలూన్‌తో భార్య, కూతురును చంపాడు

నకిలీ వక్షోజాలతో బ్యూటీ కాంటెస్ట్ టైటిల్ గెల్చుకొన్న క్రిస్టినా కామెనోవా

ట్విస్ట్: పక్కింటి కుర్రాడితో ఎంజాయ్, పెళ్లైనా కొనసాగిన అఫైర్, చివరికిలా..

అసహజ శృంగారం: భార్యకు వేధింపులు, ఆత్మహత్యాయత్నం

వివాహిత స్నానం చేస్తుండగా వీడియో, రేప్: బాధితురాలు ఏం చేసిందంటే?

ట్రయాంగిల్ లవ్‌స్టోరీ: మూడో లవర్‌తో ఎంజాయ్, ఇద్దరు లవర్లకు,భర్తకు షాక్

భర్తకు నిద్రమాత్రలిచ్చి ప్రియుడితో ఎంజాయ్: భార్యకు షాకిచ్చిన మొగుడు

వరుసకు కొడుకుతో అఫైర్: వద్దన్న భర్తను చంపిన భార్య

Follow Us:
Download App:
  • android
  • ios