Asianet News TeluguAsianet News Telugu

బాబు ఇంటిపై జగన్ పోరు: ముఖ్యవార్తలు


నేటి ముఖ్యమైన వార్తలను మీరు మిస్సయ్యారా... అలా మిస్ కాకూడదంటే ఈ కింది వార్తలను సంక్షిప్తంగానే కాకుండా వివరంగా కూడా చదవడానికి వీలుగా అందిస్తున్నాం

Top stories of the day
Author
Hyderabad, First Published Jun 25, 2019, 6:33 PM IST

ఏపీ శాంతి భద్రతలపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

Top stories of the day

నెల రోజుల వ్యవధిలోనే 130మందిపై వైసీపీ దాడులకు తెగబడిందని చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయనడానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుందని ప్రశ్నించారు. తన కుటుంబ సభ్యులకు కూడా భద్రతను కుదించారని చంద్రబాబు కార్యకర్తలతో స్పష్టం చేశారు.  
 

బాక్సైట్ తవ్వకాలను నిలిపివేస్తాం: జగన్ నిర్ణయం

Top stories of the day

బాక్సైట్ తవ్వకాల జీవోను రద్దు చేస్తామని  ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు.మంగళవారం నాడు ఏపీ సీఎం వైఎస్ జగన్  కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో ఆయన మాట్లాడారు. బాక్సైట్ తవ్వకాలు వద్దని గిరిజనులు కోరుకొంటే  మైనింగ్ నిర్వహించడం ఎందుకని ఆయన ప్రశ్నించారు.
 

రేపే జగన్ సమీక్ష: అమరావతిపై తీవ్ర ఉత్కంఠ

Top stories of the day

రాజధాని నిర్మాణాలు, భూసేకరణ వంటి అంశాలపై ఆళ్ల రామకృష్ణారెడ్డి కోర్టుల్లో పోరాటం చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో బుధవారం జరిగే సీఆర్డీయే, ఏడీసీ సమీక్షలో జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారా అని అటు అధికారుల్లోనూ ఇటు టీడీపీలోనూ మరో వైపు ప్రజల్లోనూ ఉత్కంఠ నెలకొంది. 
 

ప్రజా వేదిక కాదు.. లోటస్ పాండ్ కూల్చేయాలి.. బుద్దా వెంకన్న

Top stories of the day

కూల్చేయాల్సింది ప్రజా వేదిక కాదని... లోటస్ పాండ్ అని.. టీడీపీ నేత బుద్ధా వెంకన్న అన్నారు. నదీ గర్భాన్ని పూడ్చి కట్టిన అక్రమ కట్టడాలను కూల్చి వేయాలని ప్రభుత్వం నిర్ణయిస్తే టీడీపీ నేతలు ఎందుకు ఉలిక్కిపడుతున్నారంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఆ ట్వీట్ కి బుద్ధా వెంకన్న కౌంటర్ ఇచ్చారు.
 

రోజంతా బాబుతోనే: మూడు రోజుల తర్వాత బీజేపీలోకి సీఎం రమేష్

Top stories of the day

రాజ్యసభలో టీడీపీపీని  బీజేపీలో విలీనం చేయాలని  లేఖ ఇవ్వడానికి  మూడు రోజుల ముందు ఓ ఎంపీ చంద్రబాబుతో అత్యంత సన్నిహితంగా ఉన్నారు. చంద్రబాబు యూరప్ టూర్‌కు వెళ్లగానే  టీడీపీపీని బీజేపీలో విలీసం చేస్తున్నట్టుగా రాజ్యసభ ఛైర్మెన్‌కు లేఖ ఇచ్చారు.
 

జగన్ ప్రభుత్వంపై లోకేష్ విమర్శలు... నెటిజన్ల సెటైర్లు

Top stories of the day

ఏపీలో అధికార పార్టీని విమర్శించడానికి మాజీ మంత్రి, టీడీపీ నేత లోకేష్ ట్విట్టర్ వేదికగా చేసుకున్నారు. ఓ అత్యాచారం ఘటనలో వైసీపీ కార్యకర్తలు నిందితులు అంటూ... లోకేష్ ఆరోపించారు. దానికి సంబంధించిన ఫోటోలను కూడా లోకేష్ ట్విట్టర్ లో పోస్టు చేశారు.

సెక్స్ రాకెట్ పై జగన్ ఆదేశాలకు రోజా ఫిదా

Top stories of the day

కాల్ మనీ సెక్స్ రాకెట్ విషయంపై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై ఎమ్మెల్యే రోజా తెగ సంబంరపడిపోతున్నారని తెలుస్తోంది. తనకు మంత్రి పదవి ఇవ్వకపోయినా కనీసం తన పంతాన్నైనా జగన్ నెరవేరుస్తున్నారని ఆమె సంతోషం వ్యక్తం చేస్తున్నారట. 
 

చంద్రబాబు నివాసం కూల్చివేతకూ రంగం సిద్దం?

Top stories of the day

రాష్ట్రంలో అక్రమ కట్టడాల కూల్చివేతకు సర్కార్ రంగం సిద్దం చేసింది. ప్రజా వేదిక కూల్చివేతతోనే రాష్ట్రంలోని అక్రమ కట్టడాల కూల్చివేతను  ప్రారంభించనున్నారు. బుధవారం నాడు ప్రజా వేదికను కూల్చివేసేందుకు చర్యలు తీసుకొంటున్నట్టుగా రెవిన్యూ శాఖ సీఆర్‌డీఏకు సమాచారం ఇచ్చింది.

 

కాస్ట్లీ ఇల్లు కొన్న తమన్నా.. రేట్ ఎంతంటే..?

Top stories of the day

మిల్కీ బ్యూటీ తమన్నా ముంబైలోని వెర్సోవా ప్రాంతంలో ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఉన్న రేటు కంటే చాలా ఎక్కువ మొత్తం చెల్లించి తమన్నా ఈ అపార్ట్మెంట్ ని దక్కించుకుందట.

 

జగన్ పై ఎగతాళి: ఆంధ్రప్రదేశ్ ఎడిటర్ కు ఉద్వాసన, గదికి తాళం

Top stories of the day

ప్రభుత్వ అధికారిక పత్రిక ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు ఎడిట‌ర్‌ కందుల రమేష్ ను కార్యాలయం బయటకు పంపించేసి, కార్యాలయానికి తాళం వేసినట్లు తెలుస్తోంది. ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మాన్ని త‌ప్పుగా ప్ర‌చురించ‌డ‌మే కాకుండా ఎగ‌తాళి చేశారని కందుల రమేష్ పై ఆరోపణలు వచ్చాయి.
 

చంద్రబాబు నివాసంపై జగన్ సంచలన వ్యాఖ్యలు

Top stories of the day

గత ప్రభుత్వ హాయంలో  అన్ని రకాల ఉల్లంఘనలు చోటు చేసుకొన్నాయని ఏపీ సీఎం వైఎస్ జగన్ విమర్శించారు. అక్రమంగా నిర్మించిన భవనంలో సీఎం నివాసం ఉన్నారని... తాను నివాసం ఉన్న భవనం పక్కనే  ప్రభుత్వ నిధులతో  ప్రజా వేదికను  నిర్మించారని  మాజీ సీఎం బాబుపై జగన్ మండిపడ్డారు.

 

'బిగ్ బాస్ 3'.. అప్పుడే నాగ్ పై ట్రోలింగ్!

Top stories of the day

సోషల్ మీడియా హవా పెరిగిన తరువాత సెలబ్రిటీల మీద ట్రోలింగ్ కూడా బాగా పెరిగింది. పెద్దా, చిన్నా అనే తేడా లేకుండా ఎంతటివారినైనా ట్రోల్ చేసేస్తున్నారు. ఇప్పుడు ఈ ట్రోలింగ్ సెగ నాగర్జునకి కూడా తగిలింది. గతేడాది బిగ్ బాస్ సీజన్ 2 సమయంలో కంటెస్టంట్ల అభిమానులు సోషల్ మీడియాలో మాటల యుద్ధానికి దిగారు. 

 

ప్రజా వేదిక కూల్చివేత..జరిగే నష్టం ఇదే: మంత్రి పేర్ని నాని

Top stories of the day

అక్రమ కట్టడాల నిర్మూలనలో భాగంగా..ప్రజా వేదికను కూల్చివేయాలని సీఎం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే... దానిని కూల్చడం వల్ల నష్టం జరుగుతుందని టీడీపీ నేతలు ఒక్కోక్కరుగా వాపోతున్నారు. చంద్రబాబుకి ఆ భవనం ఇవ్వాల్సి వస్తుందన్న కారణంతోనే దానిని కూల్చివేస్తున్నారని ఆరోపిస్తున్నారు. కాగా... ఈ విషయంపై మంత్రి పేర్ని నాని తన అభిప్రాయాన్ని తెలియజేశారు.
 

లోకేష్ కి జెడ్ ప్లస్ క్యాటగిరీ తొలగింపు, కుటుంబానికి భద్రత రద్దు

Top stories of the day

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబ సభ్యులకు ఏపీ ప్రభుత్వం భద్రత తగ్గించింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. కాగా... చంద్రబాబు ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఈ క్రమంలో ఇటీవలే గతంలో ఆయనకు ఉన్న భద్రతను తగ్గించారు. తాజాగా ఆయన కుటుంబసభ్యుల భద్రతను సైతం తగ్గించేశారు.
 

పోలవరం క్రెడిట్ బాబుదే, మీ గొప్పలు ఆపండి: వైసీపీపై లోకేశ్ ఫైర్

Top stories of the day

పోలవరం విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గొప్పలు చెప్పుకోవడం తగ్గించాలని ధ్వజమెత్తారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్. తెలుగుదేశం హయాంలో ప్రతిపాదించిన రూ.55,548 కోట్ల సవరించిన పోలవరం ప్రాజెక్ట్ అంచనా వ్యయాన్ని కేంద్ర జలవనరుల శాఖ ఆమోదించిందని లోకేశ్ గుర్తుచేశారు.

 

బిగ్ బాస్ 3: క్లారిటీ ఇచ్చిన హాట్ బ్యూటీ!

Top stories of the day

తమిళ్ బిగ్ బాస్ షో యధావిధిగా కమల్ హాసన్ హోస్టింగ్ లో 3వ సీజన్ ప్రారంభమయ్యింది. అయితే తెలుగులో మాత్రం హోస్టింగ్ విషయంలో సస్పెన్స్ కొనసాగిస్తూ కాస్త ఆలస్యంగానే మొదలుపెట్టబోతున్నారు. నాగార్జున హోస్ట్ గా కనిపించబోతున్నసంగతి తెలిసిందే. 

 

 

అది గుదిబండనే, బిజెపి వ్యూహం ఇదే: జగన్ కూ తెలుసు

Top stories of the day

ప్రత్యేక హోదాకు తాను కట్టుబడి ఉన్నానని, దాన్ని సాధించేందుకు ప్రయత్నం చేస్తానని జగన్ అంటున్నారు. నిజానికి, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కూడా ప్రత్యేక హోదా రాదనే విషయం స్ప,ష్టంగానే అర్థమైంది. అయినప్పటికీ కేంద్రంతో సఖ్యతతో ఉంటూనే ప్రత్యేక హోదా సాధించడానికి ప్రయత్నం చేస్తానని ఆయన చెబుతున్నారు. 
 

 

లాడ్జిలో యువతితో పట్టుబడిన కానిస్టేబుల్: ఇరికించేందుకు పన్నాగమా..?

Top stories of the day

ఓ పోలీస్ కానిస్టేబుల్ లాడ్జిలో ఓ యువతితో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. వివరాల్లోకి వెళితే.. కడెం మండలానికి చెందిన ఓ యువతి ఆదివారం రాత్రి నిర్మల్ బస్టాండ్‌లో సీపీఎస్ కానిస్టేబుల్‌కు కనిపించింది.


 

ఆ పార్టీలోకి వెళ్తే భవిష్యత్ నేనే సీఎం: కోమటిరెడ్డి ఆడియో లీక్ కలకలం

Top stories of the day

బీజేపీలో చేరితో భవిష్యత్తులో తానే సీఎం అవుతానంటూ ఆ కార్యకర్తను బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఆ కార్యకర్త సైతం తమను సీఎంగా చూడాలన్నదే తన కోరిక అని చెప్పుకొచ్చారు. కచ్చితంగా రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ గెలుస్తోందని తానే సీఎం అవుతానన్నారు. 


 

కొంచెమైతే నాగ్ అనుచరులు రాడ్లతో కొట్టేవారు: జేడీ చక్రవర్తి

Top stories of the day

సాధారణ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టి హీరోగా విలన్ గా దర్శకుడిగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్న జేడీ చక్రవర్తి ఇటీవల ఇంటర్వ్యూలతో హాట్ టాపిక్ గా నిలుస్తున్నాడు. స్టార్ హీరోలపై అలాగే రాజకీయాలపై తనదైన శైలిలో కామెంట్ చేస్తూ వైరల్ అవుతున్నాడు. డిజాస్టర్ హీరోలు: ఇప్పుడు ఏం చేస్తున్నారంటే..?

Top stories of the day

వరుస డిజాస్టర్స్ తో గత కొంతకాలంగా సతమతమవుతున్న హీరోలు నెక్స్ట్ ఎలాగైనా హిట్ కొట్టాలని కష్టపడుతున్నారు. అయితే వారు ఎన్ని  ప్రాజెక్టులు చేస్తున్నారో ఓ లుక్కేద్దాం పదండి. 


 

ఇండియాను ఓడించి తీరుతాం: షకీబ్ ధీమా

Top stories of the day

ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా జరిగే మ్యాచులో భారత్ ను ఓడించి తీరుతామని బంగ్లాదేశ్ క్రీడాకారుడు షకీబ్ అల్ హసన్ ధీమా వ్యక్తం చేశాడు. బంగ్లాదేశ్ జులై 2వ తేదీన భారత్ తో తలపడనుంది. అఫ్గానిస్తాన్ పై సోమవారం విజయం సాధించిన తర్వాత అతను మీడియాతో మాట్లాడాడు.

Follow Us:
Download App:
  • android
  • ios