అమరావతి: బాక్సైట్ తవ్వకాల జీవోను రద్దు చేస్తామని  ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు.

మంగళవారం నాడు ఏపీ సీఎం వైఎస్ జగన్  కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో ఆయన మాట్లాడారు. బాక్సైట్ తవ్వకాలు వద్దని గిరిజనులు కోరుకొంటే  మైనింగ్ నిర్వహించడం ఎందుకని ఆయన ప్రశ్నించారు.

గిరిజనులు మావోయిస్టుల్లో చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన  సూచించారు. గిరిజనుల్లో విశ్వాసం కల్పించేందుకు వీలుగా బాక్సైట్ తవ్వకాలను నిలిపివేస్తూ జీవోను రద్దు చేస్తామన్నారు బాక్సైట్‌ తవ్వకపోతే రాష్ట్రానికి వచ్చే నష్టమేమీ లేదన్నారు. ఇక నుంచి  ఏజెన్సీలో మైనింగ్‌ చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

మరోవైపు రాష్ట్రంలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌పై సీఎం ఆరా తీశారు. ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారని అధికారులను ప్రశ్నించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు నెలకోసారి తప్పనిసరి పర్యటించాలని సీఎం ఆదేశించారు. ఏజెన్సీ ప్రాంతంలో భద్రతా రిత్యా... అన్ని విభాగాలకు చెందిన అధికారులు ఒకేసారి ఆయా ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.

సంబంధిత వార్తలు

చంద్రబాబు నివాసం కూల్చివేతకూ రంగం సిద్దం?

చంద్రబాబు నివాసంపై జగన్ సంచలన వ్యాఖ్యలు

ప్రత్యేక హోదా ఉద్యమం: కేసుల ఎత్తివేతకు జగన్ ఆదేశం

కాల్‌మనీ సెక్స్ రాకెట్‌‌పై సీఎం జగన్ సీరియస్: ఎవరినీ వదలొద్దు

త్వరలోనే పోలీసు శాఖలోఖాళీలు భర్తీ: సుచరిత