మిల్కీ బ్యూటీ తమన్నా ముంబైలోని వెర్సోవా ప్రాంతంలో ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఉన్న రేటు కంటే చాలా ఎక్కువ మొత్తం చెల్లించి తమన్నా ఈ అపార్ట్మెంట్ ని దక్కించుకుందట.

జుహు-వెర్సోవా లింక్ రోడ్ లో ఉన్న 'బేవ్యూ' అనే 22 అంతస్తుల భవంతిలో 14వ అంతస్తులోని ఫ్లాట్ ని రూ.16 కోట్లు పెట్టి తమన్నా కొనుక్కుందట. అయితే ఈ విషయాన్ని తమన్నా కానీ ఆమె మేనేజర్ కానీ స్పష్టం చేయలేదు. ఈ ఫ్లాప్ ను తమన్నా.. ఆమె తల్లి రజనీ భాటియా పేర్ల మీద జాయింట్ వెంచర్ గా కొనుగోలు చ్సినట్లు సమాచారం.

ఈ ఖరీదైన అపార్ట్మెంట్ లో తమన్నా రెండు కార్ పార్కింగ్ స్లాట్స్ ను కూడా కొనుగోలు చేసిందట. చదరపు గజానికి రూ.80,778 చెల్లించి ఈ ఇంటికి మొత్తంగా పదహారు కోట్లకు కొనుక్కుంది, నిజానికి ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఉన్న ధరలకు ఇది రెండు రెట్లు కంటే అధికమని చెబుతున్నారు.

'బేవ్యూ' చాలా బాగుండడంతో ఎలాగైనా ఫ్లాప్ ని సొంతం చేసుకోవాలని డబుల్ రేటు చెల్లించి తమన్నా అపార్ట్ మెంట్ ని దక్కించుకుంది. ఇంటీరియర్ డిజైన్ కోసం కూడా కోట్లలో ఖర్చుపెట్టడానికి సిద్ధమవుతోంది.

ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఈ బ్యూటీ 'క్వీన్' తెలుగు రీమేక్ 'దటీజ్ మహాలక్ష్మి'లో నటిస్తోంది. అలానే మెగాస్టార్ 'సై రా'లో ముఖ్య పాత్ర పోషిస్తోంది. అలానే 'రాజు గారి గది 3'కి కూడా సైన్ చేసింది.