లండన్‌: ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా జరిగే మ్యాచులో భారత్ ను ఓడించి తీరుతామని బంగ్లాదేశ్ క్రీడాకారుడు షకీబ్ అల్ హసన్ ధీమా వ్యక్తం చేశాడు. బంగ్లాదేశ్ జులై 2వ తేదీన భారత్ తో తలపడనుంది. అఫ్గానిస్తాన్ పై సోమవారం విజయం సాధించిన తర్వాత అతను మీడియాతో మాట్లాడాడు.  

భారత్‌తో జరిగే మ్యాచ్‌ తమకు చాలా ముఖ్యమని, టైటిల్‌ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన భారత్ జట్టును ఓడించడం అంత సులువు కాదని, కానీ తాము గట్టి పోటీనిస్తామని షకీబ్ అన్నాడు. భారత జట్టులో దిగ్గజశ్రేణి ఆటగాళ్లున్నారని, ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించే సత్తా వారికుందని అతను అన్నాడు. 

తాము ఇండియాపై సాయశక్తుల పోరాడుతామని, భారత్‌ను ఓడించే సత్తా తమకు ఉందని అన్నాడు. ఈ విషయంలో తమ జట్టుపై తనకు పూర్తి నమ్మకం ఉందని ఆయన అన్నాడు. షకీబ్ ఆల్ రౌండ్ ప్రతిభతో అఫ్గానిస్తాన్ పై బంగ్లాదేశ్ విజయం సాధించిన విషయం తెలిసిందే.