అమరావతి: విదేశీ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి చేరుకున్న మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో జరుగుతున్న వరుస పరిణామాలపై చర్చించారు. 

భద్రత కుదింపు, ఎంపీలు ఫిరాయింపులు, కీలక నేతలు పార్టీ మారడం వంటి అంశాలపై కార్యకర్తలతో చంద్రబాబు నాయుడు చర్చించారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. 

టీడీపీ నేతలపై జరుగుతున్న దాడులను ఖండించిన చంద్రబాబు ప్రకాశం జిల్లాలో జరిగిన దాడిని, నర్సరావుపేటలో దళిత వైద్యులపై జరిగిన దాడిపై చర్చించారు. దళిత వైద్యులపై దాడులను తాను ఖండిస్తున్నట్లు తెలిపారు. 

నెల రోజుల వ్యవధిలోనే 130మందిపై వైసీపీ దాడులకు తెగబడిందని చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయనడానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుందని ప్రశ్నించారు. తన కుటుంబ సభ్యులకు కూడా భద్రతను కుదించారని చంద్రబాబు కార్యకర్తలతో స్పష్టం చేశారు.  

ఇకపోతే చంద్రబాబు యూరప్ ట్రిప్ లో ఉండగా ఆయనకు భద్రత కుదించింది ఏపీ సర్కార్. గతంలో ఉన్న భద్రతను కుదించడారు. అంతేకాదు ఆయన కుటుంబ సభ్యులకు సైతం భద్రత కుదించింది ఏపీ సర్కార్. 

గతంలో జెడ్ క్యాటగిరీ ఉణ్న లోకేష్ కి భద్రత తగ్గించారు. 5 ప్లస్5 ఉన్న గన్ మెన్లను కాస్త 2 ప్లస్ 2కి తగ్గిస్తూ ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు కుటుంబ సభ్యులకు భద్రత కుదింపుపై తెలుగు తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో తమ ప్రభుత్వం ప్రతిపక్ష నేతగా ఉన్న వైయస్ జగన్ కు పూర్తి భద్రత ఇచ్చినట్లు స్పష్టం చేస్తున్నారు. 

ఈ వార్తలు కూడా చదవండి

రోజంతా బాబుతోనే: మూడు రోజుల తర్వాత బీజేపీలోకి సీఎం రమేష్