ఏపీలో అధికార పార్టీని విమర్శించడానికి మాజీ మంత్రి, టీడీపీ నేత లోకేష్ ట్విట్టర్ వేదికగా చేసుకున్నారు. ఓ అత్యాచారం ఘటనలో వైసీపీ కార్యకర్తలు నిందితులు అంటూ... లోకేష్ ఆరోపించారు. దానికి సంబంధించిన ఫోటోలను కూడా లోకేష్ ట్విట్టర్ లో పోస్టు చేశారు.

‘‘ఒంగోలులో మైనర్ బాలికపై పాశవికంగా జరిగిన అత్యాచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. దేశంలోనే సంచలనం కలిగిస్తున్న ఈ దుశ్చర్యలో నిందితులు  వైసీపీ కార్యకర్తలు కావడం సిగ్గుచేటు. @ysjagan గారూ, మీ పార్టీ పాలనలో రాష్ట్రం సురక్షితంగా లేదన్న విషయం ఈ ఘటనతో స్పష్టమైంది.’’ అంటూ.. వైసీపీ కార్యకర్తతో జగన్ తో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేశారు. 

అయితే... ఈ ట్వీట్ కి నెటిజన్లు బాగానే స్పందించారు. అయితే... ఎక్కువ మంది జగన్ ని సమర్థిస్తూ.. లోకేష్ ని విమర్శించడం గమనార్హం. లోకేష్ వల్ల టీడీపీకి డ్యామేజ్ జరిగిందని.. ఇకనైనా రాజకీయాల్లో నుంచి తప్పుకోవాలి అంటూ హితవు పలకడం విశేషం.

 ‘‘స్టేట్ లో ప్రతి ఒక్కడు ఎదో ఒక పార్టీ కార్యకర్తే. జగన్ కూడా స్పందించాలి, వాడికి శిక్ష పడేలా చూడాలి.అంతే కానీ నువ్ దాన్ని రాజకీయం చెయ్యకు.నీ వాళ్ళ తెలుగు దేశం కి జరిగిన డామేజ్ చాలు ఇంకా నువ్ ఆపేయ్ అన్న రాజకీయాలు ప్లీజ్ ’’ ఓ నెటిజన్ లోకేష్ కి రిప్లై ఇచ్చాడు.