ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబ సభ్యులకు ఏపీ ప్రభుత్వం భద్రత తగ్గించింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. కాగా... చంద్రబాబు ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఈ క్రమంలో ఇటీవలే గతంలో ఆయనకు ఉన్న భద్రతను తగ్గించారు. తాజాగా ఆయన కుటుంబసభ్యుల భద్రతను సైతం తగ్గించేశారు.

జెడ్ క్యాటరిగి ఉన్న లోకేష్ కి భద్రత తగ్గించారు. గతంలో లోకేష్ కి 5+5 భద్రత ఉండేది. కాగా దానికి 2 +2 గన్ మెన్ల కు కుదిస్తూ.. ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  ఇక మిగిలిన ఇతర కుటుంబసభ్యులకు పూర్తిగా భద్రతను తొలగించారు. కాగా.. కనీస సమాచారం కూడా ఇవ్వకుండా భద్రత తగ్గించడం పట్ల టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో జగన్ ప్రతిక్షంలో ఉన్నప్పుడు ఆయనకు తగిన భద్రత కల్పించామని ఈ సందర్భంగా టీడీపీ నేతలు గుర్తు చేశారు.

ఇదిలా ఉండగా... ఇటీవల కుటుంబసభ్యులతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు... మంగళవారం తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. ఎంపీల పార్టీ మార్పు, ప్రజా వేదిక కూల్చివేత తదితర విషయాలపై చంద్రబాబు నేడు స్పందించే అవకాశం ఉంది.