Asianet News TeluguAsianet News Telugu

కొంచెమైతే నాగ్ అనుచరులు రాడ్లతో కొట్టేవారు: జేడీ చక్రవర్తి

 

సాధారణ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టి హీరోగా విలన్ గా దర్శకుడిగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్న జేడీ చక్రవర్తి ఇటీవల ఇంటర్వ్యూలతో హాట్ టాపిక్ గా నిలుస్తున్నాడు. స్టార్ హీరోలపై అలాగే రాజకీయాలపై తనదైన శైలిలో కామెంట్ చేస్తూ వైరల్ అవుతున్నాడు. 

jd about siva shooting
Author
Hyderabad, First Published Jun 25, 2019, 4:32 PM IST

సాధారణ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టి హీరోగా విలన్ గా దర్శకుడిగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్న జేడీ చక్రవర్తి ఇటీవల ఇంటర్వ్యూలతో హాట్ టాపిక్ గా నిలుస్తున్నాడు. స్టార్ హీరోలపై అలాగే రాజకీయాలపై తనదైన శైలిలో కామెంట్ చేస్తూ వైరల్ అవుతున్నాడు. ఇక రీసెంట్ గా శివ సినిమా షూటింగ్ కి సంబందించిన విషయాన్నీ గుర్తు చేసుకున్నాడు.

అప్పుడు నాగార్జున అనుచరులు అన్నపూర్ణ స్టూడియోస్ కి సంబందించిన వారు కొంతమంది నన్ను కొట్టేందుకు రాడ్లతో రెడీ అయ్యారని నాగ్ ఆపకుంటే కొట్టేసేవారని చెప్పుకొచ్చాడు. అసలు మ్యాటర్ లోకి వెళితే.. శివ సినిమాలో ఒక హోటల్ సీన్ రియాలిటీగా ఉండాలని పఠాన్ చేరు లోని నిజమైన ఇరానీ హోటల్ లో ప్లాన్ చేశారు. 

షూటింగ్ అని తెలియగానే జనాలు ఎక్కువ మంది వచ్చేవారు. జనాల వల్ల ఇబ్బంది అవుతోందని దర్శకుడు ఆర్జీవీ ఎవరికీ కనిపించకుండా నెక్స్ట్ డే కెమెరాలను ఫిక్స్ చేశాడు. నాగార్జున అలా రాగానే నేను గొడవకు దిగాలి. అదే సీన్.  సీన్ లో రెచ్చగొట్టగానే నాగ్ చెంప మీద కొట్టడం.. నేను కాలర్ పట్టుకోవడం అంతా రియాలిటీగా జరుగుతోంది. 

అందరూ ఎదో గొడవ జరుగుతోందని అనుకున్నారు. నాగ్ అనుచరులు, అన్నపూర్ణ స్టూడియోస్ కి చెందిన వారు కొన్ని రాడ్లు పట్టుకొని ఆగ్రహంతో నా వైపుగా వచ్చారు. వెంటనే నాగ్ ఆపేశాడు. ఇంతలో వర్మ వచ్చి షూటింగ్ అని చెప్పాడు. సీన్ అయితే బాగా వచ్చింది గాని వర్మ వేసిన ప్లాన్ తేడా కొట్టి ఉంటే నన్ను వాళ్లు నిజంగానే కొట్టేవారని జేడీ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు.

Follow Us:
Download App:
  • android
  • ios