Asianet News TeluguAsianet News Telugu

శ్రీదేవి కూతురు బెల్లీ డ్యాన్స్: ఖాస్ బాత్

నేటి ముఖ్యమైన వార్తలను మీరు మిస్సయ్యారా... అలా మిస్ కాకూడదంటే ఈ కింది వార్తలను సంక్షిప్తంగానే కాకుండా వివరంగా కూడా చదవడానికి వీలుగా అందిస్తున్నాం

Top Stories of the day
Author
Hyderabad, First Published Jun 17, 2019, 6:38 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

చంద్రబాబుకు మహిళల ఉసురు తగిలింది: రోజా

20 మందికి పైగా విద్యార్థినిలు ఆత్మహత్యలు చేసుకుంటే వారిని ఆదుకోవాల్సింది పోయి, వారి తల్లిదండ్రులకు భరోసా ఇవ్వాల్సింది పోయి వారిని మరింత మానసిక క్షోభకు గురి చేశారని ఆరోపించారు. ఆ తల్లిదండ్రుల ఉసురు తగిలి నారాయణ అనే వ్యక్తి అడ్రస్ లేకుండా పోయారని రోజా శాపనార్థాలు పెట్టారు. 

 

మా పార్టీలోకి టీడీపీ నేతల క్యూ: బీజేపీ నేత మురళీధర్ రావు

రాష్ట్రంలో పలువురు టీడీపీ నేతలు బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు  చెప్పారు. సోమవారం నాడు ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు.  అసెంబ్లీ  ఎన్నికల్లో టీడీపీ ఓటమి కోలుకొనేది కాదన్నారు.

 

చంద్రబాబు రూ. 50 కోట్లు ఆఫర్ చేశారు: మంత్రి జయరాం సంచలన ఆరోపణ

రూ.50 కోట్లు, మంత్రి పదవి నా వెంట్రుకతో సమానం అంటూ తిప్పి పంపిన వ్యక్తినని చెప్పుకొచ్చారు. డబ్బుకు అమ్ముడుపోకుండా నీతిగా నిలిచినందుకే వైయస్ జగన్ తనను మంత్రి పదవి ఇచ్చారని చెప్పుకొచ్చారు. తాను నీతిగా ఉంటూ తన సామాజిక వర్గమైన బోయలకు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చానంటూ మీసం మెలేశారు. 
 

చెప్పినా వినలేదు: చంద్రబాబుపై సుజనా చౌదరి అసంతృప్తి

మోడీ మంత్రివర్గం నుండి వైదొలగడం అసందర్భమమైన నిర్ణయమని మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి అభిప్రాయపడ్డారు. కేంద్ర మంత్రివర్గం నుండి వైదొలిగినా కూడ ఎన్డీఏలోనే ఉండాలని తాను చేసిన సూచనను కూడ చంద్రబాబు పట్టించుకోలేదన్నారు.
 

బీజేపీ నుండి ఆహ్వానం: ఏమీ తేల్చని జేసీ దివాకర్ రెడ్డి

బీజేపీలో చేరాలని ఆహ్వానం వచ్చిందని... కానీ, తాను ఏ సమాధానం చెప్పలేదని అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చెప్పారు. సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు.  జగన్‌కు భయపడి  పొగడడం లేదు.. జగన్ విధానాలు నచ్చే ఈ మాటలను చెబుతున్నట్టుగా జేసీ దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు. 
 

 

జగన్.. ఇది పద్ధితి కాదు: కబ్జాలు, వసూళ్ల కేసులపై స్పందించిన కోడెల

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావుతో సహా ఆయన కుమారుడు, కుమార్తెలపై కబ్జాలు, బలవంతపు వసూళ్ల కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసుల వ్యవహారంపై  తొలిసారి స్పందించారు కోడెల. సత్తెనపల్లి కేసులపై ప్రభుత్వం సిట్ విచారణ జరుపుతామంటోందని.. ఎలాంటి విచారణను ఎదుర్కొనేందుకైనా తాను సిద్ధమన్నారు
 

చంద్రబాబు మారాల్సిందే, జగన్ అందుకే గెలిచారు: జేసీ దివాకర్ రెడ్డి

రాష్ట్రంలో మార్పు రావాలని ప్రజలు కోరుకొన్నారని.. జగన్ పాలన ఎలా ఉంటుందో  చూడాలనే ఆసక్తి కారణంగానే ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిందని అనంతపురం మాజీ ఎంపీ, టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి చెప్పారు. చంద్రబాబునాయుడు తీరును మార్చుకోవాలని  ఆయనకు పదే పదే తాను సూచించినట్టుగా కూడ  ఆయన స్పష్టం చేశారు.
 

శాసన మండలికి సీఎం జగన్...లోకేష్ కి నమస్కారం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్... తొలిసారి శాసన మండలిలోకి అడుగుపెట్టారు. శాసనసభ సమావేశాల్లో భాగంగా సోమవారం జగన్ శాసన మండలికి వెళ్లారు. ఈ సందర్భంగా శాసన మండలి సభ్యులకు సీఎం జగన్ నమస్కరించారు.  ఈ సందర్భంగా వైసీపీ శాసనమండలి సభ్యులను వైఎస్ జగన్ ఆప్యాయంగా పలకరించి.. చేయి కలిపారు. 
 

పప్పును కాను: నారా లోకేష్ పై మంత్రి అనిల్ పరోక్ష వ్యాఖ్య

మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాజీ మంత్రి, ఎమ్మెల్సీ నారా లోకేష్ మీద పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఏమీ తెలియని అనిల్ మంత్రై చంద్రబాబు నాయుడినే విమర్శిస్తున్నారని తెలుగుదేశం పార్టీ సభ్యుడు అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలకు స్పందిస్తూ అనిల్ కుమార్ పరోక్షంగా నారా లోకేష్ ను ప్రస్తావించారు. 
 

అప్పుడే కాన్వాయ్ మార్చిన జగన్.. నెలకే కొత్త కాన్వాయ్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన కాన్వాయ్‌ని నెల తిరక్కుండానే మార్చివేశారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత ప్రభుత్వం ఆయనకు ప్రత్యేక కాన్వాయ్‌ని సమకూర్చిన సంగతి తెలిసిందే.
 

భూత వైద్యుడి రాసలీలలు: దెయ్యం వదిలిస్తానని యువతిపై అత్యాచారం

భూత వైద్యం పేరుతో ఓ యువతిని బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  వివరాల్లోకి వెళితే.. బోరబండ ప్రాంతానికి చెందిన భార్యాభర్తలు వారి కుమార్తెతో కలిసి 20 రోజుల కిందట, మల్లేపల్లిలో భూత వైద్యుడిగా చెప్పుకుంటున్న ఆజంను కలిశారు.
 

శ్రీ రెడ్డి లీక్స్ త్వరలో.. టార్గెట్ విశాల్?

కోలీవుడ్ ప్రముఖులపై ఓ రేంజ్ లో ట్వీట్స్ చేస్తోన్న శ్రీ రెడ్డి మరోసారి విశాల్ ని టార్గెట్ చేశారు. మరికొన్ని రోజుల్లో తమిళ సినీ పరిశ్రమలో నడిఘర్ సంఘం ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పలువురు ప్రముఖులు విశాల్ పై విమర్శలు చేస్తున్నారు.

 

బిజెపిలోకి జగ్గారెడ్డి?: టీఆర్ఎస్ పై లక్ష్మణ్ సంచలన ప్రకటన

కాంగ్రెసు సంగారెడ్డి శాసనసభ్యుడు తూర్పు జయప్రకాశ్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి కూడా బిజెపి వైపు చూస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)కి బిజెపియే ప్రత్యామ్నాయమని కాంగ్రెసు శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దాంతో బిజెపిలో చేరడం లాంఛనమేననే మాట వినిపిస్తోంది.
 

వ్యభిచారం చేస్తూ పట్టుబడిన విదేశీ యువతి

హైదరాబాదులోని బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.12లోని సాయి ఎన్‌క్లేవ్‌లో ఉన్న డౌన్‌టౌన్‌ హోటల్‌పై పోలీసులు శుక్రవారం రాత్రి దాడులు నిర్వహించారు. ఓ విదేశీ యువతితో పాటు పంజాబ్‌కు చెందిన మరో యువతి ఇక్కడ వ్యభిచారం చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు
 

బుర్ర లేదు..పాక్ కెప్టెన్ పై అక్తర్ ఘాటు వ్యాఖ్యలు

తమ చిరకాల ప్రత్యర్థి పాక్ పై టీం ఇండియా సునాయాసంగా గెలిచింది. ఈ మ్యాచ్ భారతీయ అభిమానుల్లో ఆనందాన్ని నింపితే... పాక్ అభిమానుల్లో మాత్రం నిరాశే మిగిలింది. ఈ మ్యాచ్ ఓడిపోవడానికి కెప్టెన్ సర్ఫరాజ్ తీసుకున్న నిర్ణయమే కారణమని ఆ జట్టు సభ్యుడు షోయబ్ అక్తర్ అభిప్రాయపడ్డారు. సర్ఫరాజ్ కి అసలు బుర్రేలేదు అంటూ... ఘాటువ్యాఖ్యలు చేశారు.
 

ప్రపంచ కప్ 2019... ఆ నిర్ణయమే పాక్ కొంప ముంచింది...: వసీం అక్రమ్

ప్రపంచ కప్ టోర్నీలో టీమిండియా మరో చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. దాయాది పాకిస్థాన్ జట్టును మరోసారి మట్టికరిపించిన భారత జట్టు ఈ మెగా టోర్నీలో  వరుసగా మూడో విజయాన్ని అందుకుంది. అయితే టీమిండియా చేతిలో పాక్ ఓటమిని తాను ముందుగానే ఊహించానని పాక్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ వెల్లడించారు. సీనియర్లు అందించే అనుభవంతో కూడిన సలహాలను పాక్ స్వీకరించడంలేదని...అందువల్లే ఆ జట్టుకు సలహాలివ్వడం కూడా మానేశానంటూ అక్రం సంచలన వ్యాఖ్యలు చేశాడు. 
 

పాక్‌పై భారత్ గెలుపు: మరో సర్జికల్ స్ట్రైక్ అన్న అమిత్ షా

ప్రపంచకప్‌లలో పాకిస్తాన్‌పై జైత్రయాత్ర కొనసాగించిన భారత్.. ఆదివారం రాత్రి మరోసారి దాయాది జట్టుపై గెలుపొందడంతో టీమిండియా అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు.

ఈ విజయంతో రాజకీయ, సినీ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు టీమిండియాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు, కేంద్రమంత్రి అమిత్ షా సైతం భారత జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు.
 

వరల్డ్ కప్... పాక్ ని 7సార్లు మట్టికరిపించిన భారత్

ప్రపంచ కప్‌లో భారత క్రికెట్ జట్టు సంప్రదాయాన్ని కొనసాగించింది. తన చిరకాల ప్రత్యర్థిపై భారత్ విజయ ఢంకా మోగించేసింది. మాంచెస్టర్‌ ఓల్డ్ ట్రాఫర్డ్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీసేన 89 పరుగులతో గెలుపొందింది. ఇలా పాక్ ని ఓడించడం భారత్ కి ఇదేమి తొలిసారి కాదు. పాక్‌పై వరుసగా భారత్.. ఏడో సారి విజయం సాధించింది.
 

రోహిత్ ఔట్ కు ప్లాన్ వేశాం, కానీ...: సర్ఫరాజ్ తీవ్ర నిరాశ

ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచులో ఇండియాపై తమ ఓటమి పట్ల పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. మిడిల్ ఆర్డర్ కుప్పకూలడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశాడు.
 

చిన్మయిపై బూతులు.. అందుకే తిట్టా అంటూ సారీ చెప్పిన అభిమాని!

ప్రముఖ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి మీటూ ఉద్యమం నేపథ్యంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ప్రముఖ రచయిత వైరముత్తు తనని లైంగికంగా వేధించాడంటూ చిన్మయి సంచలన ఆరోపణలు చేసింది.
 

జూ.ఎన్టీఆర్ వచ్చినా లాభం లేదు.. జగన్ ఆ ఛాన్స్ ఇవ్వరు!

టిడిపి పగ్గాలు చేపట్టాలని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. రాజకీయాల్లోకి రాకపోతే బెటర్ అని కొందరు.. ఆ నిర్ణయం ఎన్టీఆర్ కే వదిలేయాలని, ఒత్తిడి చేయకూడదని కొందరు అభిప్రాయ పడుతున్నారు. సినీ రాజకీయ ప్రముఖులకు ఎన్టీఆర్ కి సంబంధించిన ప్రశ్నలు మీడియాలో ఎదురవుతున్నాయి. ప్రముఖ నటుడు పోసాని కృష్ణ మురళి ఇటీవల సర్జరీ చేయించుకుని ఇప్పుడే కోలుకుంటున్నారు. ఈ సందర్భంగా పోసాని మీడియాతో సరదాగా ముచ్చటించారు.
 

జాన్వీకపూర్ బెల్లీ డాన్స్.. వీడియో వైరల్!

దివంగత శ్రీదేవి నటవారసురాలిగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మొదటి చిత్రం 'ధడక్' తో సక్సెస్ అందుకొని తన సత్తా చాటింది జాన్వీకపూర్. ఆ తరువాత హీరోయిన్ గా ఆమెకి వరుస అవకాశాలు వస్తున్నాయి.
 

ఆ పొలిటీషిన్ కు ఉ** పడాలంటూ మంచు విష్ణు

చాలా కాలంగా రకరకాల వివాదాలతో రిలీజ్ అవుతుందో లేదో డైలమోలో ఉన్న  మంచు విష్ణు హీరో  తాజా చిత్రం 'ఓటర్'. పొలిటిక‌ల్ డ్రామా గా తెరకెక్కిన ఈ చిత్రం ఓటర్ గొప్పతనం, ఓటు ప్రాముఖ్యత గురించి చర్చిస్తుంది. అయితే ఎలక్షన్స్ మూడ్ అయ్యిపోయి, రిజల్ట్స్ కూడా వచ్చేసి , ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ఇప్పుడు రిలీజ్ అవుతూండటంతో ఎంతవరకూ ఇంపాక్ట్ చూపుతుందనేది అనుమానమే. ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా తాజాగా చిత్రం ట్రైలర్ విడుదల చేసారు. 
 

 

క్రెడిట్ కూతురికి ఇచ్చేసిన రోహిత్ శర్మ

తన కూతురు సమైరా శర్మ వల్లే తాను రాణిస్తున్నట్లు రోహిత్‌ శర్మ తెలిపాడు. కూతురు పుట్టడంతో తన దశ, దిశ మారిందని, అంతా కలిసొస్తుందని అన్నాడు. ఆదివారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ (113 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్లతో 140 పరుగులు) అ‍ద్భుతమైన సెంచరీతో భారత విజయంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.
 

ఇండియాపై మ్యాచ్: పాక్ బౌలర్ కు అంపైర్ రెండుసార్లు వార్నింగ్

మొదట మూడో ఓవర్‌ మూడో బంతి విసిరిన తర్వాత ఆమిర్‌ పిచ్‌పై పరిగెత్తాడు. దాంతో అంపైర్‌ బ్రూస్‌ ఆక్పెన్‌ఫర్డ్‌ను వార్నింగ్‌ ఇచ్చాడు.  పాకిస్థాన్‌ కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అంపైర్‌ వద్దకు వచ్చి..ఆమిర్‌ మళ్లీ అలా చేయడని చెప్పాడు.

 

 

Follow Us:
Download App:
  • android
  • ios