కోలీవుడ్ ప్రముఖులపై ఓ రేంజ్ లో ట్వీట్స్ చేస్తోన్న శ్రీ రెడ్డి మరోసారి విశాల్ ని టార్గెట్ చేశారు. మరికొన్ని రోజుల్లో తమిళ సినీ పరిశ్రమలో నడిఘర్ సంఘం ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పలువురు ప్రముఖులు విశాల్ పై విమర్శలు చేస్తున్నారు. 

నటి రాధికా శరత్ కుమార్ ఇటీవల విశాల్ పై విమర్శలతో విరుచుకుపడగా అందుకు వరలక్ష్మి శరత్ కుమార్ కూడా మద్దతు పలికారు. విశాల్ మోసాలన్నీ అందరికి తెలిసిపోయాయని ఎవరు కూడా అతనిని నమ్మవద్దని అన్నారు. ఇక ఇప్పుడు విశాల్ ని టార్గెట్ చేసిన శ్రీ రెడ్డి సోషల్ మీడియాలో కౌంటర్ ఇస్తున్నారు. 

విశాల్ రెడ్డి ఎలా ఉన్నావ్ అంటూ.. త్వరలోనే శ్రీ రెడ్డి లీక్స్ బయటపడనున్నట్లు యాష్ ట్యాగ్ తో షాకిచ్చింది. ఒక్కసారిగా ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. గతంలో విశాల్ కూడా పలు విషయాల్లో శ్రీ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు. ఇక ఇప్పుడు ఎన్నికల సమయంలో విశాల్ ని శ్రీ రెడ్డి టార్గెట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.