చంద్రబాబు మారాల్సిందే, జగన్ అందుకే గెలిచారు: జేసీ దివాకర్ రెడ్డి

First Published 17, Jun 2019, 12:56 PM IST

రాష్ట్రంలో మార్పు రావాలని ప్రజలు కోరుకొన్నారని.. జగన్ పాలన ఎలా ఉంటుందో  చూడాలనే ఆసక్తి కారణంగానే ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిందని అనంతపురం మాజీ ఎంపీ, టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి చెప్పారు. చంద్రబాబునాయుడు తీరును మార్చుకోవాలని  ఆయనకు పదే పదే తాను సూచించినట్టుగా కూడ  ఆయన స్పష్టం చేశారు.

ఓ తెలుగు న్యూస్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాజీ ఎంపీ, టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.వైఎస్  జగన్ పాలనపై ఇప్పుడే విమర్శలు చేయకూడదని తాను చంద్రబాబునాయుడుకు సూచించినట్టుగా జేసీ చెప్పారు. ఇప్పుడు మనం మౌన వ్రతంలో ఉండాలని నిర్ణయం తీసుకొన్నామన్నారు.

రాష్ట్రంలో పాలన మారాలని ప్రజలు కోరుకొన్నారని... చంద్రబాబునాయుడుపై వ్యతిరేకత లేదన్నారు.కానీ, అదే సమయంలో  స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలపై తీవ్రమైన వ్యతిరేకత ఉందని జేసీ దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ విషయాలను తాను బాబు దృష్టికి తీసుకొచ్చినట్టుగా ఆయన తెలిపారు.

రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత కూడ తమను వైసీపీ, బీజేపీలో చేరాలని కూడ ఆహ్వానాలు అందినట్టుగా జేసీ తేల్చిచెప్పారు.  కానీ పార్టీ మార్పుపై ఇప్పటికిప్పుడే నిర్ణయాలు తీసుకోలేమని చెప్పారు.

రాష్ట్రంలో ఆయా పార్టీలను బలోపేతం చేసేందుకు నాయకత్వాలు పనిచేస్తున్నాయని ఈ క్రమంలోనే తమను ఆయా పార్టీలు  సంప్రదించినట్టుగా జేసీ దివాకర్ రెడ్డి చెప్పారు. అయితే తాను ఇంకా టీడీపీలోనే ఉన్నానని ఆయన తెలిపారు.

పార్లమెంట్ ఎన్నికలకు ముందు తాను నరేంద్రమోడీని చాలాసార్లు కలిసినట్టుగా జేసీ చెప్పారు. కానీ, ఏనాడూ కూడ అమిత్ షాను కలవలేదన్నారు. కొందరు బీజేపీ నేతలు తనను ఆ పార్టీలో చేరాలని కోరిన విషయాన్ని జేసీ ధృవీకరించారు.

చంద్రబాబునాయుడు పరిపాలనపై పెట్టిన శ్రద్ద పార్టీపై పెట్టలేదని జేసీ దివాకర్ రెడ్డి చెప్పారు. ఇదే విషయాన్ని తాను పలుమార్లు బాబు దృష్టికి తీసుకొచ్చినట్టుగా చెప్పారు జన్మభూమి కమిటీలతో పాటు పార్టీలో చోటు చేసుకొన్న పరిణామాలపై పబ్లిక్ మీటింగ్‌లలో కూడ నిర్భయంగానే తాను చెప్పానన్నారు.చంద్రబాబునాయుడుతో ముఖాముఖి సమావేశాల్లో  బాబు వ్యవహరిస్తున్న తీరుపై తాను బల్లచరిచి మాట్లాడినట్టుగా జేసీ దివాకర్ రెడ్డి చెప్పారు.

పార్టీ నేతలు చాలా మంది ఇబ్బంది పడ్డారని జేసీ దివాకర్ రెడ్డి గుర్తు చేశారు. కేశినేని నానే కాదు... చాలా మంది నేతలు పార్టీలో చోటు చేసుకొన్న పరిణామాలతో కష్టాలు అనుభవించారని ఆయన చెప్పారు.

సినిమా హీరోలకు ఉన్న పాపులారిటీ కారణంగా వారి సభలకు జనం వచ్చే అవకాశం ఉందన్నారు. పవన్ కళ్యాణ్ పార్టీ పరిస్థితి ఏమిటో అర్ధమైందన్నారు. జనసేనలో చేరాలని తనకు కూడ పవన్ కళ్యాణ్ ఆహ్వానం పంపారని ఆయన గుర్తు చేసుకొన్నారు. కానీ, ఆనాడే తన అభిప్రాయాన్ని పవన్ కళ్యాణ్‌కు కుండబద్దలు కొట్టినట్టు చెప్పినట్టుగా ఆయన గుర్తు చేసుకొన్నారు.

జూనియర్ ఎన్టీఆర్ మంచి నటుడు... అయితే ఆయన ఇప్పటి నుండి రాజకీయాల్లో చేరితే కొంత కాలానికి మంచి నాయకుడిగా ఎదిగే అవకాశం ఉందన్నారు. కానీ, టీడీపీకి చంద్రబాబునాయుడే పెద్ద దిక్కు అని ఆయన అన్నారు. చంద్రబాబుకు దూరదృష్టి ఉంది. గ్రామీణ ప్రాంతాలను అభివృద్ది చేయాలనే ఉద్దేశ్యం కూడ ఉందని  జేసీ దివాకర్ రెడ్డి చెప్పారు.

తన కొడుకు పవన్ కుమార్ రెడ్డి చిన్న వాడు కాదు... 47 ఏళ్ల వయస్సు ఉంది.  ఏది మంచో.. ఏది చెడో నిర్ణయం తీసుకొనే సామర్ధ్యం ఆయనకు ఉందన్నారు. టీడీపీలో ఉండాలో... వైసీపీలో చేరాలో... నిర్ణయం తీసుకొనే శక్తి ఆయనకు ఉందన్నారు. తాను మాత్రం ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా ఆయన గుర్తు చేశారు.

జగన్ అనేక కష్టాలు పడ్డారు. అందుకే ఆయన రాజకీయాల్లో రాటుదేలాడని జేసీ అభిప్రాయపడ్డారు. లోకేష్‌కు కష్టాలు ఎదురుకాలేదన్నారు. అందుకే ఆయన రాటుదేలలేదన్నారు. టీడీపీ నుండి  బీజేపీలో చేరితే ఏం ప్రయోజనం ఉండదని చెప్పారు.

loader