ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన కాన్వాయ్‌ని నెల తిరక్కుండానే మార్చివేశారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత ప్రభుత్వం ఆయనకు ప్రత్యేక కాన్వాయ్‌ని సమకూర్చిన సంగతి తెలిసిందే.

తాజాగా ఇప్పుడు ఆ కాన్వాయ్ స్థానంలో ఆరు కొత్త బ్లాక్ ఫార్చ్యూనర్ వాహనాలు వచ్చి చేరాయి. జగన్ భద్రత దృష్ట్యా ప్రభుత్వం కొత్తగా ఈ వాహనాలను కొనుగోలు చేసింది. ఇదే సమయంలో పాత కాన్వాయ్‌ని హైదరాబాద్‌కు చేర్చారు.

ఇకపై జగన్ ఎప్పుడు హైదరాబాద్ వెళ్లినా ఇదే కాన్వాయ్‌ని ఉపయోగిస్తారు. ఇక కొత్త కాన్వాయ్‌లోని వాహనాలకు ఏపీ 39 పీఏ 2345 నెంబర్‌ను కేటాయించారు.