ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావుతో సహా ఆయన కుమారుడు, కుమార్తెలపై కబ్జాలు, బలవంతపు వసూళ్ల కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో కేసుల వ్యవహారంపై  తొలిసారి స్పందించారు కోడెల. సత్తెనపల్లి కేసులపై ప్రభుత్వం సిట్ విచారణ జరుపుతామంటోందని.. ఎలాంటి విచారణను ఎదుర్కొనేందుకైనా తాను సిద్ధమన్నారు.

తనను బద్నాం చేసేందుకే ఇలా చేస్తున్నారని కోడెల ఒకింత ఆవేదన వ్యక్తం చేశారు. కాగా అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని రాజకీయాల్లో ఇది మంచి పరిణామాలు కావని కోడెల స్పష్టం చేశారు.

ముందుగా ప్రత్యేక హోదా, పోలవరం, కరువు పరిస్థితులపై దృష్టి పెడితే మంచిదని కోడెల తెలిపారు. విజయసాయిరెడ్డి ప్రోత్సాహంతోనే టీడీపీ కార్యకర్తలపై కేసులు పెట్టి.. వారిని వేధిస్తున్నారని శివప్రసాద్ ఆరోపించారు.