ప్రముఖ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి మీటూ ఉద్యమం నేపథ్యంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ప్రముఖ రచయిత వైరముత్తు తనని లైంగికంగా వేధించాడంటూ చిన్మయి సంచలన ఆరోపణలు చేసింది. ఈ వివాదం విషయంలో చిన్మయికి కొందరు మద్దతు తెలిపారు.. మరికొందరు వ్యతిరేకించారు. చిన్మయి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. మహిళలకు సంబంధించిన ప్రతి అంశం గురించి స్పందిస్తూ ఉంటుంది. 

తాజాగా ఓ అభిమాని ట్విట్టర్ వేదికగా చిన్మయిపై అసభ్యకర కామెంట్స్ చేశాడు. వస్తావా అంటూ చిన్మయికి అసభ్యంగా మెసేజ్ లు పెట్టాడు. అతడు పంపిన సందేశాల్ని చిన్మయి ట్వీట్ చేసింది. మీతో మాట్లాడాడాలని చాలా రోజుల నుంచి ప్రయత్నిస్తున్నాను. కానీ మీరు స్పందించడం లేదు. అందులో ఇలా మెసేజ్ లు పెట్టాను.. సారీ అంటూ ఓ నెటిజన్ కామెంట్స్ పెట్టాడు. 

నిజమైన అభిమాని ఎవరైనా ఇలా స్పందిస్తారా అంటూ చిన్మయి ప్రశ్నించింది. చిన్మయి ట్వీట్ కు మరో నెటిజన్ స్పందించాడు. మీరు అభిమానులకు చిరాకు తెప్పించే వరకు స్పందించారు. కానీ ఇలా విమర్శించడానికి మాత్రం సమయం ఉంటుంది. ఒక అభిమానికి హలో, హాయ్ చెప్పడానికి మాత్రం మీకు సమయం ఉండదు అని విమర్శించాడు. 

దీనికి చిన్మయి బదులిస్తూ.. నాకు రోజుకు 1000 మెసేజ్ లు వస్తాయి. వాటన్నింటికి స్పందిస్తూ కూర్చోవడం నా పనా అని చిన్మయి కౌంటర్ ఇచ్చింది. ఇదిలా ఉండగా చిన్మయి మన్మథుడు 2 టీజర్ ని షేర్ చేయడం పై ట్రోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. మహిళలపై జరుగుతున్న లైంగిక దాడుల గురించి స్పందించే చిన్మయి నాగార్జున అమ్మాయిలతో రొమాన్స్ చేసే వీడియోల్ని మాత్రం షేర్ చేస్తుంది. అది తన భర్త తెరకెక్కిస్తున్న చిత్రం కాబట్టి చిన్మయి స్వార్థంగా ఆలోచిస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.