దివంగత శ్రీదేవి నటవారసురాలిగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మొదటి చిత్రం 'ధడక్' తో సక్సెస్ అందుకొని తన సత్తా చాటింది జాన్వీకపూర్. ఆ తరువాత హీరోయిన్ గా ఆమెకి వరుస అవకాశాలు వస్తున్నాయి.

ప్రస్తుతం తొలి లేడీ పైలట్ గుంజన్ సక్సేనా జీవిత కథతో రూపొందిస్తోన్న సినిమాలో నటిస్తోంది. అలానే 'తక్త్' అనే మరో చారిత్రాత్మక చిత్రంలో నటిస్తోంది. తెరపై అందంగా కనిపించడంకోసం జాన్వీ జిమ్ లో చాలాసేపు కష్టపడుతూ ఉంటుంది. ఫిజికల్ ఫిట్నెస్ తో పాటు పలు రకాల నృత్యాల్లోనూ శిక్షణ పొందుతోంది. 

తాజాగా జాన్వీ డాన్స్ ప్రాక్టీస్ చేస్తోన్న వీడియో బయటకి వచ్చింది. జాన్వీ బెల్లీ డాన్స్ చేస్తోన్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన అభిమానులు లైక్ లు, కామెంట్లు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఇప్పటివరకు ఈ వీడియోకి మూడు లక్షలకు పైగా వ్యూస్ రావడం విశేషం. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

#janhvikapoor belly dancing moves 🔥🔥🔥🔥

A post shared by Viral Bhayani (@viralbhayani) on Jun 16, 2019 at 1:42am PDT