చాలా కాలంగా రకరకాల వివాదాలతో రిలీజ్ అవుతుందో లేదో డైలమోలో ఉన్న  మంచు విష్ణు హీరో  తాజా చిత్రం 'ఓటర్'. పొలిటిక‌ల్ డ్రామా గా తెరకెక్కిన ఈ చిత్రం ఓటర్ గొప్పతనం, ఓటు ప్రాముఖ్యత గురించి చర్చిస్తుంది. అయితే ఎలక్షన్స్ మూడ్ అయ్యిపోయి, రిజల్ట్స్ కూడా వచ్చేసి , ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ఇప్పుడు రిలీజ్ అవుతూండటంతో ఎంతవరకూ ఇంపాక్ట్ చూపుతుందనేది అనుమానమే. ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా తాజాగా చిత్రం ట్రైలర్ విడుదల చేసారు. 

ట్రైలర్ లో  ఎన్నికల ప్రచారంలో ఓటర్లకు ఇష్టమొచ్చినట్లు వాగ్దానాలు ఇచ్చి ఎన్నికల తరవాత వాళ్లను పట్టించుకోని రాజకీయ నాయకుల పనిపట్టే ఓటర్‌గా ఈ సినిమాలో మంచు విష్ణు కనిపించబోతున్నాడని అర్దమవుతోంది. ప్రజలను మోసం చేసిన రాజకీయ నాయకులను తన తెలివితేటలతో హీరో ఎలాంటి గుణపాఠం నేర్పాడో చూపిస్తున్నారు. 

జిఎస్ కార్తీక్ దర్శకుడు. ర‌మా రీల్స్ బ్యాన‌ర్‌పై ఈ చిత్రాన్ని జాన్‌సుధీర్ పూదోట నిర్మిస్తుండగా, సుర‌భి హీరోయిన్‌గా న‌టిస్తుంది.  ఎస్‌.ఎస్.త‌మ‌న్ సంగీత సార‌థ్యం వ‌హిస్తుండగా రాజేష్ యాద‌వ్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. సంప‌త్‌రాజ్‌, నాజ‌ర్‌, పోసాని కృష్ణ‌ముళి, ప్ర‌గ‌తి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.  

 నిర్మాత జాన్‌ సుధీర్‌ మాట్లాడుతూ –  ‘‘మంచు విష్ణు తొలిసారి నటించిన పొలిటికల్‌ డ్రామా ఇది. ఓటు విలువను తెలియజేసే చిత్రం. షూటింగ్‌ మొత్తం పూర్తయింది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎస్‌.ఎస్‌. తమన్, కెమెరా: రాజేష్‌ యాదవ్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: కిరణ్‌ తనమల.