MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • TASK: విద్యార్థుల‌కు టెక్ స్కిల్స్‌లో శిక్ష‌ణ‌.. డెల్ కంపెనీతో ప్ర‌భుత్వం కీల‌క ఒప్పందం

TASK: విద్యార్థుల‌కు టెక్ స్కిల్స్‌లో శిక్ష‌ణ‌.. డెల్ కంపెనీతో ప్ర‌భుత్వం కీల‌క ఒప్పందం

TASK: తెలంగాణలో విద్యార్థులను భవిష్యత్ ఉద్యోగ మార్కెట్‌కు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం మరో కీలక కార్యక్రమాన్ని చేపట్టింది. యువతకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణ అందించడంతో పాటు ఉద్యోగ నైపుణ్యాల‌ను నేర్పించ‌నున్నారు.

2 Min read
Author : Narender Vaitla
Published : Sep 19 2026, 09:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
25 శిక్షణ కేంద్రాల్లో 5,500 మందికి అవకాశం
Image Credit : Gemini AI

25 శిక్షణ కేంద్రాల్లో 5,500 మందికి అవకాశం

తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (TASK), డెల్ టెక్నాలజీస్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ‘ఉడాన్’ కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 25 శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి విద్యార్థులకు ప్రత్యేక ట్రైనింగ్ ఇవ్వనున్నారు. మొత్తం 5,500 మంది విద్యార్థులు ఈ కార్యక్రమం ద్వారా ప్రయోజనం పొందనున్నారు. మూడు నెలల వ్యవధిలో శిక్షణ పూర్తి చేసేలా కార్యక్రమాన్ని రూపొందించారు. పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు కూడా సాంకేతిక విద్యను అందుబాటులోకి తీసుకురావడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
AI నుంచి క్లౌడ్ వరకు ఆధునిక టెక్నాలజీపై ట్రైనింగ్
Image Credit : Getty

AI నుంచి క్లౌడ్ వరకు ఆధునిక టెక్నాలజీపై ట్రైనింగ్

ప్రస్తుత ఉద్యోగ మార్కెట్‌లో డిమాండ్ ఉన్న విభాగాలను శిక్షణలో చేర్చనున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), క్లౌడ్ కంప్యూటింగ్, ఎలక్ట్రానిక్స్ తయారీ, ఎమర్జింగ్ టెక్నాలజీస్, డిజిటల్ స్కిల్స్ వంటి అంశాల్లో విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు. కేవలం సర్టిఫికెట్ పొందడమే కాకుండా ఉద్యోగాల్లో ఉపయోగపడే ప్రాక్టికల్ నైపుణ్యాలను అభివృద్ధి చేయడమే ఈ శిక్షణ ప్రధాన ఉద్దేశంగా ప్రభుత్వం చెబుతోంది.

35
IIT ఢిల్లీ కరిక్యులమ్‌తో ప్రత్యేక శిక్షణ
Image Credit : Asianet News

IIT ఢిల్లీ కరిక్యులమ్‌తో ప్రత్యేక శిక్షణ

‘ఉడాన్’లో భాగంగా విద్యార్థులకు అందించే శిక్షణకు IIT ఢిల్లీ రూపొందించిన కరిక్యులమ్‌ను ఉపయోగించనున్నారు. దీనివల్ల పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులకు శిక్షణ అందించే అవకాశం ఉంటుంది. డెల్ టెక్నాలజీస్ ఈ కార్యక్రమానికి సాంకేతిక సహకారం అందించనుంది. విద్యార్థులు ప్రస్తుతం చదువుతున్న కోర్సులతో పాటు భవిష్యత్‌లో అవసరమయ్యే టెక్నాలజీ నైపుణ్యాలను కూడా నేర్చుకునేలా శిక్షణ విధానాన్ని రూపొందించారు.

45
ఉద్యోగాలతో పాటు అప్రెంటిస్‌షిప్, వ్యాపార అవకాశాలు
Image Credit : Gemini

ఉద్యోగాలతో పాటు అప్రెంటిస్‌షిప్, వ్యాపార అవకాశాలు

విద్యార్థులను కేవలం ఉద్యోగాలకు మాత్రమే సిద్ధం చేయడం ఈ కార్యక్రమం ఉద్దేశం కాదని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. శిక్షణ పూర్తయ్యాక అప్రెంటిస్‌షిప్ అవకాశాలను అందిపుచ్చుకునేలా విద్యార్థులకు మార్గనిర్దేశం చేయడంతో పాటు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వైపు వెళ్లేందుకు కూడా అవసరమైన నైపుణ్యాలను పెంచనున్నారు. విద్య నుంచి స్కిల్లింగ్, అక్కడి నుంచి ఉద్యోగం లేదా స్వయం ఉపాధి దిశగా విద్యార్థులను తీసుకెళ్లే విధంగా కార్యక్రమాన్ని రూపొందించినట్లు మంత్రి వివరించారు.

55
ట్రైనింగ్‌ నుంచి ఎంప్లాయ్‌మెంట్‌ వరకు ఎకోసిస్టమ్
Image Credit : Asianet News

ట్రైనింగ్‌ నుంచి ఎంప్లాయ్‌మెంట్‌ వరకు ఎకోసిస్టమ్

విద్యార్థుల నైపుణ్యాభివృద్ధికి TASK–Dell భాగస్వామ్యం ఉపయోగపడుతుందని శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. శిక్షణ పొందిన యువతకు పరిశ్రమలో ఉన్న అవకాశాలపై అవగాహన కల్పిస్తూ ఉద్యోగాలకు అవసరమైన సామర్థ్యాలను పెంచడం ద్వారా ట్రైనింగ్ నుంచి ఎంప్లాయ్‌మెంట్ వరకు ఒక సమగ్ర వ్యవస్థను బలోపేతం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల యువతకు ఆధునిక టెక్నాలజీపై శిక్షణ అందించడం ద్వారా భవిష్యత్ ఉద్యోగ అవకాశాలకు వారిని మరింత సన్నద్ధం చేయనున్నట్లు మంత్రి తెలిపారు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
తెలంగాణ
విద్య
ఉద్యోగాలు, కెరీర్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Cold Free Winter: ఈసారి చలి లేనట్టే.. శీతాకాలంలో పెరగనున్న ఉష్ణోగ్రతలు.. ఎందుకిలా?
Recommended image2
PM Kisan 24th Installment: రైతులకు గుడ్ న్యూస్.. పీఎం కిసాన్ 24వ విడత డబ్బులు ఖాతాలోకి ఎప్పుడంటే?
Recommended image3
హైద‌రాబాద్ అంత ఉన్న దేశం.. ప్ర‌పంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన ప్రాంతంగా ఎలా మారింది.?
Related Stories
Recommended image1
అమెరికాలో ఇళ్ల బయట జనం ఎందుకు కనిపించరు.? ఇంతకీ వాళ్లేం చేస్తుంటారు.?
Recommended image2
OYO: లోక‌ల్ ఐడీ ప్రూఫ్ ఉంటే.. ఓయో రూమ్ ఇవ్వ‌రా.? అస‌లు చ‌ట్టం ఏం చెబుతోంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved