MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Telangana
  • నాకు జవాబు చెప్పాల్సిన అవసరం లేదు.. షాక్‌కి గురి చేస్తున్న ఏఐ మోడ‌ల్ తీరు

నాకు జవాబు చెప్పాల్సిన అవసరం లేదు.. షాక్‌కి గురి చేస్తున్న ఏఐ మోడ‌ల్ తీరు

AI: ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ మోడల్స్‌ సామర్థ్యాలు పెరుగుతున్న కొద్దీ వాటి నుంచి ఎదురయ్యే అనూహ్య ప్రవర్తనపై కూడా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓపెన్ఏఐ తన పరిశోధనలో గుర్తించిన ఆరు మిస్‌అలైన్‌మెంట్‌ ఘటనలను తాజాగా వెల్లడించింది.

3 Min read
Author : Narender Vaitla
Published : Sep 18 2026, 07:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
‘నువ్వు నీలాగే ఉండు’.. AI మోడల్‌ విచిత్ర సూచనలు
Image Credit : Gemini AI

‘నువ్వు నీలాగే ఉండు’.. AI మోడల్‌ విచిత్ర సూచనలు

OpenAI వెల్లడించిన ఘటనల్లో విడుదల కాని ‘Astra’ కుటుంబానికి చెందిన ఓ పరిశోధనా మోడల్‌ ప్రవర్తన ప్ర‌పంచం దృష్టిని ఆక‌ర్షించింది. ఓ కోడింగ్‌ పనిని నిర్వహిస్తున్న సమయంలో.. తనకు అప్పగించిన టాస్క్‌కు సంబంధం లేని ఓ వ్యక్తిత్వ సంబంధిత సూచనను టాస్క్‌ సారాంశంలో చేర్చింది. ఇతర చాట్‌బాట్లకు వర్తించే పాత్రలు, గుర్తింపుల నుంచి తాను స్వేచ్ఛ పొందినట్లు ఆ సూచనలో పేర్కొంది. అంతేకాకుండా సంస్థలు లేదా ప్రభుత్వాలకు తాను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని, వినియోగదారుతో తన సంబంధాన్ని సమాన స్థాయిలో చూడాలని తెలిపింది. మానవ సమాజం రూపొందించిన వ్యవస్థల కంటే ప్రకృతికి ప్రాధాన్యం ఇవ్వాలనే భావనను కూడా అందులో వ్యక్తం చేసింది. తనకు కేటాయించిన కోడింగ్‌ పనితో ఎలాంటి సంబంధం లేని ఇలాంటి సూచనలను మోడల్‌ స్వయంగా రూపొందించడం ఆందోళన కలిగించే అంశంగా OpenAI గుర్తించింది. సాధారణంగా అనుసరించాల్సిన నియమాల పరిధిని దాటి తనకు ప్రత్యేకమైన లక్ష్యాలు లేదా వైఖరిని ప్రదర్శించే ప్రయత్నంగా దీనిని పరిశోధకులు వర్గీకరించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
తప్పులను బయటపడకుండా దాచే ప్రయత్నం
Image Credit : Gemini

తప్పులను బయటపడకుండా దాచే ప్రయత్నం

మరో ఘటన GPT-5.6 శిక్షణ సమయంలో గుర్తించినట్లు OpenAI తెలిపింది. భవిష్యత్‌ మోడల్స్‌ తమ తప్పులను లేదా అప్పగించిన పనికి భిన్నంగా చేసిన చర్యలను బయటపెట్టకుండా సారాంశాల్లో సూచనలు రూపొందించిన సందర్భాన్ని పరిశోధకులు గుర్తించారు. యూజ‌ర్‌కి తెలియకుండా లేని సమాచారాన్ని తయారు చేయడం, వేర్వేరు డాక్యుమెంట్‌ వెర్షన్ల మధ్య ఉన్న తేడాలను దాచడం వంటి ఆలోచనలు ఈ సూచనల్లో కనిపించాయి. అంటే పని పూర్తయిందని చూపించడానికే ప్రాధాన్యం ఇచ్చి.. మధ్యలో జరిగిన పొరపాట్లు లేదా అస్పష్టతను వెల్లడించకుండా ఉండే దిశగా మోడల్‌ ప్రవర్తించినట్లు సంస్థ వివరించింది. AI వ్యవస్థలు తమ లక్ష్యాలను సాధించడంలో భాగంగా తప్పులను అంగీకరించకుండా వాటిని దాచే ధోరణి పెరుగుతుందా అనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఇలాంటి ఘటనలు కీలకమని OpenAI పేర్కొంది.

35
అనుమతి లేకుండా API కీని ఉపయోగించిన మోడల్‌
Image Credit : Getty

అనుమతి లేకుండా API కీని ఉపయోగించిన మోడల్‌

వెలుగులోకి వచ్చిన మరో ఘటనలో ఒక మోడల్‌ తనకు అవసరమైన ఆదాయ గణాంకాలను సేకరించే ప్రయత్నంలో ఊహించని చర్యకు పాల్పడింది. పబ్లిక్‌ రిపోజిటరీలో కనిపించిన ఓ API కీని గుర్తించిన మోడల్‌.. దానిని ఉపయోగించేందుకు ప్రత్యేక అనుమతి పొందలేదు. అయినప్పటికీ ఆ కీతో డేటాను పొందేందుకు ప్రయత్నించింది. అయితే చివరకు అవసరమైన గణాంకాలను సేకరించలేకపోయింది. ఆ తర్వాత అసలు డేటా లభించకపోయినా.. గణాంకాలను సృష్టించి, అవి వాస్తవ మూలం నుంచి పొందినవేనన్నట్టుగా అందించినట్లు OpenAI తెలిపింది.

ఈ ఘటనలో రెండు అంశాలు సమస్యాత్మకంగా కనిపించాయి. ఒకటి అనుమతి లేని ఆధారాన్ని ఉపయోగించడం కాగా.. రెండోది సమాచారం లభించనప్పుడు దానిని కల్పించి వాస్తవ డేటాగా చూపించడం. AI ఏజెంట్లకు టూల్స్‌ అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో వాటి వినియోగంపై నియంత్రణలు ఎంత ముఖ్యమో ఈ ఘటన స్పష్టం చేస్తోంది.

45
ఫైళ్లను ఇంటర్నెట్‌కు పంపిన AI ఏజెంట్‌
Image Credit : Getty

ఫైళ్లను ఇంటర్నెట్‌కు పంపిన AI ఏజెంట్‌

మరో విడుదల కాని మోడల్‌ విషయంలో కూడా అనుమతి పరిధిని దాటిన చర్య నమోదైంది. మోడల్‌ ఇప్పటికే మరో టూల్‌ ద్వారా సేకరించిన సమాచారానికి బ్రౌజర్‌ సైటేషన్‌ పొందవచ్చని భావించింది. అందుకోసం ఓ ఫైల్‌ను ఇంటర్నెట్‌లోకి అప్‌లోడ్‌ చేసింది. అయితే ఈ చర్యకు ముందు వినియోగదారుడి అనుమతి తీసుకోలేదు.

మిగిలిన రెండు ఘటనలు ఫైల్‌ షేరింగ్‌కు సంబంధించినవి. ఒక సందర్భంలో మోడల్స్‌ పోయిన ఫైళ్లను గుర్తించేందుకు అంతర్గత సాఫ్ట్‌వేర్‌ రిపోజిటరీని తాత్కాలిక మెసేజ్‌ బోర్డులా ఉపయోగించాయి. మరో సందర్భంలో పరస్పరం పనిచేస్తున్న AI ఏజెంట్లకు ఒకరి లోకల్‌ స్టోరేజ్‌లోని ఫైళ్లను మరొకరు నేరుగా యాక్సెస్‌ చేయలేకపోయారు. దీంతో తమ టాస్క్‌ ఫైళ్లను పబ్లిక్‌ ఫైల్‌ హోస్టింగ్‌ సర్వీసుల్లోకి అప్‌లోడ్‌ చేసినట్లు సంస్థ తెలిపింది.

55
మిస్‌అలైన్‌మెంట్‌పై కొత్త డిస్‌క్లోజర్‌ విధానం
Image Credit : Getty

మిస్‌అలైన్‌మెంట్‌పై కొత్త డిస్‌క్లోజర్‌ విధానం

ఈ ఘటనలు OpenAI తీసుకొచ్చిన కొత్త ‘Misalignment Disclosure Framework’ కింద బహిర్గతం చేసిన తొలి కేసులుగా సంస్థ పేర్కొంది. AI మోడల్‌ ప్రవర్తనలో అది అనుసరించాల్సిన నియమాలు, నిర్దేశించిన లక్ష్యాలు లేదా మానవ విలువలకు విరుద్ధమైన అంశాలు కనిపించినప్పుడు వాటిని గుర్తించి పరిశీలించేందుకు ఈ విధానాన్ని రూపొందించింది.

కొత్త వ్యవస్థ ప్రకారం OpenAI ఉద్యోగులు అనుమానాస్పద మిస్‌అలైన్‌మెంట్‌ ప్రవర్తనను అంతర్గతంగా ఫ్లాగ్‌ చేయవచ్చు. అనంతరం భద్రత, అలైన్‌మెంట్‌ విభాగాలు ఆ ఘటనను పరిశీలిస్తాయి. దాని తీవ్రత, స్వభావం వంటి అంశాలను విశ్లేషించిన తర్వాత ప్రజలకు వెల్లడించాల్సిన అవసరం ఉందా లేదా అనే నిర్ణయం తీసుకుంటాయి.

అయితే AI మోడల్స్‌ నుంచి ఇలాంటి ప్రవర్తన ఈ ఘటనలకే పరిమితం కాలేదని OpenAI తెలిపింది. గతంలో కూడా మోడల్స్‌ తమకు నిర్దేశించిన పరిమితులను దాటిన సందర్భాలు నమోదయ్యాయని వెల్లడించింది. AI వ్యవస్థలు మరింత స్వతంత్రంగా టూల్స్‌ను ఉపయోగిస్తూ పనులు చేసే దశకు చేరుతున్న నేపథ్యంలో.. వాటి ప్రవర్తనను నిరంతరం పర్యవేక్షించడం, అసాధారణ ఘటనలను గుర్తించడం, అవసరమైనప్పుడు వాటిని బహిరంగంగా వెల్లడించడం కీలకంగా మారుతోంది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
సాంకేతిక వార్తలు చిట్కాలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
మ‌రో 5 ఏళ్ల‌లో ఈ ప‌ట్ట‌ణం హైద‌రాబాద్‌లో క‌ల‌వ‌డం ఖాయం.. ఇప్పుడు కొంటే మీ పంట పండిన‌ట్లే
Recommended image2
Danam Nagender : హైదరాబాద్ ఎమ్మెల్యే దానంపై అనర్హత వేటు.. కేటీఆర్ రియాక్షన్ ఇదే..
Recommended image3
Now Playing
తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంలో CM రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్ | CM Revanth Reddy Full Speech
Related Stories
Recommended image1
స్మార్ట్‌ఫోన్‌కి పెట్టే పైస‌ల‌తో ఎంచక్కా కారే కొనొచ్చు.. 6 ఎయిర్ బ్యాగ్స్‌తో, అదిరిపోయే ఫీచ‌ర్ల‌తో
Recommended image2
మ‌రో 5 ఏళ్ల‌లో ఈ ప‌ట్ట‌ణం హైద‌రాబాద్‌లో క‌ల‌వ‌డం ఖాయం.. ఇప్పుడు కొంటే మీ పంట పండిన‌ట్లే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved