MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • National
  • Delhi: కేంద్రం సంచలన నిర్ణయం.. ఢిల్లీలో జాతీయ భద్రతా చట్టం. దీంతో ఏం జరగనుందంటే.?

Delhi: కేంద్రం సంచలన నిర్ణయం.. ఢిల్లీలో జాతీయ భద్రతా చట్టం. దీంతో ఏం జరగనుందంటే.?

Delhi: దేశ రాజధాని ఢిల్లీలో కొనసాగుతున్న ఆందోళనలు, శాంతిభద్రతల పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ భద్రతా చట్టం కింద ఢిల్లీ పోలీస్ కమిషనర్‌కు ప్రత్యేక అధికారాలను కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

2 Min read
Author : Narender Vaitla
Published : Jul 23 2026, 03:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పోలీస్ కమిషనర్‌కు లభించిన ప్రత్యేక అధికారాలు ఏంటి.?
Image Credit : Getty

పోలీస్ కమిషనర్‌కు లభించిన ప్రత్యేక అధికారాలు ఏంటి.?

జాతీయ భద్రతా చట్టంలోని నిబంధనల ప్రకారం ఢిల్లీ పోలీస్ కమిషనర్‌కు నిర్దిష్ట కాలపరిమితి వరకు ప్రత్యేక అధికారాలు అమల్లోకి వచ్చాయి. ఈ అధికారాల ద్వారా ప్రజా భద్రతకు లేదా శాంతిభద్రతలకు ముప్పుగా భావించే వ్యక్తులపై చట్టప్రకారం నిర్బంధ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. లెఫ్టినెంట్ గవర్నర్ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఈ అధికారాలు జులై 19 నుంచి అక్టోబర్ 18 వరకు అమల్లో ఉంటాయి. దేశ రాజధానిలో భద్రతా వ్యవస్థను మరింత సమర్థంగా నిర్వహించడం, అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించడం ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశ్యమని అధికారులు తెలిపారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
నిరసనలతో సంబంధం లేదన్న ఢిల్లీ పోలీసులు
Image Credit : X

నిరసనలతో సంబంధం లేదన్న ఢిల్లీ పోలీసులు

ఈ నిర్ణయం నీట్ పరీక్షల వ్యవహారంపై కొనసాగుతున్న నిరసనలను అణచివేసేందుకేనని ప్రచారం జ‌ర‌గ‌డంతో ఢిల్లీ పోలీసులు స్పందించారు. పోలీస్ కమిషనర్‌కు ఈ అధికారాలు ఇవ్వడం కొత్త విషయం కాదని, ఇది ప్రతి మూడు నెలలకోసారి జరిగే సాధారణ పరిపాలనా ప్రక్రియలో భాగమేనని స్పష్టం చేశారు. అధికారాల పునరుద్ధరణకు సంబంధించిన ఉత్తర్వులు నిరసనలు తీవ్రరూపం దాల్చకముందే జారీ అయ్యాయని, ప్రస్తుతం కొనసాగుతున్న ఆందోళనల కారణంగా ప్రత్యేకంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు. ఈ రెండు అంశాలను ముడిపెట్టి చూడడం సరైనది కాదని కూడా వెల్లడించారు.

35
నీట్ వ్యవహారంపై ఢిల్లీలో కొనసాగుతున్న ఆందోళనలు
Image Credit : x.com/CJP_for_India

నీట్ వ్యవహారంపై ఢిల్లీలో కొనసాగుతున్న ఆందోళనలు

నీట్ పరీక్షలలో జరిగిన అవకతవకలపై దేశవ్యాప్తంగా విద్యార్థులు నిరసనలు కొనసాగిస్తున్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ప్రారంభమైన ఆందోళనలు క్రమంగా మరింత విస్తరించాయి. విద్యార్థులతో పాటు వివిధ యువజన సంఘాలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా ఈ నిరసనలకు మద్ధతు తెలుపుతున్నారు. దేశంలోని పలు రాష్ట్రాల నుంచి యువత ఢిల్లీకి చేరుకుని ఆందోళనల్లో పాల్గొంటోంది. పరీక్షల పారదర్శకత, బాధ్యులపై కఠిన చర్యలు, విద్యార్థులకు న్యాయం చేయాలనే డిమాండ్లతో ఉద్యమం కొనసాగుతోంది.

45
జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. పోలీసు-నిరసనకారుల ఘర్షణ
Image Credit : Asianet News

జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. పోలీసు-నిరసనకారుల ఘర్షణ

గతకొన్ని రోజులుగా  జంతర్ మంతర్ సమీపంలోని సంసద్ మార్గ్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నిరసనకారులు, భద్రతా సిబ్బంది మధ్య తోపులాట చోటుచేసుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలు రంగంలోకి దిగాయి. ఘర్షణల అనంతరం కొన్ని ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. శాంతిభద్రతలకు ఎలాంటి భంగం కలగకుండా అదనపు బలగాలను మోహరించడంతో పాటు అవసరమైన చోట్ల పరిమితులు కూడా అమలు చేశారు.

55
ప్రత్యేక అధికారాల లక్ష్యం ఇదే..
Image Credit : ANI

ప్రత్యేక అధికారాల లక్ష్యం ఇదే..

ప్రజల భద్రత, చట్టవ్యవస్థ పరిరక్షణ కోసం అవసరమైన సందర్భాల్లో ముందస్తు చర్యలు తీసుకునేందుకు ఈ అధికారాలు ఉపయోగపడతాయని అధికారులు చెబుతున్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగే పరిస్థితులు తలెత్తితే చట్టప్రకారం తక్షణ నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు పోలీస్ కమిషనర్‌కు ఉంటుంది. అయితే ఈ అధికారాలు శాశ్వతం కావని, నిర్దిష్ట కాలానికి మాత్రమే పరిమితమని ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశ రాజధానిలో భద్రతను బలోపేతం చేయడం, ప్రజా శాంతిని కాపాడడం, అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించేందుకు పరిపాలనా పరంగా అమలు చేస్తున్న సాధారణ ప్రక్రియలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
భారత దేశం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India Bullet Train: రూ. 2 లక్షల కోట్ల ప్రాజెక్ట్.. 350 కిమీ స్పీడ్‌తో భారత్ సొంత బుల్లెట్ ట్రైన్ చూశారా?
Recommended image2
US India Trade: అమెరికా-ఇండియా ట్రేడ్ పెరిగితే భారతీయులకు ఏం ప్రయోజనం?
Recommended image3
LPG Subsidy: ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్ !
Related Stories
Recommended image1
హైస్పీడ్ రైలు ప్రాజెక్టులో ఉద్యోగాలు.. నెల‌కు రూ. ల‌క్ష‌పైగా జీతం, ఎవ‌రు అర్హులు, ఎలా అప్లై చేసుకోవాలంటే?
Recommended image2
Ather: అవును, ఈ స్కూటీ మీతో మాట్లాడుతుంది.. వాయిస్ కంట్రోల్ ఫీచ‌ర్ ఎలా ప‌ని చేస్తుందంటే.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved