MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Epic First Semester 11 Days Collection: డిజాస్టర్‌ దిశగా ఎపిక్‌ మూవీ, 11 రోజుల కలెక్షన్లు.. మరీ ఇంతనా?

Epic First Semester 11 Days Collection: డిజాస్టర్‌ దిశగా ఎపిక్‌ మూవీ, 11 రోజుల కలెక్షన్లు.. మరీ ఇంతనా?

Epic First Semester 11 Days Collections: `బేబీ` వంటి బ్లాక్‌ బస్టర్‌ తర్వాత ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా `ఎపిక్‌ ఫస్ట్ సెమిస్టర్‌` చిత్రంలో నటించారు. ఇది బాక్సాఫీసు వద్ద డిజాస్టర్‌ దిశగా వెళ్తోంది.

2 Min read
Author : Aithagoni Raju
Published : Sep 22 2026, 07:17 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
ఆడియెన్స్ కనెక్ట్ కాలేకపోయిన ఎపిక్‌
Image Credit : X/@SitharaEnts

ఆడియెన్స్ కనెక్ట్ కాలేకపోయిన ఎపిక్‌

ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన `ఎపిక్‌ ఫస్ట్ సెమిస్టర్‌` మూవీ ఈ నెల 11న విడుదలైన విషయం తెలిసిందే. ఆదిత్య హాసన్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని నాగవంశీ నిర్మించారు. `బేబీ` వంటి బ్లాక్‌ బస్టర్‌ తర్వాత ఆనంద్‌, వైష్ణవి చైతన్య కలిసి నటించిన మూవీ కావడంతో దీనిపై ఆడియెన్స్ లో అంచనాలున్నాయి. పైగా టీజర్‌, ట్రైలర్లు ఆకట్టుకున్నాయి. కానీ ఈ సినిమా ఆడియెన్స్ అంచనాలను అందుకోవడంలో విఫలమయ్యింది. యూకేలో జరిగిన కథగా చూపించడంతో మనవాళ్లకి కనెక్ట్ కాలేదు. పైగా ఎమోషనల్‌ మూమెంట్స్ పెద్దగా లేకపోవడంతో ఆడియెన్స్ సినిమాని రిసీవ్‌ చేసుకోలేకపోయారు. దీంతో ఇది పరాజయం దిశగా వెళ్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఎపిక్‌ మూవీ కలెక్షన్లు
Image Credit : X/@SitharaEnts

ఎపిక్‌ మూవీ కలెక్షన్లు

`ఎపిక్‌` మూవీ విడుదలై 11 రోజులు పూర్తి చేసుకుంది. మరి ఇప్పటి వరకు ఎంత కలెక్ట్ చేసింది. 11వ రోజు దీనికి ఎంత కలెక్షన్లు వచ్చాయనేది చూస్తే, సోమవారం కేవలం నాలుగు లక్షలు మాత్రమే రావడం గమనార్హం. ఆ వారంలో విడుదలైన వాటిలో అత్యంత ప్రామినెంట్‌గా నిలిచిన ఈ చిత్రం చివరికి రెండో వారంలోనే డీలా పడిపోవడం ఆశ్చర్యపరుస్తోంది. ఇక ఈ చిత్రం మొత్తంగా ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా రూ.11.40కోట్లు వసూలు చేసింది. ఇందులో ఇండియాలో రూ.8.75కోట్లు, ఓవర్సీస్‌లో రూ.2.65కోట్లు వచ్చాయి. సిటీ కల్చర్ నేపథ్యంలో సాగిన ఈ మూవీ ఓవర్సీస్‌లోనూ పెద్దగా చేయకపోవడం ఆశ్చర్యపరుస్తోంది.

33
థియేట్రికల్‌గా డిజాస్టర్‌ దిశగా ఎపిక్‌
Image Credit : Asianet News

థియేట్రికల్‌గా డిజాస్టర్‌ దిశగా ఎపిక్‌

ఈ లెక్కన ఈ చిత్రానికి సుమారు ఆరు కోట్ల షేర్‌ వచ్చిందని చెప్పొచ్చు. సినిమా థియేట్రికల్‌గా బ్రేక్‌ ఈవెన్‌ కావాలంటే సుమారు రూ.13-15కోట్ల గ్రాస్‌ రావాలి. ఇంకా ఈ మూవీకి మూడు కోట్ల వరకు రావాల్సి ఉంది. కానీ థియేట్రికల్‌గా ఈ చిత్రం క్లోజింగ్‌కి చేరుకుంది. నాని ప్యారడైజ్‌ వస్తే అన్ని థియేటర్లు ఎత్తేస్తారని చెప్పొచ్చు. ఇంకా ఏమున్నా ఈ రెండు రోజులే. మహా అయితే పది లక్షలు చేస్తుంది. అయితే ఈ సినిమా రేంజ్‌కి, అంచనాలకు ఈజీగా యాభై కోట్లు అయినా చేయాలి. కనీసం ఇరవై ముప్పై కోట్లు అయినా రాబట్టాలి. కానీ పది కోట్ల దగ్గరే పడిపోవడం విచారకరం. ఓటీటీ రూపంలో నిర్మాత సేఫ్ అయినా, థియేట్రికల్‌గా మాత్రం `ఎపిక్‌` డిజాస్టర్‌ ప్రాజెక్ట్ గానే చెప్పొచ్చు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Sara Ali Khan Home: తండ్రి 5000 కోట్ల ఆస్తికి అధిపతి.. రూ.18 కోట్ల హౌస్ లో ఉంటున్న కూతురు
Recommended image2
Naga Chaitanya: నాగార్జున మొదటి భార్య ఇప్పుడేం చేస్తోంది? నాగ చైతన్య తల్లి లక్ష్మి రెండో పెళ్లి చేసుకున్నది ఎవరినో తెలుసా?
Recommended image3
Poonam Kaur: త్రివిక్రమ్ పై పూనమ్ కౌర్ డైరెక్ట్ అటాక్.. మా ఫ్యామిలీ బలహీనతని వాడుకున్నాడు, సంచలన ఆరోపణలు
Related Stories
Recommended image1
Chiranjeevi: హాలీవుడ్ లో పుట్టి ఉంటే ఆస్కార్ అవార్డు వచ్చేది.. అలాంటి నటుడికి దర్శకత్వం వహించిన చిరంజీవి
Recommended image2
Krishnudu Remueration: రెండు వారాలకు కృష్ణుడు పారితోషికం ఎంతో తెలుసా? కూర్చొని లక్షలు సంపాదించాడు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved