MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Asian Games 2026: ఒకే రోజు రెండు సిల్వర్ మెడల్స్ కొట్టిన భారత షూటర్.. ఎవరీ ఎలావెనిల్ వలరివాన్?

Asian Games 2026: ఒకే రోజు రెండు సిల్వర్ మెడల్స్ కొట్టిన భారత షూటర్.. ఎవరీ ఎలావెనిల్ వలరివాన్?

Asian Games 2026: జపాన్‌లోని ఐచి-నాగోయా ఆసియా క్రీడల్లో ఎలావెనిల్ వలరివాన్ రెండు సిల్వర్ మెడల్స్ తో అదరగొట్టింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత, టీమ్ ఈవెంట్లలో మెరిసింది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 21 2026, 09:28 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఆసియా గేమ్స్‌లో డబుల్ ధమాకా
Image Credit : Paris Olympics X

ఆసియా గేమ్స్‌లో డబుల్ ధమాకా

ఆసియా క్రీడలు 2026లో భారత్ గ్రాండ్ గా పతకాల ఖాతా తెరిచింది. జపాన్‌లోని ఐచి-నాగోయాలో జరుగుతున్న ఈ క్రీడల్లో మన స్టార్ షూటర్ ఎలావెనిల్ వలరివాన్ ఒకే రోజు రెండు వెండి పతకాలతో మెరిసింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఇండివిజువల్ ఫైనల్‌తో పాటు టీమ్ ఈవెంట్‌లోనూ భారత్‌కు రజతాలు అందించింది. దీంతో షూటింగ్ విభాగంలో భారత్ శుభారంభం చేసింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
తృటిలో చేజారిన గోల్డ్ మెడల్
Image Credit : instagram/elavenil.valarivan

తృటిలో చేజారిన గోల్డ్ మెడల్

మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో ఎలవేనిల్ చివరి వరకు అద్భుతంగా పోరాడింది. ఫైనల్ వరకు లీడ్‌లో ఉన్నా, జస్ట్ 0.6 పాయింట్ల తేడాతో గోల్డ్ మెడల్ మిస్సయ్యింది. ఎలవేనిల్ మొత్తం 252.4 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచింది. జపాన్‌కు చెందిన తాచి హినాటా 253.0 పాయింట్లతో కొత్త ఆసియా గేమ్స్ రికార్డు నెలకొల్పి పసిడి నెగ్గింది. సౌత్ కొరియాకు చెందిన ఒలింపిక్ ఛాంపియన్ బాన్ హ్యోజిన్ 230.4 పాయింట్లతో కాంస్య పతకం గెలుచుకుంది.

35
టీమ్ ఈవెంట్‌లోనూ అదే జోరు
Image Credit : ANI

టీమ్ ఈవెంట్‌లోనూ అదే జోరు

అంతకుముందు జరిగిన టీమ్ ఈవెంట్‌లోనూ ఎలవేనిల్ భారత్‌కు సిల్వర్ మెడల్ అందించింది. సోనమ్ మస్కార్, విదార్సా వినోద్‌లతో కలిసి ఎలవేనిల్ మొత్తం 1898.0 పాయింట్లు స్కోర్ చేసింది. క్వాలిఫికేషన్ రౌండ్‌లో సోనమ్ 634.1, ఎలవేనిల్ 633.5, విదార్సా 630.4 పాయింట్లు సాధించారు. చైనా జట్టు స్వర్ణం గెలవగా, జపాన్ మూడో స్థానంలో నిలిచింది. వ్యక్తిగత ఫైనల్‌లో బరిలోకి దిగిన మరో భారత షూటర్ సోనమ్ మస్కార్ 167.0 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచింది.

45
ఎవరీ ఎలావెనిల్ వలరివాన్?
Image Credit : instagram/elavenil.valarivan

ఎవరీ ఎలావెనిల్ వలరివాన్?

ఎలవేనిల్ ఆగస్టు 2, 1999న తమిళ కుటుంబంలో జన్మించింది. 13 ఏళ్ల వయసులోనే షూటింగ్‌పై ఆసక్తితో తుపాకీ పట్టింది. ఇప్పటికే 9 ఏళ్ల షూటింగ్ కెరీర్ ఉన్న ఎలవేనిల్, 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ కేటగిరీలో మాజీ వరల్డ్ నంబర్ 1 క్రీడాకారిణి. రెండుసార్లు ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించింది. ప్రపంచకప్‌లు, వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లలో అనేక పతకాలు సాధించింది. క్రీడారంగంలో సాధించిన గొప్ప విజయాలకుగాను భారత ప్రభుత్వం 2022లో ఆమెను ప్రతిష్ఠాత్మక 'అర్జున అవార్డు'తో సత్కరించింది.

55
పతకాల డెడికేషన్.. సపోర్ట్ స్టాఫ్‌కే క్రెడిట్
Image Credit : instagram/elavenil.valarivan

పతకాల డెడికేషన్.. సపోర్ట్ స్టాఫ్‌కే క్రెడిట్

విజయం సాధించిన అనంతరం ఎలవేనిల్ తన ఆనందాన్ని పంచుకుంది. ఈ రెండు పతకాలను తన సపోర్ట్ టీమ్‌కే అంకితం ఇస్తున్నట్లు చెప్పింది. "గత కొన్ని నెలలుగా నా కోచ్, ఫిజియో, సైకాలజిస్ట్, న్యూట్రిషనిస్ట్, ఎస్‌ఎన్‌సీ టీమ్ నాతో కలిసి చాలా కష్టపడ్డారు. ప్రతి క్షణం నన్ను గైడ్ చేశారు. వాళ్ల వల్లే ఈ రోజు నేను దేశం కోసం మెడల్స్ గెలవగలిగాను. ఈ సక్సెస్ క్రెడిట్ అంతా నా సపోర్ట్ స్టాఫ్‌కే దక్కుతుంది" అని ఎలవేనిల్ ఎమోషనల్ అయ్యింది. ఆసియా గేమ్స్‌లో పాల్గొంటున్న భారత అథ్లెట్లందరికీ ఆమె బెస్ట్ విషెస్ తెలిపింది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
భారత దేశం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
virat kohli: ఆ ఆశ్ర‌మానికి వెళ్లినందుకు కోహ్లికి రూ. 5 కోట్లు ఇచ్చారా.? అస‌లేం జ‌రిగిందంటే
Recommended image2
Team India New Captain: టీమిండియాకు కొత్త కెప్టెన్, వైస్ కెప్టెన్లు.. పూర్తి వివరాలు ఇవే
Recommended image3
స్మృతి మంధాన చేతికి టీమిండియా పగ్గాలు.. హర్మన్‌ప్రీత్ స్థానంలో కొత్త కెప్టెన్
Related Stories
Recommended image1
Heavy Rains Alert: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. ఈ ప్రాంతాల్లో వారం రోజులు వర్షాలే వర్షాలు
Recommended image2
Team India ODI captain: గిల్ ఔట్.. న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియా కొత్త వన్డే కెప్టెన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved