MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Chiranjeevi: హాలీవుడ్ లో పుట్టి ఉంటే ఆస్కార్ అవార్డు వచ్చేది.. అలాంటి నటుడికి దర్శకత్వం వహించిన చిరంజీవి

Chiranjeevi: హాలీవుడ్ లో పుట్టి ఉంటే ఆస్కార్ అవార్డు వచ్చేది.. అలాంటి నటుడికి దర్శకత్వం వహించిన చిరంజీవి

ఎన్నో సినిమాల్లో నటించిన ఓ నటుడు ఆస్కార్ సాధించిన సత్తా ఉన్న వ్యక్తి అని పరుచూరి గోపాల కృష్ణ తెలిపారు. ఆ నటుడు నటించిన సన్నివేశానికి చిరంజీవివి ఓ మూవీలో దర్శకత్వం వహించారు అని పరుచూరి తెలిపారు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Sep 22 2026, 06:59 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Chiranjeevi
Image Credit : Asianet News

Chiranjeevi

తెలుగు చిత్ర పరిశ్రమ ఎందరో గొప్ప నటుల్ని ప్రేక్షకులకు అందించింది. ఏఎన్నార్, ఎన్టీఆర్, ఎస్వీఆర్, సావిత్రి, కృష్ణ, చిరంజీవి లాంటి వాళ్ళు ప్రేక్షకుల నీరాజనాలు అందుకున్నారు. కానీ కొందరు నటులు గొప్ప ప్రతిభ ఉన్నప్పటికీ సరైన గుర్తింపునకు నోచుకోలేకపోయారు. అలాంటి నటుల్లో ఒకరైన పీఎల్ నారాయణ గురించి పరుచూరి గోపాల కృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
వందల సినిమాల్లో నటించిన పీఎల్ నారాయణ
Image Credit : Asianet News

వందల సినిమాల్లో నటించిన పీఎల్ నారాయణ

పీఎల్ నారాయణ వందల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు. చిరంజీవి కెరీర్ లో బెస్ట్ మూవీస్ అనదగ్గ ఖైదీ, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, రుద్రవీణ, కొండవీటి రాజా, ఘరానా మొగుడు లాంటి సినిమాల్లో నటించారు. పరుచూరి గోపాల కృష్ణ ఆయన గురించి మాట్లాడుతూ.. పీఎల్ నారాయణ గారు బాపట్లలో నాటకాలలో నటిస్తూ ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చారు. ఆయన ఇక్కడ పుట్టారు కాబట్టి సరైన గుర్తింపు లభించలేదు.

35
హాలీవుడ్ లో పుట్టుంటే లెక్కలేనన్ని ఆస్కార్లు
Image Credit : Asianet News

హాలీవుడ్ లో పుట్టుంటే లెక్కలేనన్ని ఆస్కార్లు

ఆయన హాలీవుడ్ లో పుట్టి ఉంటే లెక్కలేనన్ని ఆస్కార్ అవార్డులు గెలుచుకునేవారు. ఎందులో ఏమాత్రం సందేహం లేదు. అంతటి గొప్ప సహజమైన నటుడు ఆయన. రైతులా నటిస్తే నిజంగా సెట్ లో ఎవరో రైతు ఉన్నారు అని అనుకునేవాళ్లం. అంత సహజంగా కనిపించేవారు. టి కృష్ణ దర్శకత్వం వహించిన చాలా సినిమాల్లో పీఎల్ నారాయణ అద్భుతమైన పాత్రల్లో నటించారు.

45
ఆ మూవీ చూడాల్సిందే
Image Credit : Asianet News

ఆ మూవీ చూడాల్సిందే

ఆయన ప్రతిభ ఏంటో తెలియాలి అంటే కలియుగ మహాభారతం అనే సినిమా ఒక్కసారి చూడండి. ఇంటర్వెల్ కి ముందు వచ్చే సీన్ లో ఆయన నటనకు ఎన్ని అవార్డులు ఇచ్చినా తక్కువే. ఘరానా మొగుడు షూటింగ్ లో ఆయనతో మాకు ఒక ఆసక్తికర అనుభవం ఉంది. ఒక కార్మికుడు తన కారు ముట్టుకున్నాడు అని ఆ కారునే హీరోయిన్ నగ్మ తగలబెట్టేస్తుంది. ఆ తర్వాత ఆమె ప్రమాదంలో ఉన్నప్పుడు చిరంజీవి నగ్మాని ముట్టుకుని కాపాడతాడు.

55
పీఎల్ నారాయణకు దర్శకత్వం వహించిన చిరంజీవి
Image Credit : Asianet News

పీఎల్ నారాయణకు దర్శకత్వం వహించిన చిరంజీవి

అక్కడ ఏదైనా డైలాగ్ ఉంటే బావుంటుంది అని మేము డైరెక్టర్ రాఘవేంద్ర రావు గారికి చెప్పాం. ఆయన అవసరం లేదు.. ఇక్కడితో సీన్ పూర్తి అయిపోయింది. ఇంకా ఏదైనా డైలాగ్ పెడితే అది ఎక్స్ట్రా గా అతికించినట్లు అవుతుంది వద్దు అని అన్నారు. మేము వెళ్లి చిరంజీవి గారికి ఒక డైలాగ్ చెప్పి ఈ సీన్ లో పెడితే బావుంటుంది అని చెప్పాం. డైలాగ్ చాలా బావుంది కదా అలాగే పెడదాం అని అన్నారు. దీనితో చిరంజీవి రాఘవేంద్ర రావుని ఒప్పించారు. మీరంతా ఓకె అనుకున్నాక నేనెందుకు.. ఆ డైలాగ్ కి మీరే దర్శకత్వం వహించండి.. నేను కూర్చుని రెస్ట్ తీసుకుంటా అని రాఘవేంద్ర రావు సరదాగా అన్నారు. దీనితో చిరంజీవి గారు మైక్ పట్టుకుని దర్శకత్వం వహించారు. ఆ డైలాగ్ చెప్పాల్సింది పీఎల్ నారాయణ. కార్మికుడు ముట్టుకుంటే కారు తగలబెట్టారు.. అదే కార్మికుడు మిమ్మల్ని ముట్టుకున్నాడు.. మీ కొంగు తగలబెట్టుకుంటారేమో జాగ్రత్త అని పీఎల్ నారాయణ చెప్పే డైలాగ్ థియేటర్స్ లో మోత మోగించింది. ఆ విధంగా ఘరానా మొగుడు సినిమాలో ఆ ఒక్క డైలాగ్ కి చిరంజీవి దర్శకత్వం వహించినట్లు పరుచూరి గుర్తు చేసుకున్నారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: ఝాన్సీ వల్ల బాటమ్ లోకి షాలిని, రోహిత్.. ఇరగదీసిన నరేష్, రామ్ ప్రసాద్
Recommended image2
Ranabaali Trailer: రణబాలి ట్రైలర్ రివ్యూ.. బ్రిటిష్‌పై వీర పోరాటం, విజయ్ దేవరకొండ ఊచకోత చూశారా
Recommended image3
Bollywood Controversies: సల్మాన్-షారుఖ్ నుంచి కంగనా-హృతిక్ వరకు.. స్టార్లను కుదిపేసిన 7 వివాదాలు
Related Stories
Recommended image1
Sudheer: ఫ్రీడమ్ వచ్చేసింది అంటూ కేకలు వేసిన సుధీర్.. గుద్దితే పళ్ళు రాలిపోతాయ్, సృష్టి వైల్డ్ రియాక్షన్
Recommended image2
Village Backdrop Movies: రాంచరణ్ నుంచి రవితేజ వరకు, హీరోలకు సవాల్..వందల కోట్లు తెచ్చిన ముసుగు విలన్లు వీళ్ళే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved