MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • Heavy Rains Alert: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. ఈ ప్రాంతాల్లో వారం రోజులు వర్షాలే వర్షాలు

Heavy Rains Alert: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. ఈ ప్రాంతాల్లో వారం రోజులు వర్షాలే వర్షాలు

Heavy Rains Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచికొడుతున్నాయి. వారం పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 21 2026, 08:37 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
తీరం దాటనున్న తీవ్ర వాయుగుండం.. ఆ జిల్లాల్లో 3 రోజులు దంచికొట్టనున్న వానలు
Image Credit : Chatgpt

తీరం దాటనున్న తీవ్ర వాయుగుండం.. ఆ జిల్లాల్లో 3 రోజులు దంచికొట్టనున్న వానలు

తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో వానలు దంచికొడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం మరింత బలపడి వాయుగుండంగా రూపాంతరం చెందుతోంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నుంచి వారం రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాళ్లతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
బలపడుతున్న అల్పపీడనం
Image Credit : Gemini

బలపడుతున్న అల్పపీడనం

ఉత్తర అండమాన్ సముద్రానికి ఆనుకుని ఉన్న తూర్పు-మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో కేంద్రీకృతమైన అల్పపీడనానికి తోడు ద్రోణి, ఉపరితల ఆవర్తనం తోడయ్యాయి. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా వేగంగా కదులుతూ సోమవారానికి వాయుగుండంగా, మంగళవారానికి తీవ్ర వాయుగుండంగా మారనుంది. అనంతరం పశ్చిమ-వాయవ్య దిశలోనే పయనిస్తూ ఈ నెల 23 నాటికి ఉత్తర ఆంధ్రప్రదేశ్ - దక్షిణ ఒడిశా తీరాలకు సమీపంలోకి చేరుకుంటుందని భారత వాతావరణ శాఖ (IMD), ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) స్పష్టం చేశాయి.

36
ఏపీకి హెచ్చరికలు: 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు
Image Credit : Gemini

ఏపీకి హెచ్చరికలు: 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు

వాయుగుండం ఎఫెక్ట్‌తో ఏపీ వ్యాప్తంగా రాబోయే మూడు నుంచి నాలుగు రోజుల పాటు వర్షాల జోరు కొనసాగనుంది. సోమ, మంగళవారాల్లో చెదురుమదురు జల్లులు పడగా, బుధ, గురువారాల్లో ఉత్తర కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదు కావొచ్చని అంచనా వేస్తున్నారు.

• శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, నంద్యాల, వైఎస్సార్ కడప జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉంది.

• కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లకూడదని అధికారులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

46
తెలంగాణలో ‘ఆరెంజ్ అలర్ట్’.. ఈ జిల్లాల్లో అతిభారీ వర్షాలు
Image Credit : Google AI

తెలంగాణలో ‘ఆరెంజ్ అలర్ట్’.. ఈ జిల్లాల్లో అతిభారీ వర్షాలు

తెలంగాణలో వర్షాల ప్రభావం మరింత తీవ్రంగా ఉండనుంది. ముఖ్యంగా సెప్టెంబర్ 23, 24, 25 తేదీల్లో ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో 10 సెంటీమీటర్లకు పైగా భారీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ చేశారు.

• మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయి.

• మిగిలిన 24 జిల్లాలకు 'ఎల్లో అలర్ట్' ప్రకటించారు. గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే గాలుల వల్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయే ప్రమాదం ఉంది.

56
హైదరాబాద్‌లో ట్రాఫిక్ గందరగోళం
Image Credit : Gemini

హైదరాబాద్‌లో ట్రాఫిక్ గందరగోళం

రాజధాని హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల జిల్లాలైన రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డిలలో ఆకాశం ఉదయం నుంచే మేఘావృతమై ఉంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, సికింద్రాబాద్, కూకట్‌పల్లి, ఎల్బీనగర్ వంటి ప్రాంతాల్లో మధ్యాహ్నం లేదా సాయంత్రం వేళల్లో ఉరుములతో కూడిన మోస్తరు నుంచి భారీ జల్లులు కురిసే అవకాశం ఉంది. అకస్మాత్తుగా వర్షం పడితే రోడ్లపై నీళ్లు నిలిచి ట్రాఫిక్ జామ్‌లు అయ్యే అవకాశం ఉన్నందున, ప్రయాణికులు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

66
ప్రజలకు వాతావరణ శాఖ అత్యవసర సూచనలు
Image Credit : Gemini

ప్రజలకు వాతావరణ శాఖ అత్యవసర సూచనలు

వర్షంతో పాటు పిడుగులు, ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉన్నందున ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలని అధికారులు చెప్పారు. వర్షం కురిసే సమయంలో పెద్ద చెట్ల కింద, హోర్డింగ్‌ల కింద, పాత గోడలు లేదా కరెంట్ స్తంభాల వద్ద అస్సలు నిలబడకూడదు. రైతులు తమ పంటలను వర్షం బారిన పడకుండా ముందే సురక్షిత ప్రాంతాలకు తరలించుకోవాలని అధికారులు స్పష్టం చేశారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వాతావరణం
తెలంగాణ
ఆంధ్ర ప్రదేశ్
హైదరాబాద్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
9 రోజులు.. కానీ 8 నైవేద్యాలే.. బతుకమ్మ వేడుకల్లో ఒక రోజు నైవేద్యం ఎందుకు ఉండదో తెలుసా?
Recommended image2
Dasara Special Trains: గుడ్ న్యూస్ చెప్పిన భారతీయ రైల్వే.. దసరా బతుకమ్మ ప్రత్యేక రైళ్లు
Recommended image3
Weather Update: బంగాళాఖాతంలో ఆవర్తనం.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఈదురు గాలుల హెచ్చరికలు
Related Stories
Recommended image1
Investment Rules: నష్టాలు రాకుండా షేర్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయడం ఎలా? వారెన్ బఫెట్ 5 సీక్రెట్ రూల్స్ ఇవే
Recommended image2
SIP Investment: నెల‌కు ₹500 చాలు.. మీరు కోటీశ్వరులు కావొచ్చు.. అస‌లు సీక్రెట్ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved