MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • National
  • India Bullet Train: రూ. 2 లక్షల కోట్ల ప్రాజెక్ట్.. 350 కిమీ స్పీడ్‌తో భారత్ సొంత బుల్లెట్ ట్రైన్ చూశారా?

India Bullet Train: రూ. 2 లక్షల కోట్ల ప్రాజెక్ట్.. 350 కిమీ స్పీడ్‌తో భారత్ సొంత బుల్లెట్ ట్రైన్ చూశారా?

India Bullet Train: భారతీయ రైల్వే రంగంలో సరికొత్త విప్లవానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గంటకు 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే 'మేడ్ ఇన్ ఇండియా' (B35) స్వదేశీ బుల్లెట్ ట్రైన్‌ను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 21 2026, 02:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
స్వదేశీ బుల్లెట్ ట్రైన్ దిశగా భారత్
Image Credit : Chatgpt

స్వదేశీ బుల్లెట్ ట్రైన్ దిశగా భారత్

భారతదేశం కేవలం బుల్లెట్ ట్రైన్‌ను నడపడమే కాకుండా, సొంతంగా తయారు చేసేందుకు సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది నుంచి దేశంలో బుల్లెట్ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. దీనికి తోడు 'మేడ్ ఇన్ ఇండియా' ముద్రతో స్వదేశీ బుల్లెట్ ట్రైన్‌ను రూపొందించేందుకు భారత్ కసరత్తు చేస్తోంది. 2030 సంవత్సరం నాటికి ఈ స్వదేశీ బుల్లెట్ ట్రైన్ల తయారీని ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రైల్వే మంత్రిత్వ శాఖ క్యాబినెట్ ప్రతిపాదన ప్రకారం ఈ పనులు వేగవంతం అయ్యాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
2027 ఆగస్టులో తొలి బుల్లెట్ రైలు
Image Credit : Gemini

2027 ఆగస్టులో తొలి బుల్లెట్ రైలు

ముంబై నుంచి అహ్మదాబాద్ మధ్య 2027 ఆగస్టులో తొలి బుల్లెట్ ట్రైన్ నడవనుంది. ఈ ప్రాజెక్ట్‌ను రెండు విడతల్లో అందుబాటులోకి తీసుకురావడానికి అధికారులు ప్లాన్ చేస్తున్నారు. ముంబై-అహ్మదాబాద్ హై-స్పీడ్ రైల్ ప్రాజెక్ట్ కోసం దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల వ్యయం అవుతోంది. ప్రస్తుతం ఈ రూట్‌కు సంబంధించిన పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. ప్రారంభంలో ఈ ట్రాక్‌పై B28 సిరీస్‌కు చెందిన హై-స్పీడ్ రైళ్లు పరుగులు తీయనున్నాయి.

35
గంటకు 350 కిమీ వేగం.. జపాన్‌కు పోటీ
Image Credit : Gemini AI

గంటకు 350 కిమీ వేగం.. జపాన్‌కు పోటీ

భారత్ తయారు చేయబోయే B35 మోడల్ స్వదేశీ బుల్లెట్ ట్రైన్ గంటకు 350 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణిస్తుంది. ఇది జపాన్‌కు చెందిన E10 సిరీస్ బుల్లెట్ ట్రైన్‌కు నేరుగా పోటీ ఇవ్వనుంది. జపాన్ ప్రస్తుతం తన E5 సిరీస్ ట్రైన్ల తయారీని ప్రాసెస్ వారీగా నిలిపివేస్తోంది. వాటి స్థానంలో E10 సిరీస్ ట్రైన్ల ఉత్పత్తిని మొదలుపెట్టనుంది. జపాన్ 2030లో E10 తయారీ ప్రారంభించి, 2034 నాటికి పట్టాలెక్కించాలని చూస్తోంది. అదే సమయంలో భారత్ కూడా తన స్వదేశీ సాంకేతికతతో రంగంలోకి దిగుతోంది.

45
B28 ట్రైన్ల తయారీ, వేగం వివరాలు
Image Credit : Gemini

B28 ట్రైన్ల తయారీ, వేగం వివరాలు

దేశంలో B28 హై-స్పీడ్ రైళ్ల తయారీ ఇప్పటికే ప్రారంభమైంది. బిఈఎంఎల్ (BEML) సంస్థకు 32 B28 ట్రైన్లను తయారు చేసే కాంట్రాక్ట్ లభించింది. ముంబై-అహ్మదాబాద్ కారిడార్‌లో మొదట ఈ రైళ్లే తిరుగుతాయి. ఈ B28 ట్రైన్ గరిష్ఠ వేగం గంటకు 280 కిలోమీటర్లు కాగా, ఆపరేషనల్ వేగం గంటకు 249 కిలోమీటర్లుగా ఉంటుంది. భారత్ కేవలం రైళ్లను మాత్రమే కాకుండా, వాటికి కావలసిన కంట్రోలింగ్ సిస్టమ్‌ను కూడా సొంతంగానే డెవలప్ చేస్తోంది.

55
ప్రాజెక్ట్ ఆలస్యం.. ప్రస్తుత పరిస్థితి ఇదే
Image Credit : AI

ప్రాజెక్ట్ ఆలస్యం.. ప్రస్తుత పరిస్థితి ఇదే

నిజానికి ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ 2015లో ప్రారంభమైంది. అయితే భూసేకరణ సమస్యలు, టర్బైన్ యంత్రాల సరఫరాలో ఆలస్యం కారణంగా ప్రాజెక్ట్ నిర్ణీత గడువు కంటే చాలా వెనుకబడింది. అనుకున్న బడ్జెట్ కంటే వ్యయం రెట్టింపు అయింది. అనివార్య కారణాల వల్ల ఆలస్యమైనప్పటికీ, ప్రస్తుతం భారత్ సొంతంగా తయారు చేసే బుల్లెట్ ట్రైన్ ట్రాక్‌పై భారతీయ రైళ్లే పరిగెత్తనున్నాయి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ప్రయాణం
భారత దేశం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
US India Trade: అమెరికా-ఇండియా ట్రేడ్ పెరిగితే భారతీయులకు ఏం ప్రయోజనం?
Recommended image2
LPG Subsidy: ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్ !
Recommended image3
West Bengal Byelection : వెస్ట్ బెంగాల్ లో అసలేం జరుగుతోంది? మాజీ సీఎం మమతకు ఏమిటీ పరిస్థితి?
Related Stories
Recommended image1
Two Headed Snakes: రెండు తలల పాము నిజంగానే ఉంటుందా? వైరల్ వీడియోల వెనుక ఉన్న అసలు నిజం ఇదే
Recommended image2
SIP Investment: నెల‌కు ₹500 చాలు.. మీరు కోటీశ్వరులు కావొచ్చు.. అస‌లు సీక్రెట్ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved