MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Srikanth Daughter: శ్రీకాంత్‌ కూతురు మేద ఏం చదువుతుందో తెలుసా? ఎవరికీ తెలియని టాలెంట్‌.. రహస్యాలు రివీల్

Srikanth Daughter: శ్రీకాంత్‌ కూతురు మేద ఏం చదువుతుందో తెలుసా? ఎవరికీ తెలియని టాలెంట్‌.. రహస్యాలు రివీల్

Medha Meka: ఫ్యామిలీ హీరోగా పేరుతెచ్చుకున్న శ్రీకాంత్‌.. తన ఫ్యామిలీ నుంచి పెద్ద కొడుకు రోషన్‌ని సినిమాల్లోకి తీసుకొచ్చాడు. చిన్న కొడుకు కూడా సినిమాల్లోకి రాబోతున్నాడు. మరి కూతురు మేద ఏం చేస్తుంది?

2 Min read
Author : Aithagoni Raju
Published : Sep 22 2026, 09:04 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
హీరోలుగా శ్రీకాంత్‌ కొడుకులు
Image Credit : Instagram/MANA CELEBRITIES

హీరోలుగా శ్రీకాంత్‌ కొడుకులు

హీరో శ్రీకాంత్‌ ఫ్యామిలీ చిత్రాలు ఎక్కువగా చేసి ఫ్యామిలీ ఆడియెన్స్ కి దగ్గరయ్యారు. మ్యాన్లీ హీరోగా పేరుతెచ్చుకున్నారు. ఆయన ఇప్పుడు క్యారెక్టర్స్ వైపు టర్న్ తీసుకున్నారు. బలమైన పాత్రల్లో మెరుస్తున్నారు. అదే సమయంలో నెగటివ్‌ రోల్స్ కూడా చేస్తున్నారు. కాలం తగ్గట్టుగా తాను కూడా మారుతూ రాణిస్తున్నారు. అదే సమయంలో శ్రీకాంత్‌ కొడుకు రోషన్‌ హీరోగా రాణిస్తున్న విషయం తెలిసిందే. ఆ మధ్య `ఛాంపియన్‌` మూవీతో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు `ఏమో ఏమో ఇది` అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇది వచ్చే నెలలో ఆడియెన్స్ ముందుకు రానుంది. మరోవైపు చిన్న కొడుకు కూడా సినిమా ప్రయత్నాల్లో ఉన్నట్టు సమాచారం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
శ్రీకాంత్‌ కూతురు మేద ఏం చేస్తుంది?
Image Credit : instagram/@medhameka

శ్రీకాంత్‌ కూతురు మేద ఏం చేస్తుంది?

ఇదిలా ఉంటే శ్రీకాంత్‌ కూతురు మేద ఏం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఆమెకి సంబంధించిన సమాచారం పెద్దగా లేదు. కనీసం మేద బయటకూడా పెద్దగా కనిపించదు. పూర్తి ప్రైవేట్‌ లైఫ్‌కే పరిమితం అయ్యింది. ఆ మధ్య తిరుమలలో మెరిసింది మేద. ఎంతో క్యూట్‌గా ఉంది. అదే సమయంలో హీరోయిన్‌ లక్షణాలు కనిపించాయి. కానీ కూతురు సినిమాల్లోకి ఎంట్రీకి సంబంధించి ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో శ్రీకాంత్‌ మాట్లాడుతూ, తనకు సినిమాలకు ఇంట్రెస్ట్ లేదని తెలిపారు. తాను ఆ విషయంలో ఎవరినీ ఫోర్స్ చేయనని చెప్పారు. ఈ సందర్భంగా కూతురు మేద కెనడాలో చదువుతున్నట్టు వెల్లడించారు శ్రీకాంత్‌.

34
గ్రాడ్యూయేట్‌ పూర్తి చేసిన మేద
Image Credit : instagram/@medhameka

గ్రాడ్యూయేట్‌ పూర్తి చేసిన మేద

ఇదిలా ఉంటే కెనడాలో మేద గ్రాడ్యూయేట్‌ పూర్తి చేసుకుంది. ఈ ఏడాది సమ్మర్‌లోనే ఆమె గ్రాడ్యూయేట్‌ పట్టా తీసుకుంది. తన సోషల్‌ మీడియా ద్వారా ఈ ఫోటోలను పంచుకుంది. యూనివర్సిటీ ఆఫ్‌ బ్రిటీష్‌ కొలంబియా నుంచి ఆమె డిగ్రీ పట్టా పొందడం విశేషం. ఇందులో మేద ఎంతో అందంగా ఉంది. చూడ్డానికి హీరోయిన్లని మించి ఉండటం విశేషం. సినిమాల్లోకి వస్తే ఆమె క్రేజ్‌ వేరే లెవల్లో ఉంటుందని చెప్పొచ్చు. కానీ పూర్తిగా ఇండస్ట్రీకి దూరంగా ఉండబోతుందట. ఇప్పుడు హైయ్యర్‌ స్టడీస్‌పై ఫోకస్‌ పెడుతుందట మేద. అదే సమయంలో అక్కడ ఓ బిజినెస్‌ కూడా చేస్తున్నట్టు ఆ మధ్య తల్లి ఊహా తెలిపింది.

44
మేదలోని ఎవరికీ తెలియని టాలెంట్‌
Image Credit : instagram/@medhameka

మేదలోని ఎవరికీ తెలియని టాలెంట్‌

ఈ సందర్బంగానే మేదకి సంబంధించిన ఒక రహస్యాన్ని బయటపెట్టింది ఊహ. మేదకి స్పోర్ట్స్ లో ఇంట్రెస్ట్ ఉందట. తను బాస్కెట్‌ బాల్‌ ప్లేయర్‌ అని తెలిపింది. బాస్కెట్‌ బాల్‌లో నేషనల్‌ వైడ్‌గా పార్టిసిపేట్‌ చేసినట్టు తెలిపింది. క్రీడలు మాత్రమేకాదు డాన్స్ కూడా ఎక్కువగా ఇష్టపడుతుందట. ఇంకా చెప్పాలంటే స్పోర్ట్స్ కంటే డాన్స్ చేయడానికే ప్రయారిటీ ఇస్తుందని చెప్పింది ఊహ. మొత్తంగా శ్రీకాంత్‌ కూతురు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ, బిజినెస్‌ వైపే వెళ్లే అవకాశం ఉంది. అక్కడే సెటిల్‌ అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

View this post on Instagram

A post shared by Medha Meka (@medhameka)

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Sobhan Babu: శోభన్ బాబు పిసినారి కాదు.. ఎస్పీ బాలు, కృష్ణంరాజు చెప్పిన షాకింగ్ విషయాలు
Recommended image2
Comrade Kalyan Review: కామ్రేడ్‌ కళ్యాణ్‌ మూవీ రివ్యూ.. నక్సల్‌ నేపథ్యంలో శ్రీవిష్ణు చేసిన కామెడీ ఎలా ఉందంటే?
Recommended image3
Bigg Boss Telugu 10: ఝాన్సీ వల్ల బాటమ్ లోకి షాలిని, రోహిత్.. ఇరగదీసిన నరేష్, రామ్ ప్రసాద్
Related Stories
Recommended image1
Epic First Semester 11 Days Collection: డిజాస్టర్‌ దిశగా ఎపిక్‌ మూవీ, 11 రోజుల కలెక్షన్లు.. మరీ ఇంతనా?
Recommended image2
Krishnudu Remueration: రెండు వారాలకు కృష్ణుడు పారితోషికం ఎంతో తెలుసా? కూర్చొని లక్షలు సంపాదించాడు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved