MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Krishnudu Remueration: రెండు వారాలకు కృష్ణుడు పారితోషికం ఎంతో తెలుసా? కూర్చొని లక్షలు సంపాదించాడు

Krishnudu Remueration: రెండు వారాలకు కృష్ణుడు పారితోషికం ఎంతో తెలుసా? కూర్చొని లక్షలు సంపాదించాడు

బిగ్‌ బాస్‌ తెలుగు 10 రెండో వారంలో నటుడు కృష్ణుడు ఎలిమినేట్‌ అయ్యాడు. మరి ఆయనకు రెండు వారాలకు గానూ ఎంత పారితోషికం దక్కిందనేది చూస్తే.. బాగానే రాబోతుందట.

2 Min read
Author : Aithagoni Raju
Published : Sep 21 2026, 06:27 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
రెండో వారం కృష్ణుడు ఎలిమినషన్‌
Image Credit : X/@Starmaa

రెండో వారం కృష్ణుడు ఎలిమినషన్‌

బిగ్‌బాస్‌ తెలుగు 10 సీజన్‌ రెండో వారం ఎలిమినేషన్‌ ప్రక్రియలో నటుడు కృష్ణుడు హౌస్‌ నుంచి బయటకు వచ్చాడు. మొదటి వారం ఇప్పటికే చైత్ర రాయ్‌ ఎలిమినేట్‌ కాగా.. రెండో వారంలో కృష్ణుడు ఇంటి బాట పట్టాడు. తక్కువ ఓటింగ్‌ కారణంగానే ఆయన ఎలిమినేట్‌ అయ్యాడు. రెండో వారంలో సుధీర్‌, సృష్టి, కృష్ణుడు లీస్ట్ లో ఉండగా, అతి తక్కువ ఓటింగ్‌ కారణంగా కృష్ణుడిని ఎలిమినేట్‌ చేశారు నాగార్జున.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
కృష్ణుడి ఆట తీరుపై నాగార్జున ఫైర్‌
Image Credit : Jio Hotstar Telugu

కృష్ణుడి ఆట తీరుపై నాగార్జున ఫైర్‌

హౌస్‌లోకి అడుగుపెట్టినప్పటి నుంచి కృష్ణుడు పెద్దగా యాక్టివ్‌గా కనిపించలేదనే అభిప్రాయం సోషల్‌ మీడియాలో వ్యక్తమైంది. టాస్కుల్లో చురుగ్గా పాల్గొనకపోవడం, ఇతర కంటెస్టెంట్లతో పోలిస్తే ఎక్కువగా సైలెంట్‌గా ఉండటం ఆయనకు మైనస్‌గా మారిందని టాక్‌. వీకెండ్‌ ఎపిసోడ్‌లో హోస్ట్‌ నాగార్జున కూడా కృష్ణుడి ఆట తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. టీవీకే పరిమితమవుతున్నారని ఫైర్‌ అయ్యారు. ఏకంగా టీవీనే పగలగొట్టారు. ఇదంతా ఆయన ఓటింగ్‌పై ప్రభావం పడింది. అతి తక్కువ ఓట్లు నమోదైన కారణంగా, సరైన గేమ్స్ ఆడలేని కారణంగా ఆయన్ని ఎలిమినేట్‌ చేసినట్టు సమాచారం.

34
కృష్ణుడు పారితోషికం
Image Credit : instagram/@krishnudu

కృష్ణుడు పారితోషికం

ఇక కృష్ణుడి రెమ్యూనరేషన్‌ విషయానికి వస్తే.. బిగ్‌బాస్‌ తెలుగు 10లో ఆయనకు వారానికి సుమారు రూ.3 లక్షల వరకు పారితోషికం అందినట్లు సమాచారం. కృష్ణుడు దాదాపు రెండు వారాల పాటు బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉన్న నేపథ్యంలో.. వారానికి రూ.3 లక్షల చొప్పున లెక్కిస్తే రెండు వారాలకు ఆయనకు సుమారు రూ.6 లక్షలు పారితోషికంగా దక్కినట్లు అంచనా. మొత్తంగా కృష్ణుడు ఈ షో నుంచి ఐదు నుంచి ఆరులక్షలు సంపాదించాడని చెప్పొచ్చు. ఇలా ఇంట్లో కూర్చొని ఆరు లక్షలు సంపాదించడం కృష్ణుడికే చెల్లిందని అంటున్నారు నెటిజన్లు.

44
కృష్ణుడు నిరూపించుకోలేకపోయాడు
Image Credit : instagram/@krishnudu

కృష్ణుడు నిరూపించుకోలేకపోయాడు

ఏదేమైనా బిగ్‌ బాస్‌ తెలుగు 10 షోకి వచ్చి తానేంటో నిరూపించుకోవాలని, తనలోని మరో కోణాన్ని చూపించాలని భావించిన ఆయన ఏకంగా రెండో వారంలోనే ఇంటి బాట పట్టడం గమనార్హం. ఇక ప్రస్తుతం బిగ్‌ బాస్‌ తెలుగు హౌజ్‌లో దేబ్జానీ, టెంపర్‌ వంశీ, త్రిగుణ్‌, రామ్‌ ప్రసాద్‌, నరేష్‌, వర్షిణి సౌందరాజన్‌, సృష్టి, ముఖేష్‌ గౌడ, సుధీర్‌ రెడ్డి, రోహిత్‌, సింగర్‌ ఝాన్సీ, అమన్‌, చరణ్‌, షాలిని ఉన్నారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
బిగ్ బాస్ తెలుగు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Baa Baa Black Sheep Review: బా బా బ్లాక్ షీప్ మూవీ రివ్యూ: క్రైమ్ కామెడీగా వచ్చిన మూవీ ఎలా ఉందంటే?
Recommended image2
Trisha Krishnan: త్రిష సీక్రెట్‌గా పెళ్లి చేసుకుందా? ఆ ఒక్క ఫోటోతో మొదలైన రచ్చ, నిజమెంత?
Recommended image3
నగ్మా నుంచి టబు వరకు.. 50 ఏళ్లు దాటినా పెళ్లి లేకుండా, సింగిల్‌గా ఉంటున్న టాప్ 6 హీరోయిన్లు
Related Stories
Recommended image1
Chiranjeevi-Roja: రోజా ప్రేమ వ్యవహారంపై చిరంజీవి బోల్డ్ కామెంట్‌.. మెగాస్టార్‌కి ఇచ్చిపడేసిన సురేఖ
Recommended image2
Nani: ఇలాంటి సినిమాలెందుకు చేస్తున్నావ్‌.. నానికి అమ్మ వార్నింగ్‌.. జడల వివాదంపై ఎట్టకేలకు వివరణ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved