MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Dosa: దోశ పెనానికి అతుక్కుపోతోందా? ఇదొక్కటి చేస్తే.. హోటల్ స్టైల్ దోశ ఇంట్లోనే..!

Dosa: దోశ పెనానికి అతుక్కుపోతోందా? ఇదొక్కటి చేస్తే.. హోటల్ స్టైల్ దోశ ఇంట్లోనే..!

Dosa: ఇంట్లో దోశలు వేస్తుంటే.. పెనానికి అతుక్కుపోయి.. సరిగా రావడం లేదా? హోటల్ స్టైల్ లో దోశ రుచిగా, మంచి షేప్ లో రావాలి అంటే.. చిన్న ట్రిక్ ఫాలో అయితే చాలు.

2 Min read
Author : ramya Sridhar
Published : Sep 02 2026, 03:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Dosa Hack
Image Credit : Geminiai

Dosa Hack

భారతీయులు రెగ్యులర్ గా ఇష్టంగా తినే బ్రేక్ ఫాస్ట్ లలో దోశ ఒకటి. దోశలు ఇంట్లో చేసుకోవడం కూడా చాలా సులువు. కానీ, హోటల్ లో తిన్న ఫీలింగ్ ఇంట్లో తింటే రాదు. హోటల్ మాదిరిగా మంచి షేప్, రంగు, రుచి ఇంట్లో చేసినప్పుడు రావు. అంతేకాదు, ఎప్పుడు దోశ వేద్దామని చూసినా.. పెనానికి అతుక్కుపోతూ ఉంటుంది. మీరు కూడా ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారా? అయితే.. పెనానికి అతుక్కోకుండా.. దోశ హోటల్ స్టైల్ లో మంచిగా రావాలి అంటే.. ఈ సింపుల్ చిట్కాలు ఫాలో అయితే సరిపోతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఉల్లిపాయ మ్యాజిక్..
Image Credit : Gemini

ఉల్లిపాయ మ్యాజిక్..

దోశ పెనానికి అతుక్కోకుండా మంచిగా రావాలంటే.. పిండిలో స్పెషల్ గా ఏమీ కలపాల్సిన అవసరం లేదు. చిన్న ఉల్లిపాయతో మీరు మ్యాజిక్ చేసేయచ్చు. మీ ఇంట్లో ఉన్న ఐరన్ పెనాన్ని.. ఈ ఉల్లిపాయతో నాన్ స్టిక్ పెన్ లా మార్చేయచ్చు. అసలు దోశలు వేయడం రానివారు కూడా చాలా ఈజీగా దోశలు వేసేసుకోవచ్చు. అయితే, అలా ఉల్లిపాయను ఎలా వాడాలో చూద్దాం...

ఉల్లిపాయను ముందుగా సగానికి కోయాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయకు ఫోర్క్ గుచ్చి, దానికి 2 నుంచి 3 చుక్కల నూనె రాయాలి. తర్వాత.. ఐరన్ పెనాన్ని వేడి చేయాలి. పెనం బాగా వేడిగా మారిన తర్వాత నూనె రాసిన ఉల్లిపాయను పెనం మొత్తం సర్కిల్ షేప్ లో రుద్దాలి. ఉల్లిపాయలోని సహజ రసాలు, నూనె కలిసి ఇనుప నేలపై ఒక కోటింగ్ లా ఏర్పడతాయి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు చల్లి శుభ్రమైన గుడ్డతో తుడిచి పిండి వేయండి. దోశ రవ్వల్లా పరుచుకుని, అస్సలు అంటుకోకుండా లేచి వస్తుంది.

33
దోశలు పర్ఫెక్ట్ గా రావాలంటే ఫాలో అవ్వాల్సిన 3 గోల్డెన్ రూల్స్...
Image Credit : Gemini

దోశలు పర్ఫెక్ట్ గా రావాలంటే ఫాలో అవ్వాల్సిన 3 గోల్డెన్ రూల్స్...

ఒకవేళ ఉల్లిపాయ అందుబాటులో లేకపోతే, గ్లాసు నీళ్లలో అరస్పూన్ ఉప్పు కలిపి ఆ నీటిని పెనంపై చల్లి తుడిచినా దోశలు అంటుకోవు. పిండి పెనంపై రుద్దేటప్పుడు మంట ఎప్పుడూ సిమ్‌లో ఉండాలి. రుద్దడం పూర్తయ్యాక మంటను మీడియం-హైకి పెంచితేనే దోశ కరకరలాడుతుంది. ఐరన్ పెనాన్ని ప్రతిసారీ డిష్‌వాష్ సోప్‌తో తీవ్రంగా తోమకూడదు. సబ్బుతో తోమితే దానిపై ఉన్న ఆయిల్ సీజనింగ్ పోయి మళ్లీ అంటుకోవడం మొదలవుతుంది. ఈ సింపుల్ చిట్కాలు ఫాలో అయితే.. దోశలు మంచిగా ఎర్రగా కరకరలాడుతూ.. పెనానికి అంటుకోకుండా వస్తుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
నాన్ వెజిటేరియన్స్ కోసం ఒట్టి తునకల కూర.. రాయలసీమ వారి స్పెషల్ వంట రెసిపీ ఇదిగో
Recommended image2
Whisky: విస్కీ అసలైన రుచి తెలియాలంటే ఎలా తాగాలి..? నీళ్లతోనా, ఐస్ తోనా..?
Recommended image3
Railway Travel Insurance: రైల్వే ప్రయాణికులకు రూ.10 లక్షల బీమా..అక్టోబర్ 27 నుంచి కొత్త రూల్
Related Stories
Recommended image1
Cooking Tips: అన్నం కానీ, పప్పు కానీ మాడిపోయిందా? నిమిషాల్లో ఆ మాడువాసన పోగొట్టే చిట్కా ఇది..!
Recommended image2
Cooking Tips: తక్కువ నూనెతో.. రుచిగా వంట చేయాలా? ఈ చిన్న చిట్కా ఫాలో అయితే చాలు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved