MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Paneer: ఫ్రిజ్ లో పెట్టినా పనీర్ గట్టిగా, పుల్లగా మారుతోందా? ఇలా చేస్తే 10రోజులైనా తాజాగా ఉంటుంది

Paneer: ఫ్రిజ్ లో పెట్టినా పనీర్ గట్టిగా, పుల్లగా మారుతోందా? ఇలా చేస్తే 10రోజులైనా తాజాగా ఉంటుంది

Paneer: ఫ్రిజ్ లో పనీర్ స్టోర్ చేసినా కూడా ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉండటం లేదా? రుచి పుల్లగా మారిపోతోందా? లేదా గట్టిగా మారుతోందా? సింపుల్ చిట్కాలతో ఎక్కువ రోజులు తాజాగా మార్చవచ్చు.

2 Min read
Author : ramya Sridhar
Published : Sep 03 2026, 01:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Paneer
Image Credit : Getty

Paneer

నాన్ వెజ్ ప్రియులకు ముందుగా గుర్తుకొచ్చేది చికెన్ అయితే.. వెజ్ ప్రియులకు గుర్తుకు వచ్చేది పనీర్. ప్రోటీన్ కోసం వెజిటేరియన్స్ ఎక్కువగా పనీర్ తింటూ ఉంటారు. కానీ, మార్కెట్ నుండి తెచ్చిన పనీర్ ని ఫ్రిజ్ లో పెట్టినా కూడా రెండు రోజుల్లోనే రుచి మారిపోతుంది. జిడ్డుగా, గట్టిగా మారుతుంది. ఒక్కోసారి బూజు కూడా పట్టేస్తుంది. అయితే, కొన్ని సింపుల్ చిట్కాలు ఫాలో అయితే... పనీర్ పది రోజులైనా తాజాగా, దూదిలా మెత్తగా ఉంటాయి. అలాంటి హ్యాక్స్ ఇప్పుడు తెలుసుకుందాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
పనీర్ త్వరగా ఎందుకు పాడౌతుంది?
Image Credit : Getty

పనీర్ త్వరగా ఎందుకు పాడౌతుంది?

పనీర్ లో తేమ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. దీనిని కవర్ తెరిచి ఫ్రిజ్ లో ఉంచినప్పుడు, ఫ్రిజ్ లోని చల్లటి గాలి దానిని తొందరగా పాడు చేస్తుంది. అలాగే ఫ్రిజ్ ఉష్ణోగ్రత స్థిరంగా లేకపోయినా, గాలి తగిలినా కూడా బ్యాక్టీరియా చేరి పనీర్ నుంచి పుల్లటి వాసన వస్తుంది. తొందరగా పసుపు రంగులోకి మారిపోతుంది.

33
పనీర్‌ను తాజాగా ఉంచే సింపుల్ ‘వాటర్ హ్యాక్’..
Image Credit : Getty

పనీర్‌ను తాజాగా ఉంచే సింపుల్ ‘వాటర్ హ్యాక్’..

పనీర్‌ను ఎక్కువ రోజులు నిల్వ చేయడానికి అత్యుత్తమ పద్ధతి నీటిని ఉపయోగించడం.పనీర్ కవర్ తీసి, చిన్న ముక్కలుగా కోసి ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లో ఉంచండి. పనీర్ ముక్కలు పూర్తిగా మునిగేలా చల్లటి నీటిని పోసి, మూత గట్టిగా పెట్టి ఫ్రిజ్ కింది అరలో నిల్వ చేయండి. రోజూ తప్పకుండా కంటైనర్‌లోని నీటిని మార్చాలి. నీరు మార్చేటప్పుడు డబ్బాను కూడా క్లీన్ చేస్తే పనీర్ 10 నుండి 12 రోజుల పాటు పాడవకుండా, ఫ్రెష్‌గా ఉంటుంది.

ఒక్క రోజు మాత్రమే నిల్వ చేయాలంటే? 

మరుసటి రోజే వంటలో వాడాలి అనుకుంటే నీటిలో వేయాల్సిన అవసరం లేదు. పనీర్‌ను శుభ్రమైన, తేలికపాటి తడి కాటన్ లేదా మస్లిన్ గుడ్డలో చుట్టండి. దానిని గాలి చొరబడని డబ్బాలో పెట్టి ఫ్రిజ్‌లో ఉంచితే ఉపరితలం ఎండిపోకుండా, మెత్తగా ఉంటుంది.

పనీర్ నిల్వ విషయంలో చేయకూడని తప్పులు.. 

పనీర్‌ను ప్లాస్టిక్ క్లింగ్ రాప్‌లో గట్టిగా చుట్టడం వల్ల లోపల తేమ పేరుకుపోయి త్వరగా బూజు పడుతుంది. మూత లేని గిన్నెలో ఉంచితే ఫ్రిజ్‌లోని ఇతర కూరగాయలు, ఆహార పదార్థాల వాసనలను పనీర్ పీల్చుకుంటుంది. అంతేకాకుండా, పనీర్ నుంచి బాగా పుల్లటి లేదా వింత వాసన లేదా ఏదైనా వింత వాసన వస్తే.. దానిని వాడకపోవడే మంచిది. తెల్లగా ఉండే పనీర్ పసుపు లేదా బూడిద రంగులోకి మారడం, ముట్టుకుంటే జిగటగా అనిపించినా.. అలాంటివి కూడా తినకపోవడమే మంచిది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Kitchen Tips: బియ్యం, పప్పులు పురుగు పట్టకూడదంటే ఈ చిన్న పని చేయండి!
Recommended image2
Escalator Safety Tips: ఎస్కలేటర్ లో చీర, చెప్పులు ఇరుక్కుంటే ఏం చేయాలి? ఈ తప్పులు మాత్రం చేయకండి
Recommended image3
Sarees: ఫ్లోరల్ ప్రింట్ శారీస్.. డైలీవేర్ కి సూపర్ గా ఉంటాయి!
Related Stories
Recommended image1
Eggs: ఒక గుడ్డులో రెండు పచ్చ సొనలు ఎప్పుడైనా చూశారా? ఇలాంటి గుడ్లు తినొచ్చా? తినకూడదా?
Recommended image2
Curd: పెరుగు నీళ్లు లేకుండా గడ్డలా తోడుకోవాలా? ఈ ఒక్క ఆకు వేస్తే చాలు, అమ్మమ్మల నాటి చిట్కా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved