MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Life
  • Bitter Gourd: వేసవిలో కాకరకాయను తినొచ్చా..? ఒకవేళ తింటే ఏమౌతుంది..

Bitter Gourd: వేసవిలో కాకరకాయను తినొచ్చా..? ఒకవేళ తింటే ఏమౌతుంది..

Benefits and Harm of Eating Bitter Gourd: కాకరకాయ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కానీ దీనిని వేసవిలో తినకూడదని చాలా మంది అంటూ ఉంటారు. ఒక వేళ తింటే ఏమౌతుందో ఇప్పుడు తెలుసుకుందాం. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 04 2022, 10:29 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111

Benefits and Harm of Eating Bitter Gourd: మార్చి పోయి జూన్ నెల వచ్చినా.. ఎండల తీవ్రత మాత్రం తగ్గడం లేదు. మండుతున్న ఎండలకు, తీవ్రమైన ఉక్కపోతలకు జనాలు అల్లాడుతున్నారు. వేసవి తాపాన్ని తీర్చుకోవడానికి ఎన్నో రకాల ఆహారాలను తీసుకుంటున్నారు. కాగా ఇదే సీజన్ లో కాకరకాయలు కూడా బాగా పండుతాయి. అయితే వీటిని వేసవిలో తినొచ్చా? లేదా ? ఒక వేళ తింటే ఏమౌతుందన్న అనుమానాలు చాలా మందిలో ఉంటాయి. ఈ వేసవిలో కాకరకాయలను తినాలా? వద్దా? దీనివల్ల కలిగే ప్రయోజనాలు, నష్టాలేంటో వంటి విషయాల గురించి వివరంగా తెలుసుకుందాం పదండి. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
211

వేసవిలో కాకరకాయను తినడం వల్ల  కలిగే ప్రయోజనాలు:   ఇది బరువు తగ్గడానికి ఎంతో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 
 

311

వేసవిలో కాకరకాయను (Bitter Gourd) తినడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. కంటి సమస్యలున్నవారికి ఇది చక్కటి మెడిసిన్ లా పనిచేస్తుంది. 

411

ఈ ఎండాకాలంలో  కాకరకాయను తినడం వల్ల డయబెటీస్ (Diabetes) సమస్యను నియంత్రణలో ఉంచుకోవచ్చు. అందుకే వీరు తరచుగా కాకరకాయలను తినాలని నిపుణులు సూచిస్తున్నారు. 
 

511
bitter gourd

bitter gourd

కాకరకాయలో యాంటీ ఇన్ప్లమేటరీ (Anti-inflammatory) లక్షణాలు ఉంటాయి. ఇవి శరీర వాపును తగ్గిస్తుంది. అలాగే క్రమం తప్పకుండా కాకరకాయను తినడం వల్ల ఎన్నో చర్మ సంబంధిత సమస్యలు తొలగిపోతాయని నిపుణులు చెబుతున్నారు. 

611

హేమోరాయిడ్స్ (Hemorrhoids), మలబద్దకం (Constipation) వంటి సమస్యలను తగ్గించడానికి కాకరకాయలు దివ్య ఔషదంలా పనిచేస్తాయి. 
 

711

వేసవిలో కాకరకాయను తినడం వల్ల కలిగే నష్టాలు.. ఈ వేసవిలో కాకరకాయను తినే మధుమేహులు ఒకసారి డాక్టర్ సలహాలను తీసుకోవడం మంచిది. 

811

పిల్లలకు పాలిచ్చే తల్లులు ఈ సీజన్ లో కాకరకాయను తినకపోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గర్భిణులు కూడా కాకరకాయను తినకూడదని నిపుణులు సూచిస్తున్నారు. వీరు కాకరకాయలను తింటే హాని కలుగుతుందని హెచ్చరిస్తున్నారు. 

911

ఎక్కువ సార్లు కాకరకాయను తినడం వల్ల కడుపు తిమ్మిరి (Stomach cramps), గ్యాస్ వంటి సమస్యలు ఏర్పడతాయని నిపుణులు చెబుతున్నారు. 

1011

కాకరకాయ శరీరాన్ని చల్లబరుస్తుంది.. కాకరకాయలో చలువ చేసే గుణం ఉంటుంది. అంటే దీన్ని తిన్నవారి శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. అందుకే చాలా మంది వేసవిలో కాకరకాయలను ఎక్కువగా తింటూ ఉంటారు. 

1111

కాకరకాయలో మన శరీరాన్ని ఫిట్ గా ఉంచేందుకు సహాయపడే అనేక పోషకాలు ఉంటాయి. కాల్షియం, విటమిన్లు, ప్రోటీన్లుు, పాస్ఫరస్, పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్ వంటివి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
పాత కార్డ్‌బోర్డులతో కిచెన్‌కు కొత్త లుక్ ఇచ్చేయండి.. వాటిని ఇలా వాడేయండి
Recommended image2
Utensils: దీనితో శుభ్రం చేస్తే.. మాడిపోయిన గిన్నెలు కూడా కొత్త వాటిలా మెరిసిపోతాయి..!
Recommended image3
Coriander: ఇలా చేస్తే కొత్తిమీర ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉంటుంది!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved