రామ్ చరణ్ నటించిన 'వినయ విధేయ రామ' సినిమాకి వచ్చిన టాక్ కి కలెక్షన్లకి ఏమాత్రం సంబంధం లేదనే చెప్పాలి. మొదటి షోతోనే సినిమాపై నెగెటివ్ కామెంట్స్ వినిపించాయి. ఈ సినిమాలో బోయపాటి హింస మరీ ఎక్కువైందని, కొన్ని సన్నివేశాలు వాస్తవానికి దూరంగా ఉన్నాయని విమర్శించారు.

అయినప్పటికీ ఈ సినిమా మొదటిరోజు రూ.26 కోట్ల షేర్ సాధించింది. రెండో వారంలో కూడా ఈ సినిమా కలెక్షన్లు స్టడీగా ఉండడం ట్రేడ్ పండితులను ఆశ్చర్యపరుస్తోంది. బోయపాటి ఎంతగా భయపెట్టినా.. రామ్ చరణ్ కారణంగా ప్రేక్షకులు థియేటర్లకు రాగలుగుతున్నారని అభిమానులు అంటున్నారు.

ఈ సినిమా 11 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.50 కోట్ల షేర్ ని సాధించిగా, ప్రపంచవ్యాప్తంగా రూ.60 కోట్ల షేర్ రాబట్టినట్లు ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. మరో పది నుండి పదిహేను కోట్లు రాబట్టే అవకాశాలు ఉన్నట్లు  అంచనా వేస్తున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందించిన పెద్ద సినిమాలకు ఫ్లాప్ టాక్ వస్తే.. నలభై కోట్లు రావడం కష్టంగా ఉంది.

అలాంటిది 'వినయ విధేయ రామ'కి డిజాస్టర్ టాక్ వచ్చినప్పటికీ ఈ సినిమా రూ.60 కోట్ల షేర్ ని రాబట్టడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. దాదాపు రూ.90 కోట్ల ప్రీరిలీజ్ జరుపుకున్న ఈ సినిమా వలన డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు తప్పవని అనుకుంటే ఇప్పుడు చరణ్ కారణంగా వారికి కాస్త ఊరట లభించిందనే చెప్పాలి.   

సంబంధిత వార్తలు..

'వినయ విధేయ రామ': సంక్రాంతి సేవ్ చేసిందిగా!

'విన‌య‌ విధేయ‌ రామ‌': నిర్మాత అలా మాట్లాడుకుండా ఉండాల్సింది

'వినయ విధేయ రామ' ఎఫెక్ట్.. బయ్యర్ నిండా మునిగిపోయాడు!

‘విన‌య విధేయ రామ’ పై రామ్ చరణ్ కామెంట్

'వినయ విధేయ రామ' మూడు రోజుల కలెక్షన్స్!

'వినయ విధేయ రామ'.. రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్!

'వినయ విధేయ రామ' సెకండ్ డే కలెక్షన్స్!

బోయపాటి ఎఫెక్ట్.. బాలయ్య రికార్డులు బద్దలు!

బాలయ్య, రామ్ చరణ్ లకు ట్రోలింగ్ దెబ్బ!

'వినయ విధేయ రామ' రివ్యూ..

'వినయ విధేయ రామ' ట్విట్టర్ రివ్యూ!

యూఎస్ ప్రీమియర్ షో టాక్: వినయ విధేయ రామ

టెన్షన్ లో డిస్ట్రిబ్యూటర్స్..ఆంధ్రా ప్రభుత్వం కరుణిస్తుందా?

నాలుగు రోజులు చిరు దాని గురించే మాట్లాడారట!

‘వినయ విధేయ రామ’ ప్రీ రిలీజ్ బిజినెస్!

పిక్ వైరల్: చరణ్ భుజంపై హీరోయిన్ పాదాలు..!

'వినయ విధేయ రామ' ఫ్యామిలీ పోస్టర్!

తమ్ముడికి ఆప్తుడు త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నా: చిరు

నేను సాధించుకున్నవి ఆ రెండే: చిరంజీవి

మాట్లాడుకున్నాం: పవన్ కల్యాణ్ రాజకీయ ప్రస్థానంపై కేటీఆర్

పవన్ రాజకీయాలతో పాటు సినిమాలు కంటిన్యూ చేయాలి: కేటీఆర్