Asianet News TeluguAsianet News Telugu

'విన‌య‌ విధేయ‌ రామ‌': నిర్మాత అలా మాట్లాడుకుండా ఉండాల్సింది

మెగాప‌వ‌ర్ స్టార్ రాంచ‌ర‌ణ్ హీరోగా మాస్ డైరెక్ట‌ర్ బోయపాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఫ్యామిలీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ విన‌య‌విధేయ‌రామ‌. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 11న విడుద‌లైన ఈ చిత్రం బాక్సాపీస్ వ‌ద్ద డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. 

Producer DVV Danayya Comments at Vinaya Videya Rama press meet
Author
Hyderabad, First Published Jan 17, 2019, 10:17 AM IST

మెగాప‌వ‌ర్ స్టార్ రాంచ‌ర‌ణ్ హీరోగా మాస్ డైరెక్ట‌ర్ బోయపాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఫ్యామిలీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ విన‌య‌విధేయ‌రామ‌. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 11న విడుద‌లైన ఈ చిత్రం బాక్సాపీస్ వ‌ద్ద డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఇప్పటికే ఈ సినిమాలో సన్నివేశాలు గురించి అందరూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. అవేమీ తమకు తెలియదన్నట్లు ఈ చిత్రం ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసారు నిర్మాత. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..చెప్పిన మాటలను జనాలు మరోసారి కామెడీ చేస్తున్నారు. 

నిర్మాత డి.వి.వి.దాన‌య్య మాట్లాడుతూ – “మెగాప‌వ‌ర్‌స్టార్ చిత్రం అదీ కూడా బోయ‌పాటి శ్రీనుగారి ద‌ర్శ‌క‌త్వంలో అని తెలియ‌గానే సినిమాపై భారీ అంచ‌నాలుంటాయ‌నే సంగ‌తి తెలిసిందే. మేకింగ్‌లో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా సినిమాను భారీ బ‌డ్జెట్‌తో నిర్మించాం. అలాగే హీరోను మాస్ యాంగిల్‌లో ద‌ర్శ‌కుడు బోయపాటి శ్రీనుగారు ప్ర‌జెంట్ చేశారు. 

అన్న‌ద‌మ్ములు మ‌ధ్య అనుబంధం, ఫ్యామిలీ ఎమోష‌న్స్ కుటుంబ క‌థా చిత్రాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నాయి. అలాగే ప‌వ‌ర్‌ఫుల్ యాక్ష‌న్ ఏపిసోడ్స్, డ్యాన్సులకు మాస్ ఆడియెన్స్ క‌నెక్ట్ అయ్యారు. సినిమా స‌క్సెస్‌ఫుల్ క‌లెక్ష‌న్స్‌తో దూసుకెళ్తోంది. మా సినిమాను ఆదరిస్తున్న   ప్రేక్ష‌కుల‌కు, స‌క్సెస్‌లో భాగ‌మైన ప్ర‌తి ఒక్క‌రికీ థాంక్స్‌” అన్నారు. 

ఇలా నిర్మాత దానయ్య ఈ సినిమా టాక్ గురించి, కలెక్షన్స్ గురించి మాట్లాడటం జనాలకు చాలా మందికి నవ్వు తెప్పిస్తోందంటూ సోషల్ మీడియాలో వెటకారం చేస్తున్నారు. ఇది చూసిన ఫ్యాన్స్ కొందరు ...అసలు ప్రెస్ మీట్ పెట్టకపోయినా బాగుండేది అని ఫీలవుతున్నారు. 

సంబంధిత వార్తలు..

'వినయ విధేయ రామ' ఎఫెక్ట్.. బయ్యర్ నిండా మునిగిపోయాడు!

‘విన‌య విధేయ రామ’ పై రామ్ చరణ్ కామెంట్

'వినయ విధేయ రామ' మూడు రోజుల కలెక్షన్స్!

'వినయ విధేయ రామ'.. రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్!

'వినయ విధేయ రామ' సెకండ్ డే కలెక్షన్స్!

బోయపాటి ఎఫెక్ట్.. బాలయ్య రికార్డులు బద్దలు!

బాలయ్య, రామ్ చరణ్ లకు ట్రోలింగ్ దెబ్బ!

'వినయ విధేయ రామ' రివ్యూ..

'వినయ విధేయ రామ' ట్విట్టర్ రివ్యూ!

యూఎస్ ప్రీమియర్ షో టాక్: వినయ విధేయ రామ

టెన్షన్ లో డిస్ట్రిబ్యూటర్స్..ఆంధ్రా ప్రభుత్వం కరుణిస్తుందా?

నాలుగు రోజులు చిరు దాని గురించే మాట్లాడారట!

‘వినయ విధేయ రామ’ ప్రీ రిలీజ్ బిజినెస్!

పిక్ వైరల్: చరణ్ భుజంపై హీరోయిన్ పాదాలు..!

'వినయ విధేయ రామ' ఫ్యామిలీ పోస్టర్!

తమ్ముడికి ఆప్తుడు త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నా: చిరు

నేను సాధించుకున్నవి ఆ రెండే: చిరంజీవి

మాట్లాడుకున్నాం: పవన్ కల్యాణ్ రాజకీయ ప్రస్థానంపై కేటీఆర్

పవన్ రాజకీయాలతో పాటు సినిమాలు కంటిన్యూ చేయాలి: కేటీఆర్

Follow Us:
Download App:
  • android
  • ios