- Home
- Entertainment
- చిరంజీవికి ఎక్కువ డైలాగ్స్ లేకున్నా.. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమా ఏదో తెలుసా? మెగాస్టార్ కెరీర్ మార్చేసిన మూవీ?
చిరంజీవికి ఎక్కువ డైలాగ్స్ లేకున్నా.. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమా ఏదో తెలుసా? మెగాస్టార్ కెరీర్ మార్చేసిన మూవీ?
చిరంజీవి అంటేనే మాస్, క్లాస్, యాక్షన్, డ్యాన్స్ ఇలా నవరసాల సమ్మేళనం.. అటువంటి మెగాస్టార్ కు డైలాగ్స్ ఎక్కువగా లేకుండా తీసిన సినిమా ఏదో తెలుసా? మాటలు లేకున్నా నటనతో మెప్పించి సూపర్ హిట్ కొట్టిన సినిమా ఏది?

చిరంజీవి కెరీర్ ను మలుపు తిప్పిన సినిమాలు
ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి..టాలీవుడ్‌లో మెగాస్టార్ రేంజ్ కు ఎదిగాడు చిరంజీవి. నటన, డ్యాన్స్, యాక్షన్ అన్నింటిలో తన మార్క్ చూపించి ఎన్నో అద్భుతాలు చేశాడు. చిరంజీవి తన కెరీర్‌లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు.
తన కష్టంతో మెగాస్టార్ రేంజ్ కు ఎదిగాడు. దాదాపు నాలుగు దశాబ్దాలకు పైగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా కొనసాగిన ఆయన ప్రయాణంలో కొన్ని సినిమాలు కీలక మలుపుగా నిలిచాయి. అలాంటి సినిమాల్లో అడవి దొంగ కూడా ఒకటి .
చిరంజీవి–రాఘవేంద్రరావు కాంబోలో ఫస్ట్ మూవీ.
.చిరంజీవి కెరీర్ కంప్లీట్ గా టర్న్ అయ్యింది ఖైదీ సినిమాతో . ఈ సినిమా ఆయనకు ఎంత పేరు తెచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పుడు ఫామ్ లో ఉన్న హీరోలను భయపెట్టిందీ మూవీ. 1983లో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని సాధించి.. చిరంజీవిని మాస్ హీరోగా నిలబెట్టింది. అయితే ఖైదీ సినిమా భారీ హిట్ అయినప్పటికీ, ఆ తర్వాత కూడా నిర్మాతల్లో కొంత సందేహం కొనసాగింది.
చిరంజీవి సినిమాలపై ఎంత బడ్జెట్ పెట్టాలి, బాక్సాఫీస్ వద్ద ఎంత స్థాయిలో ఓపెనింగ్స్ వస్తాయి అనే అంశాలపై నిర్మాతలు ఆలోచనలో పడ్డారు. అలాంటి పరిస్థితుల్లో వారికి క్లారిటీ ఇచ్చిన సినిమా అడవి దొండ. ఈసినిమా చిరంజీవి–రాఘవేంద్రరావు కాంబోలో ఫస్ట్ మూవీ.
టార్జాన్ తరహా పాత్రలో చిరంజీవి
దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం చిరంజీవి కెరీర్‌లో ఒక కీలక మైలురాయిగా నిలిచింది. ఈ సినిమాలో చిరంజీవి టార్జాన్ పాత్రలో కనిపించారు. హీరోయిన్ గా రాధ, చిరంజీవి తల్లిగా శారద నటించారు. ఖైదీ తరువాత చిరంజీవి ఇలాంటి సినిమా చేస్తాడని ఎవరు ఊహించలేదు. ఒక రకంగా ఈమూవీతో ఆయన పెద్ద ప్రయోగమే చేశాడు. ఎందుకుంటే ఇందులో హీరోకు సగం సినిమా వరకూ డైలాగ్స్ ఉండవు. ఓన్లీ యాక్షన్ నో డైలాగ్స్.
ఇంటర్వెల్ వరకు చిరంజీవికి డైలాగ్స్ లేవు..
ఈ సినిమాలో ఆసక్తికరమైన, ప్రయోగాత్మక అంశం ఇంటర్వెల్ వరకు చిరంజీవికి డైలాగ్స్ లేకపోవడం. మాస్ హీరోకు డైలాగ్స్ లేకుండా సినిమా చేయడం అప్పట్లో ఒక పెద్ద ప్రయోగమనే చెప్పాలి. ఒక కమర్శియల్ హీరోకు ఇలా సగం సినిమా వరకూ డైలాగ్స్ లేకుండా తీయ్యడం అంటే సాహసమనే చెప్పాలి.
అప్పట్లోనే రాఘవేంద్రరావు ఈ విధమైన ప్రయోగాన్ని చేశారు.ఇంటర్వెల్ వరకు చిరంజీవి పాత్రలో మాటలు లేకపోవడం వల్ల అప్పట్లో కొంతమంది అభిమానులకు కోపం తెప్పించినా.. సినిమా చూసిన తరువాత చిరంజీవి స్క్రీన్ ప్రెజెన్స్ కి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.
ఖైదీ కంటే కూడా ఎక్కువ ఓపెనింగ్స్..
1985లో విడుదలైన అడవి దొంగ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమా వంద రోజులు ఆడింది, బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లు కూడా సాధించింది. ముఖ్యంగా ఓపెనింగ్స్ విషయంలో ఖైదీ సినిమాకంటే కూడా మంచి స్పందన రావడం నిర్మాతల్లో చిరంజీవిపై నమ్మకాన్ని మరింత పెంచింది.
అడవి దొంగ విజయంతో చిరంజీవిపై ఎంత బడ్జెట్ అయినా పెట్టొచ్చనే నమ్మకం ఇండస్ట్రీలో ఏర్పడింది. ఆ తర్వాత కాలంలో చిరంజీవి వరుస విజయాలతో సుప్రీం హీరోగా, తరువాత మెగాస్టార్ గా అవతరించారు.

