రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను 'వినయ విధేయ రామ' సినిమాను రూపొందించిన సంగతి తెలిసిందే. కియారా అద్వానీ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సంక్రాంతికి పక్కా మాస్ ఫిలిం అంటూ ప్రమోట్ చేసింది చిత్రబృందం. 

అయితే ట్విట్టర్ లో మాత్రం సినిమాకి మిశ్రమ స్పందన వస్తోంది. 'రంగస్థలం' తరువాత రామ్ చరణ్ నటించిన సినిమా కావడంతో సినిమాపై అంచనాలు బాగా పెరిగిపోయాయి. ఆ అంచనాలకు తగ్గట్లే సినిమా టీజర్, ట్రైలర్ ఉన్నాయి. కానీ ఆ అంచనాలను సినిమా అందుకోలేకపోయిందని పెదవి విరుస్తున్నారు.

బీ, సీ సెంటర్స్ లో సినిమా విపరీతంగా ఆడుతుందని అంటున్నారు. సినిమా ఫస్ట్ హాఫ్ బాగుందని.. ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే ఎమోషనల్ సీన్స్ చాలానే ఉన్నాయని అంటున్నారు. బోయపాటి మార్క్ యాక్షన్ సినిమాగా తీర్చిదిద్దారని.. యాక్షన్ సన్నివేశాలు ఓ రేంజ్ లో ఉన్నాయని చెబుతున్నారు.

ఇంటర్వెల్ సీన్ సినిమాకు హైలైట్ గా నిలిచిందని అంటున్నారు. రామ్ చరణ్ యాక్షన్ సీన్స్ లో వార్నింగ్ ఇచ్చే సీన్స్ లో మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చారని ట్వీట్ చేస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగాలేదని నెగెటివ్ కామెంట్లు చేస్తున్నారు.