మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'వినయ విధేయ రామ' సినిమాకి నెగెటివ్ టాక్ వచ్చినప్పటికీ సినిమా వసూళ్ల పరంగా మాత్రం దూసుకుపోతుంది. సినిమాకి వచ్చిన టాక్, రేటింగ్ లకు సంబంధం లేకుండా రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ వసూలు చేస్తోంది.

శుక్రవారం విడుదలైన ఈ సినిమా ఆదివారం వరకు కలెక్షన్ల విషయంలో స్టడీగా ఉంది. మొదటి వీకెండ్ కి ఈ సినిమా రూ.43 కోట్లను సాధించింది. మరో మూడు రోజులు సెలవులు కావడంతో రెండో వీకెండ్ లో కూడా సినిమా భారీ వసూళ్లను సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఎలా లేదన్నా ఈ వారంలో సినిమా రూ.65 కోట్లను దాటడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ 'సర్దార్ గబ్బర్ సింగ్', అల్లు అర్జున్ 'నా పేరు సూర్య' సినిమాలకు నెగెటివ్ టాక్ వచ్చినా ఫుల్ రన్ ఈ సినిమాలు యాభై కోట్ల షేర్ ని రాబట్టాయి.

ఇప్పుడు 'వినయ విధేయ రామ' కూడా కలెక్షన్ల విషయంలో జోరు ప్రదర్శిస్తోంది. ఇదే గనుక కంటిన్యూ అయితే నిర్మాతలు అతి తక్కువ నష్టాలతో బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతకుమించి వసూళ్లను సాధిస్తే అది రికార్డే అవుతుంది.  

సంబంధిత వార్తలు..

'వినయ విధేయ రామ' సెకండ్ డే కలెక్షన్స్!

బోయపాటి ఎఫెక్ట్.. బాలయ్య రికార్డులు బద్దలు!

బాలయ్య, రామ్ చరణ్ లకు ట్రోలింగ్ దెబ్బ!

'వినయ విధేయ రామ' రివ్యూ..

'వినయ విధేయ రామ' ట్విట్టర్ రివ్యూ!

యూఎస్ ప్రీమియర్ షో టాక్: వినయ విధేయ రామ

టెన్షన్ లో డిస్ట్రిబ్యూటర్స్..ఆంధ్రా ప్రభుత్వం కరుణిస్తుందా?

నాలుగు రోజులు చిరు దాని గురించే మాట్లాడారట!

‘వినయ విధేయ రామ’ ప్రీ రిలీజ్ బిజినెస్!

పిక్ వైరల్: చరణ్ భుజంపై హీరోయిన్ పాదాలు..!

'వినయ విధేయ రామ' ఫ్యామిలీ పోస్టర్!

తమ్ముడికి ఆప్తుడు త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నా: చిరు

నేను సాధించుకున్నవి ఆ రెండే: చిరంజీవి

మాట్లాడుకున్నాం: పవన్ కల్యాణ్ రాజకీయ ప్రస్థానంపై కేటీఆర్

పవన్ రాజకీయాలతో పాటు సినిమాలు కంటిన్యూ చేయాలి: కేటీఆర్