ఈ మధ్యకాలంలో సినిమా ఈవెంట్ లకు రాజకీయనాయకులు రావడం కామన్ అయిపోయింది. మాములుగానే సినిమా ఈవెంట్లలో ఒకరినొకరు పొగుడుకుంటూ భజనతో సాగుతాయి. ఇక దానికి రాజకీయనాయకులు తోడైతే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

తాజాగా జరిగిన 'వినయ విధేయ రామ' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కి కేటీఆర్, చిరంజీవిలు అతిథులుగా వచ్చారు. దీంతో చిరంజీవిని, రామ్ చరణ్ లను కేటీఆర్ పొగడడం, వారు కేటీఆర్ ని తమ ప్రశంసలతో ఆకాశానికి ఎత్తేయడం జరిగింది. ఈ భజన సరిపోదు అన్నట్లు మధ్యలో పవన్ కళ్యాణ్ ప్రస్తావన కూడా వచ్చింది. మెగా ఫ్యామిలీ ఈవెంట్ అంటే అక్కడ పవన్ టాపిక్ కంపల్సరీ అనే విషయం తెలిసిందే.

నిన్న ఈవెంట్ లో కూడా అభిమానులు పవన్ అని అరుస్తూ జనసేన పార్టీ జెండాలు పట్టుకున్నారు. దీంతో చరణ్, చిరంజీవిలకు పవన్ గురించి మాట్లాడక తప్పలేదు. చరణ్ తన మాటలతో బాబాయ్ మీదున్న ప్రేమను వ్యక్తపరిచినప్పటికీ చిరంజీవి మాత్రం ఏదో మొక్కుబడిగా 'తమ్ముడు ఫ్యామిలీతో కలిసి స్విట్జర్ల్యాండ్ లో ఉన్నాడని' చెప్పాడు. ఆఖరికి అభిమానులు కేటీఆర్ ని కూడా వదల్లేదు.

దీంతో ఆయన కూడా పవన్ గురించి ప్రస్తావించాల్సి వచ్చింది. 'పవన్ నేను ఈ మధ్యే కలిసి మాట్లాడుకున్నాం.. ఆయన రాజకీయ ప్రస్తానంతో పాటు సినిమాలు కూడా కొనసాగించాలని' తన ప్రసంగం ముగించాడు. ఇక్క మరో విశేషమేమిటంటే.. రామ్ చరణ్ కూడా రాజకీయాల్లోకి రావాలంటూ కేటీఆర్ తన మాటల్లో చెప్పే ప్రయత్నం చేయగా.. చిరంజీవి సైగ చేయడంతో 'దానికి ఇంకా టైముందని' కవర్ చేశాడు కేటీఆర్. మొత్తానికి ఈ ఈవెంట్ కాస్త సినిమా ఈవెంట్ లా కాకుండా ఓ పొలిటికల్ సభలా తయారైందనే కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.  

సంబంధిత వార్తలు..

తమ్ముడికి ఆప్తుడు త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నా: చిరు

నేను సాధించుకున్నవి ఆ రెండే: చిరంజీవి

మాట్లాడుకున్నాం: పవన్ కల్యాణ్ రాజకీయ ప్రస్థానంపై కేటీఆర్

పవన్ రాజకీయాలతో పాటు సినిమాలు కంటిన్యూ చేయాలి: కేటీఆర్

మా బాబాయ్ అన్నీ వదిలేసి ప్రజల కోసం యుద్ధం చేస్తున్నాడు: రామ్ చరణ్

వారసత్వమనేది సమర్ధుడికి బాధ్యత.. బోయపాటి కామెంట్స్!

'వినయ విధేయ రామ' సినిమా ట్రైలర్!

చరణ్ సింహం లాంటి వాడు: త్రివిక్రమ్

'వినయ విధేయ రామ' ప్రీరిలీజ్.. మెగాస్టార్ వచ్చేశాడు!

'వినయ విధేయ రామ' ఈవెంట్ లో చరణ్ లుక్!

రెగ్యులర్ సాంగ్ తో VVR ప్రమోషన్స్.. వర్కౌట్ అయ్యేనా?

బోయపాటికి చిరు అంత ఛాన్స్ ఇస్తాడా..?

బోయపాటి ఆటలు సాగడం లేదా..?

ఇక్కడ రామ్ కొ..ణి..దె..ల.. 'వినయ విధేయ రామ' టీజర్!

చరణ్ ఒంటికన్ను లుక్ పై సెటైర్లు!

రామ్ చరణ్ ఫస్ట్ లుక్.. ఫుల్ మాసీ!

RC12: రూమర్స్ కు స్ట్రాంగ్ కౌంటర్!

షాకింగ్ స్టోరీ: బోయపాటి చేస్తున్న కుట్రా? లేక బోయపాటిపై కుట్రా?

చరణ్ సినిమా నుండి సినిమాటోగ్రాఫర్ అవుట్! 

చరణ్ తీరుతో బోయపాటికి తలనొప్పి..?