సారాంశం
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్.. దర్శకుడు బోయపాటి రూపొందిస్తోన్న యాక్షన్ ఎంటర్టైనర్ లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాకి టైటిల్ గా 'వినయ విధేయ రామ' అనే టైటిల్ ని అనుకుంటున్నారు. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి చిత్రబృందం నుండి ఎలాంటి అప్ డేట్స్ లేవు.
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్.. దర్శకుడు బోయపాటి రూపొందిస్తోన్న యాక్షన్ ఎంటర్టైనర్ లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాకి టైటిల్ గా 'వినయ విధేయ రామ' అనే టైటిల్ ని అనుకుంటున్నారు.
ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి చిత్రబృందం నుండి ఎలాంటి అప్ డేట్స్ లేవు. దసరా కాకుండా ఫస్ట్ లుక్ పోస్టర్ వస్తుందనుకుంటే అభిమానులకి నిరాశే ఎదురైంది. కనీసం దీపావళికైనా సినిమా టైటిల్ ని, చరణ్ లుక్ ని వదులుతారేమోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే ఇన్ని రోజులు ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ అందించిన రిషీ పంజాబీ ఈ సినిమా నుండి తప్పుకున్నట్లు ఆయన స్థానంలో కొత్త కెమెరామెన్ ని తీసుకున్నట్లు తెలుస్తోంది. కారణాలు బయటకి చెప్పనప్పటికీ రిషీ పంజాబీ తప్పుకోవడంతో ఆ స్థానంలో ఆర్థర్ విల్సన్ ని సినిమాటోగ్రాఫర్ గా తీసుకున్నారని తెలుస్తోంది.
ఇప్పటికే సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కావొచ్చింది. మిగిలి ఉన్న టాకీ పార్ట్ తో పాటు పాటలకి విల్సన్ సినిమాటోగ్రఫీ అందించనున్నారు. ఈ సినిమాలో చరణ్ కి జోడిగా కియారా అద్వానీ నటిస్తుండగా.. వివేక్ ఒబెరాయ్ విలన్ గా కనిపించనున్నాడు.
ఇవి కూడా చదవండి..
చరణ్ తీరుతో బోయపాటికి తలనొప్పి..?
చరణ్ సినిమాలో ఎన్టీఆర్ సీన్ రిపీట్..?
ఫ్యాన్స్ కు మెగా హీరో దసరా గిఫ్ట్!
షూటింగ్ లకి రామ్ చరణ్ డుమ్మా.. కారణమేమిటంటే..?
రామ్ చరణ్-బోయపాటి సినిమా టైటిల్ ఇదే..!