Asianet News TeluguAsianet News Telugu

షాకింగ్ స్టోరీ: బోయపాటి చేస్తున్న కుట్రా? లేక బోయపాటిపై కుట్రా?

'రంగస్థలం' లాంటి సూపర్  హిట్ తరువాత మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా రెడీ అవుతున్న  సంగతి తెలిసిందే. ఇప్పటికే మేజర్‌ పార్ట్‌ షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్‌ కోసం  ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

shocking story on boyapati srinu
Author
Hyderabad, First Published Oct 25, 2018, 9:33 AM IST

'రంగస్థలం' లాంటి సూపర్  హిట్ తరువాత మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా రెడీ అవుతున్న  సంగతి తెలిసిందే. ఇప్పటికే మేజర్‌ పార్ట్‌ షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్‌ కోసం  ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  మొన్న దసరా రోజు సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌ అవుతుందని ఆశపడ్డ అభిమానులకు నిరాశే ఎదురైంది.  

ఎందుకిలా జరిగింది అంటూ మీడియాలో సందేహాలతో కూడిన స్టోరీలు  మొదలయ్యాయి.  బోయపాటి లాంటి చాలా స్పీడుగా షూటింగ్ జరిపే దర్శకుడు ఇలా చేయటం ఏమిటనే అనుమానాలు వచ్చాయి. కెమెరామెన్ మారటం వల్ల సమస్య వచ్చిందని ప్రచారంలోకి వచ్చింది. అయితే కెమెరామెన్ మారితే షూటింగ్ కు సమస్య ఏమిటి అని కొందరు ప్రశ్నస్తున్నారు.

తాజాగా ఇలా లేటవటానికి కారణం కుట్ర అంటూ ఓ కొత్త ఆరోపణ వెలుగులోకి వచ్చి అందరికీ షాక్ ఇచ్చింది. ఆ ఆరోపణలో ఉన్నదేమిటంటే...బోయపాటి ఇలా ఈ ప్రాజెక్టుని లేటు చేయటానికి కారణం బాలయ్య కు ఫేవర్ చేయటానికే అంటున్నారు. బాలకృష్ణ, క్రిష్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఎన్టీఆర్ బయోపిక్ కి పోటీగా ఈ సినిమా ఉంటే కలెక్షన్స్ పరంగా ఇబ్బంది వస్తుంది కాబట్టి...వ్యూహాత్మకంగా ఈ సినిమాని స్లో చేసినట్లు ప్రచారం చేస్తున్నారు.

బాలయ్యకు, బోయపాటికు ఉన్న అనుబంధంతో ఇలా చేస్తున్నాడని ఆరోపిస్తున్నారు. ఓ పాపులర్ డైలీ సైతం..బోయపాటి చాలా స్లో పేస్ లో షూటింగ్ చేస్తున్నారని రాసుకొచ్చింది. అయితే ఈ ఆరోపణలలో ఎంతవరకూ నిజం ఉందో పరిశీలిద్దాం. నిజంగా కనుక బోయపాటి శ్రీను ...కావాలనే లేటు చేస్తే..ఆ విషయం గమనించలేనంత పరిస్దితిల్లో మెగా క్యాంప్ ఉండదు.

వాళ్లు ఊరుకోరు. సరైన కారణం ఉన్నప్పుడే బోయపాటి స్లో చేసినా చెల్లుబాటు అవుతుంది. అలాగే..బోయపాటి శ్రీను కు అందరి హీరోలతో మంచి అనుబంధం ఉంది.  మొన్నటికి మొన్న  అల్లు అర్జున్ తో సరైనోడు చేసి హిట్ కొట్టాడు. మెగా క్యాంప్ లో కొనసాగాలంటే గేమ్ లు ఆడకూడదని తెలుసు. అలాంటప్పుడు ఇలాంటి కుట్రలకు అవకాసం ఎక్కడుంటుంది. నిజం చెప్పాలంటే ఇది బోయపాటి మీద ఓ వర్గం మీడియా చేసే కుట్ర అని చెప్పాలి. బోయపాటికు,మెగా క్యాంప్ కు ,మెగాభిమానులకు మధ్య విభేధాలు సృష్టించటానికి పనిలా అనిపిస్తోంది. మీరేమంటారు.

రామ్‌ చరణ్‌ సరసన భరత్‌ అనే నేను ఫేం కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ విలన్  పాత్రలో కనిపించనున్నాడు. జీన్స్‌ ఫేం ప్రశాంత్‌, ఆర్యన్‌ రాజేష్‌లు ఇతర కీలక పాత్రలో నటిస్తున్నారు. 

ఇక ఈ చిత్రంకు సంభందించి  దీపావళి కానుకగా ఫస్ట్ లుక్‌ రిలీజ్‌ కు ప్లాన్‌ చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.  ఈ విషయంపై చిత్రయూనిట్‌పై ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు. ఈ సినిమాకు వినయ విధేయ రామ అనే పేరును పరిశీలిస్తున్నారట. ఇప్పటికైనా చిత్రయూనిట్‌ అధికారికంగా డేట్‌ ఎనౌన్స్‌ చేస్తుందేమో చూడాలి.

ఇవి కూడా చదవండి..

చరణ్ సినిమా నుండి సినిమాటోగ్రాఫర్ అవుట్! 

చరణ్ తీరుతో బోయపాటికి తలనొప్పి..?

చరణ్ సినిమాలో ఎన్టీఆర్ సీన్ రిపీట్..?

చరణ్ సినిమా టైటిల్ ఇదేనట!

బోయపాటి తీరుతో నిర్మాత అసహనం!

ఫ్యాన్స్ కు మెగా హీరో దసరా గిఫ్ట్!

షూటింగ్ లకి రామ్ చరణ్ డుమ్మా.. కారణమేమిటంటే..?

రామ్ చరణ్-బోయపాటి సినిమా టైటిల్ ఇదే..!

Follow Us:
Download App:
  • android
  • ios