'రంగస్థలం' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నటుడు రామ్ చరణ్ తన క్రేజ్ ని మరింతగా పెంచుకున్నాడు. ప్రస్తుతం ఆయన బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

'రంగస్థలం'తో వచ్చిన ఇమేజ్ ని కాపాడుకోవాలంటే ఈ సినిమాపై మరింత దృష్టి పెట్టాలి. కానీ అలా జరగడం లేదని సమాచారం. రామ్ చరణ్ కారణంగా షూటింగ్ కి అంతరాయం కలుగుతుందని టాక్.

చెప్పిన సమయానికి షూటింగ్ కి రాకపోవడం, సెట్ లో అందరూ రెడీగా ఉన్న తరువాత ఫోన్ చేసి నేను రావడం లేదని చరణ్ చెప్పడం వంటి విషయాలు బోయపాటిని బాగా ఇబ్బంది పెడుతున్నాయట. చరణ్ 'సై రా' సినిమాపై దృష్టి పెట్టడంతో బోయపాటి సినిమాను అశ్రద్ధ చేస్తున్నాడని సమాచారం.

ఓరోజు షూటింగ్ క్యాన్సిల్ చేస్తే నిర్మాతకి ఎంత నష్టం అనే విషయం నిర్మాతగా మారిన రామ్ చరణ్ కి తెలియంది కాదు. కానీ ఆయన ప్రవర్తనలో మార్పు రావడం లేదు. దీంతో చరణ్ పై బోయపాటి కూడా కాస్త కోపంగా ఉన్నాడని అంటున్నారు. 

ఇవి కూడా చదవండి.. 

చరణ్ సినిమాలో ఎన్టీఆర్ సీన్ రిపీట్..?

చరణ్ సినిమా టైటిల్ ఇదేనట!

బోయపాటి తీరుతో నిర్మాత అసహనం!

ఫ్యాన్స్ కు మెగా హీరో దసరా గిఫ్ట్!

షూటింగ్ లకి రామ్ చరణ్ డుమ్మా.. కారణమేమిటంటే..?

రామ్ చరణ్-బోయపాటి సినిమా టైటిల్ ఇదే..!