దక్షిణాది అగ్ర హీరోయిన్ నయనతార గ్లామరస్ హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసింది. గత కొంతకాలంగా ఆమె లేడీ ఓరియెంటెడ్ కథల్లో నటించడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తోంది. పూర్తిగా కోలివుడ్ చిత్రాలకు పరిమితమైన నయనతార అప్పుడప్పుడు తెలుగు చిత్రాల్లో కూడా మెరుస్తుంటుంది.

ప్రస్తుతం ఈ బ్యూటీ మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 'సై రా' సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా కోసం అమ్మడు తన రూల్స్ ని బ్రేక్ చేయబోతుందని సమాచారం. అదెలా అంటే.. నయనతార ఏ సినిమాలో నటించినా.. ప్రమోషన్స్ లో మాత్రం పాల్గొనదు. లేడీ ఓరియెంటెడ్ స్టోరీ అయినా అమ్మడు మాత్రం ప్రమోషన్స్ కి దూరంగానే ఉంటుంది.

ఒకవేళ నిర్మాతలు మరీ ఎక్కువ ఒత్తిడి చేస్తే అదనపు పారితోషికం డిమాండ్ చేస్తుంటుంది. ప్రమోషన్స్ విషయంలో అలాంటి రూల్ పెట్టుకున్న నయన్.. 'సై రా' సినిమా  విషయంలో మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకుందని తెలుస్తోంది. భారీ బడ్జెట్ సినిమా కావడంతో నయన్ కూడా ప్రమోషన్స్ లో పాల్గొంటే బావుంటుందని భావించిన రామ్ చరణ్ ఆమెను స్పెషల్ గా రిక్వెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.

రామ్ చరణ్ అడగడంతో కాదనలేక నయన్ ప్రమోషన్స్ లో పాల్గొనడానికి అంగీకరించిందని సమాచారం. మొత్తాన్ని నిర్మాతగా చరణ్ తన హీరోయిన్ ని బాగానే హ్యాండిల్ చేశాడు. 

ఇవి కూడా చదవండి.. 

'సైరా'లో విజయ్ సేతుపతి గెటప్!

నాన్నకి హయ్యెస్ట్ రెమ్యునరేషన్ ఇచ్చింది నేనే..

అంత డబ్బు మా దగ్గర లేదు.. రామ్ చరణ్ కామెంట్స్!

సైరా రిలీజ్ డేట్.. టార్గెట్ ఫిక్స్!

'సైరా' బడ్జెట్ కంట్రోల్.. రీషూట్లకు చెక్!

'సై రా' వాయిదా.. ఇప్పట్లో రాదుగా!

'సై రా' లో స్టైలిష్ స్టార్ కి ఛాన్స్!

సైరా కథ వెనుక ఇంత కథ ఉందా?

సైరా టీజర్: ఉయ్యాలవాడ మహారాణి సిద్దమ్మ

'సైరా'.. చిరు కోసం మూడు రోజులు మాత్రమే!

'సైరా' ఆన్ లొకేషన్: డైరెక్టర్ పై అరిచేసిన చిరు..?

ఒలింపిక్ షూటర్ వద్ద మెగాస్టార్ ట్రైనింగ్!

'సై రా' విషయంలో అభిమానులకి నిరాశ తప్పదా..?

సైరా పిక్: న్యూ లుక్ తో అదరగొట్టిన మెగాస్టార్!

సైరా అప్డేట్: కట్టప్పలా వెన్నుపోటు పొడుస్తాడా?

సైరా అప్డేట్: అంతా మెగాస్టార్ వల్లే!

సైరా అప్డేట్: హైదరాబాద్ లో మెగా టీమ్ భారీ ప్లాన్!