మెగాస్టార్ అభిమానులకు ఇది బ్యాడ్ న్యూస్ అయినప్పటికీ సినిమా బెస్ట్ అవుట్ పుట్ కోసం మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా 'సై రా నరసింహారెడ్డి' సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే.

గతేడాది డిసంబర్ లో సినిమా షూటింగ్ మొదలైంది. చిరంజీవి పుట్టినరోజు కానుకగా సినిమా టీజర్ ని విడుదల చేశారు. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమాను విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం సినిమా అనుకున్న సమయానికి రావడం లేదని సమాచారం.

ఈ సినిమాకి సిజి, విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ చాలా ఉంది. అలానే మూడు, నాలుగు భాషల్లో సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నారు. బాలీవుడ్ లో ఈ సినిమా మార్కెట్ భారీ నిర్వహించాలనేది నిర్మాత రామ్ చరణ్ ప్లాన్. దానికోసం సినిమా విజువల్ గా చాలా గ్రాండియర్ గా ఉండాలి.

యుద్ధ సన్నివేశాలు కూడా భారీగా ప్లాన్ చేశారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కి ఎలా లేదన్నా ఆరు నెలల సమయం పడుతుంది. ఈ క్రమంలో సినిమాను 2020 సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నారట. అలా అయితే చిరు కోసం ఎదురుచూస్తోన్న దర్శకుల పరిస్థితి ఏంటి..? ఏం జరుగుతుందో చూడాలి!

ఇవి కూడా చదవండి.. 

'సై రా' లో స్టైలిష్ స్టార్ కి ఛాన్స్!

సైరా కథ వెనుక ఇంత కథ ఉందా?

సైరా టీజర్: ఉయ్యాలవాడ మహారాణి సిద్దమ్మ

'సైరా'.. చిరు కోసం మూడు రోజులు మాత్రమే!

'సైరా' ఆన్ లొకేషన్: డైరెక్టర్ పై అరిచేసిన చిరు..?

ఒలింపిక్ షూటర్ వద్ద మెగాస్టార్ ట్రైనింగ్!

'సై రా' విషయంలో అభిమానులకి నిరాశ తప్పదా..?

సైరా పిక్: న్యూ లుక్ తో అదరగొట్టిన మెగాస్టార్!

సైరా అప్డేట్: కట్టప్పలా వెన్నుపోటు పొడుస్తాడా?

సైరా అప్డేట్: అంతా మెగాస్టార్ వల్లే!

సైరా అప్డేట్: హైదరాబాద్ లో మెగా టీమ్ భారీ ప్లాన్!