బ్రిటిష్ సామ్రాజ్యానికి ఎదురుతిరిగిన భారతదేశ మొదటి సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితాధారంగా సైరా చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో కనిపిస్తుండగా అయన సతీమణి సిద్ధమ్మ పాత్రలో అందాల తార నయనతార నటిస్తోంది. 

మెగాస్టార్ పుట్టినరోజు సందర్బంగా గతంలో రిలీజ్ చేసిన టీజర్ కు అనూహ్య స్పందన వచ్చింది. ఇక ఇప్పుడు నయనతార పుట్టినరోజు సందర్బంగా చిత్ర యూనిట్ సిద్ధమ్మ పాత్రకు సంబందించిన టీజర్ ను రిలీజ్ చేశారు. సినిమాలో నయనతార మహారాణి పాత్రలో కనిపిస్తోంది. కథలో ఈ పాత్ర కూడా చాలా కీలకం కానుందట. 

సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న సైరా నరసింహారెడ్డి సినిమాను రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. రీసెంట్ గా జార్జియాలో క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ కోసం 45 కోట్లను ఖర్చు చేశారు. ఇక విజువల్ ఎఫెక్ట్స్ కోసం కూడా చిత్ర యూనిట్ చాలా కష్టపడుతోంది. ఇక వచ్చే  ఏడాది సమ్మర్ లో సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు.