మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యధిక భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం సైరా. ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి జీవిత ఆధారంగా సురేందర్ రెడ్డి సినిమాను డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక మెగా తనయుడు రామ్ చరణ్ సినిమా స్థాయి ఏ మాత్రం తగ్గకుండా సొంత ప్రొడక్షన్ లో కాస్ట్లీగా సినిమాను నిర్మిస్తున్నాడు. 

150 కోట్ల వరకు సినిమా కోసం ఖర్చుపెడుతున్నారు. అసలు విషయంలోకి వస్తే సినిమా షూటింగ్ దాదాపు ఎండింగ్ కు వచ్చేసింది. గత కొన్ని వారాలుగా జార్జియాలో యుద్ధ సన్నివేశాలతో బిజీగా ఉన్న మెగా టీమ్ నెక్స్ట్ షెడ్యూల్ ని ఇండియాకు షిఫ్ట్ చేయనుంది. హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ కోసం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్పెషల్ సెట్ ప్లాన్ చేస్తున్నారు. 

యుద్ధ స్నానివేశాల్లో మెగాస్టార్ ఏ మాత్రం అలుపులేకుండా కష్టపడుతున్నారట. ఆరు పదుల వయసులో కూడా ఫిట్ నెస్ లో మార్పులు చేసి క్యారెక్టర్ బావుండాలని డూబ్ లేకుండా నటిస్తున్నారు. ఇక డిసెంబర్ నాటికి 90% షూటింగ్ అయిపోనుంది. ఆ తరువాత సాంగ్స్ అలాగే కొన్ని ప్యాచప్ వర్క్స్ తో షూటింగ్  ముగుస్తుంది. మెగాస్టార్ సరసన నయనతార హీరోయిన్ గా నటించగా సుదీప్ - అమితాబ్ - జగపతి బాబు తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.