మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 'సై రా' సినిమాను రామ్ చరణ్ నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా రీషూట్ల కారణంగా విడుదల ఆలస్యమవుతుందంటూ కొన్ని వార్తలు వినిపించాయి. అయితే రీషూట్స్ చేసేంత డబ్బు తమ దగ్గర లేదని అంటున్నాడు రామ్ చరణ్. 

ప్రస్తుతం చరణ్ నటించిన 'వినయ విధేయ రామ' సినిమా విడుదలకు సిద్ధమవుతుండడంతో మీడియాతో ముచ్చటించాడు చరణ్. ఈ సందర్భంగా అతడికి 'సై రా' సినిమాకి సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. వేసవికి రావాల్సిన సినిమా రీషూట్ల కారణంగా వాయిదా పడుతుందని వస్తోన్న వార్తలపై స్పందించిన చరణ్.. రీషూట్లు చేస్తున్నామనే విషయంలో నిజం లేదని అన్నారు.

''రీషూట్లు చేసేంత డబ్బు మా దగ్గర లేదు'' అంటూ లైట్ తీసుకున్నాడు. అయితే సినిమా షూటింగ్ మొత్తం సవ్యంగా, తాము అనుకున్నట్లు జరగుతుందని చెప్పడం లేదని, పెద్ద పెద్ద సినిమాలకు కొన్ని సమస్యలు తప్పవని అన్నారు.

సినిమాకి ఎంత ఖర్చు పెడుతున్నారని ప్రస్తావించగా.. ఇప్పటికైతే రూ.200 కోట్లు అనుకుంటున్నామని, బాలీవుడ్ కి ఈ సినిమా తీసుకెళ్లాలి, పాన్ ఇండియా గుర్తింపు సంపాదించాలి  అనేదానికంటే సౌత్ లోనే బాగా ప్రమోట్ చేయాలని అనుకుంటున్నట్లు వెల్లడించారు. బహుశా దసరా సమయానికి సినిమా విడుదల కావొచ్చని అన్నారు. 

ఇవి కూడా చదవండి.. 

సైరా రిలీజ్ డేట్.. టార్గెట్ ఫిక్స్!

'సైరా' బడ్జెట్ కంట్రోల్.. రీషూట్లకు చెక్!

'సై రా' వాయిదా.. ఇప్పట్లో రాదుగా!

'సై రా' లో స్టైలిష్ స్టార్ కి ఛాన్స్!

సైరా కథ వెనుక ఇంత కథ ఉందా?

సైరా టీజర్: ఉయ్యాలవాడ మహారాణి సిద్దమ్మ

'సైరా'.. చిరు కోసం మూడు రోజులు మాత్రమే!

'సైరా' ఆన్ లొకేషన్: డైరెక్టర్ పై అరిచేసిన చిరు..?

ఒలింపిక్ షూటర్ వద్ద మెగాస్టార్ ట్రైనింగ్!

'సై రా' విషయంలో అభిమానులకి నిరాశ తప్పదా..?

సైరా పిక్: న్యూ లుక్ తో అదరగొట్టిన మెగాస్టార్!

సైరా అప్డేట్: కట్టప్పలా వెన్నుపోటు పొడుస్తాడా?

సైరా అప్డేట్: అంతా మెగాస్టార్ వల్లే!

సైరా అప్డేట్: హైదరాబాద్ లో మెగా టీమ్ భారీ ప్లాన్!