వెండితెరకు ఎంత గ్యాప్ ఇచ్చినా తన స్టార్ డమ్ ఏ మాత్రం తగ్గలేదని ఖైదీ నెంబర్ 150 సినిమాతో నీరుపించున్నాడు మెగాస్టార్ చిరంజీవి. ఆయన రీ ఎంట్రీతో అభిమానులు ఎంతగానో సంతోషపడ్డారని సినిమా సాధించిన విజయం ద్వారా రుజువయ్యింది. ఇకపోతే నెక్స్ట్ ఒక ప్రతిష్టాత్మక చిత్రంతో రానున్న సంగతి తెలిసిందే. 

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో దాదాపు 200కోట్ల భారీ బడ్జెట్ తో రామ్ చరణ్ నిర్మిస్తోన్న సైరా సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా మెగాస్టార్ ఒక స్వాతంత్య్ర సమరయోధుడి పాత్రలో కనిపించనున్నాడు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత ఆధారంగా సినిమా తెరక్కుతున్న సంగతి తెలిసిందే. 

ప్రస్తుతం సినిమా షూటింగ్ జార్జియాలో జరుగుతోంది. అయితే అక్కడ మెగాస్టార్ షూటింగ్ బ్రేక్ లో దిగిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఫుల్ గడ్డంతో మెగాస్టార్ చాలా కొత్తగా కనిపిస్తున్నారు. మొదటి షెడ్యూల్ కోసం ఈ లుక్ లో కనిపించిన చిరు ఆ మధ్యన తీయించేశారు. ఇక ఇప్పుడు వార్ సీక్వెన్స్ షెడ్యూల్ కోసం మళ్ళి ఎక్కువగా గడ్డం పెంచేశారు. 

రఫ్ లుక్ లో యాక్షన్ సీక్వెన్స్ లో మెగాస్టార్ అద్భుతంగా నటించారని చిత్ర యూనిట్ ద్వారా తెలుస్తోంది. నరసింహారెడ్డి గ్యాంగ్ కు బ్రిటిష్ సైనికులకు సంబందించిన యుద్ధ సన్నివేశాల చిత్రీకరణ పనులను దాదాపు పూర్తి చేశారు. త్వరలోనే హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్ర యూనిట్ మరో షెడ్యూల్ ని స్టార్ట్ చేయనుంది.