మెగాస్టార్ చిరంజీవి 'సై రా నరసింహారెడ్డి' సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన భారీ షెడ్యూల్ ని జార్జియాలో పూర్తి చేశారు. దాదాపు రెండు వందల కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమాలో చిరంజీవి కత్తి యుద్ధాలు, గుర్రపుస్వారీలు చేసినట్లు టీజర్ ద్వారా తెలుస్తోంది. ఇప్పుడు ఈ సినిమా కోసం చిరంజీవి తుపాకీ షూటింగ్ కూడా నేర్చుకుంటున్నట్లు తెలుస్తోంది. షూటింగ్ లో ఛాంపియన్ గగన్ నారంగ్ ని కలిసి అతడి వద్ద మెలకువలు నేర్చుకుంటున్నాడు చిరంజీవి.

గగన్ నారంగ్ ఒలింపిక్స్ లో బ్రాంజ్ మెడల్ కూడా గెలుచుకున్నాడు. అతడికి రకరకాల తుపాకీలు వాటి వాడకం గురించి బాగా తెలిసి ఉంటుంది. దీంతో చిరు బ్రిటీష్ కాలం నాటి తుపాకీలు, వాటిని వాడే విధానం గురించి నారంగ్ ని అడిగి తెలుసుకున్నారు. ఈ విషయాన్ని గగన్ నారంగ్ సోషల్ మీడియాద్వారా వెల్లడించాడు.

ఇటీవల షూటింగ్ పూర్తయిన తరువాత కొన్ని రోజులు బ్రేక్ తీసుకున్న చిరు తిరిగి షూటింగ్ లో పాల్గొన్నారు. ఈ షెడ్యూల్ లో బ్రిటీష్ వారితో తుపాకులతో పోరాడే సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. వచ్చే ఏడాది వేసవి కానుకగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు. 

ఇవి కూడా చదవండి.. 

'సై రా' విషయంలో అభిమానులకి నిరాశ తప్పదా..?

సైరా పిక్: న్యూ లుక్ తో అదరగొట్టిన మెగాస్టార్!

సైరా అప్డేట్: కట్టప్పలా వెన్నుపోటు పొడుస్తాడా?

సైరా అప్డేట్: అంతా మెగాస్టార్ వల్లే!

సైరా అప్డేట్: హైదరాబాద్ లో మెగా టీమ్ భారీ ప్లాన్!