మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 'సై రా నరసింహారెడ్డి' సినిమాలో నటిస్తున్నారు. పీరియాడిక్ నేపధ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాని దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. మొన్నటివరకు సినిమా నిర్మాణ వ్యవహారాలు చరణ్ చూసుకునేవాడు.

కానీ ఇప్పుడు తను 'వినయ విధేయ రామ' షూటింగ్ లో బిజీగా ఉండడంతో 'సై రా' నిర్మాణ బాధ్యతలు చిరు చూసుకుంటున్నాడట. హీరోగా, నిర్మాతగా ఒకేసారి రెండు పనులు చేయాలంటే చిరు కాస్త ఒత్తిడికి లోనవుతున్నట్లు సమాచారం. సెట్ లో సహనం కోల్పోయి డైరెక్టర్ సురేందర్ రెడ్డిపై అరిచినట్లు తెలుస్తోంది.

అనవసరమైన చోటు కూడా సురేందర్ రెడ్డి ఖర్చు పెట్టిస్తుండడంతో చూస్తూ ఊరుకోలేక చిరు అతడిపై సీరియస్ అయినట్లు తెలుస్తోంది. అతడికి క్లాస్ కూడా పీకాడట. చిరు ప్రవర్తన కారణంగా సురేందర్ రెడ్డి కూడా హర్ట్ అయినట్లు సమాచారం. చరణ్ సెట్ లో ఉన్నంత కాలం సురేందర్ రెడ్డిపై ఎలాంటి ఒత్తిడి లేకుండా అతడి పనిని ప్రశాంతంగా చేసుకునేలా చూసుకునేవాడు.

కానీ ఇప్పుడు చిరు ప్రవర్తన కారణంగా అతడు నొచ్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ వయసులో హీరోగా, నిర్మాతగా బాధ్యతలు నిర్వహించాలంటే చిరుపై ఆ మాత్రం ఒత్తిడి ఉండడం కామనే కదా.. 

ఇవి కూడా చదవండి.. 

ఒలింపిక్ షూటర్ వద్ద మెగాస్టార్ ట్రైనింగ్!

'సై రా' విషయంలో అభిమానులకి నిరాశ తప్పదా..?

సైరా పిక్: న్యూ లుక్ తో అదరగొట్టిన మెగాస్టార్!

సైరా అప్డేట్: కట్టప్పలా వెన్నుపోటు పొడుస్తాడా?

సైరా అప్డేట్: అంతా మెగాస్టార్ వల్లే!

సైరా అప్డేట్: హైదరాబాద్ లో మెగా టీమ్ భారీ ప్లాన్!