MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Thaai Kizhavi Collections: బాక్సాఫీసు చరిత్రని మార్చిన రాధిక శరత్‌ కుమార్‌.. బామ్మకి మతిపోయే కలెక్షన్లు

Thaai Kizhavi Collections: బాక్సాఫీసు చరిత్రని మార్చిన రాధిక శరత్‌ కుమార్‌.. బామ్మకి మతిపోయే కలెక్షన్లు

రాధికా శరత్‌కుమార్ ప్రధాన పాత్రలో నటించిన 'తాయి కిళవి' సినిమా కేవలం వారంలోనే రూ.25 కోట్లు వసూలు చేసి సంచలన రికార్డు సృష్టించింది. 60 ఏళ్ల నటి లీడ్ రోల్‌లో నటించిన సినిమా ఇంత పెద్ద విజయం సాధించడం తమిళ సినీ చరిత్రలో ఇదే తొలిసారి.

1 Min read
Author : Aithagoni Raju
Published : Mar 09 2026, 10:53 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బాక్సాఫీసు వద్ద దుమ్మురేపుతున్న రాధిక శరత్‌ కుమార్‌ మూవీ
Image Credit : X

బాక్సాఫీసు వద్ద దుమ్మురేపుతున్న రాధిక శరత్‌ కుమార్‌ మూవీ

నటి రాధికా శరత్‌కుమార్ దశాబ్దాలుగా తన నటనతో తమిళ ఇండస్ట్రీలో ముద్ర వేశారు. ఇప్పుడు ఆమె ప్రధాన పాత్రలో వచ్చిన 'తాయి కిళవి' సినిమా వసూళ్లలో కొత్త చరిత్ర సృష్టిస్తోంది. ఇది కేవలం ఎమోషనల్ సినిమానే కాదు, కమర్షియల్‌గానూ భారీ విజయం సాధించింది.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఒకే వారంలో రూ. 25 కోట్ల వసూళ్లు!
Image Credit : X

ఒకే వారంలో రూ. 25 కోట్ల వసూళ్లు!

గత వారం విడుదలైన ఈ మూవీ మొదటి రోజు నుంచే ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వస్తోంది. విడుదలైన వారంలోనే రూ. 25 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఒక బామ్మ పాత్ర చుట్టూ తిరిగే సినిమా ఇంత తక్కువ టైంలో ఈ రేంజ్ కలెక్షన్లు సాధించడం ఇదే మొదటిసారి.

35
75 ఏళ్ల చరిత్రలో మొదటిసారి
Image Credit : X

75 ఏళ్ల చరిత్రలో మొదటిసారి

తమిళ సినిమా 75 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ టైంలో, 60 ఏళ్లు పైబడిన నటి లీడ్ రోల్‌లో నటించి ఇంత పెద్ద హిట్ కొట్టడం ఇదే తొలిసారని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఇది రాధికా శరత్‌కుమార్ కెరీర్‌లో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచిపోతుంది.
45
`తాయి కిళవి` విజయం వెనుక కారణాలు
Image Credit : X

`తాయి కిళవి` విజయం వెనుక కారణాలు

నటుడు శివకార్తికేయన్ సమర్పించిన ఈ సినిమా, మంచి కథకు క్వాలిటీ ప్రొడక్షన్, సరైన ప్రమోషన్ తోడైతే జనంలోకి ఎలా వెళ్తుందో నిరూపించింది.  కుటుంబ బంధాలు, ఎమోషనల్ కథలకు తమిళ ప్రేక్షకులు ఎప్పుడూ బ్రహ్మరథం పడతారని 'తాయి కిళవి' మరోసారి ప్రూవ్ చేసింది.

55
రాధిక శరత్‌ కుమార్‌ విశ్వరూపం
Image Credit : X

రాధిక శరత్‌ కుమార్‌ విశ్వరూపం

'కిళక్కు చీమయిలే' సినిమాలో చూసిన అదే జోష్‌ను, అనుభవంతో కలిపి రాధిక ఈ సినిమాలో చూపించడం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ విజయం, భవిష్యత్తులో సీనియర్ నటీనటులకు, మహిళా ప్రాధాన్యమున్న కథలకు మంచి డిమాండ్ ఉంటుందనే నమ్మకాన్ని ఇస్తోంది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తమిళ సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: ఝాన్సీ వల్ల బాటమ్ లోకి షాలిని, రోహిత్.. ఇరగదీసిన నరేష్, రామ్ ప్రసాద్
Recommended image2
Ranabaali Trailer: రణబాలి ట్రైలర్ రివ్యూ.. బ్రిటిష్‌పై వీర పోరాటం, విజయ్ దేవరకొండ ఊచకోత చూశారా
Recommended image3
Bollywood Controversies: సల్మాన్-షారుఖ్ నుంచి కంగనా-హృతిక్ వరకు.. స్టార్లను కుదిపేసిన 7 వివాదాలు
Related Stories
Recommended image1
OTT Releases: ఈ వారం ఓటీటీలో విడుదల కాబోతున్న సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు ఇవే.. తెలుగు ఆడియెన్స్ కి పండగే
Recommended image2
Mahesh Babu: బ్లాక్‌ బస్టర్‌ కావాల్సిన మహేష్‌ బాబు సినిమాని డిజాస్టర్‌ చేసిన స్టార్‌ డైరెక్టర్‌.. కోలుకోలేని దెబ్బ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved