మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 'సై రా నరసింహారెడ్డి' సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇటీవలే జార్జియాలో సినిమాకి సంబంధించిన మేజర్ షెడ్యూల్ ని పూర్తి చేశారు. క్లైమాక్స్ లో వచ్చే భారీ యాక్షన్ ఎపిసోడ్ ని కూడా చిత్రీకరించినట్లు తెలుస్తోంది.

తదుపరి సినిమా షెడ్యూల్ లో సినిమా పాటలని చిత్రీకరించబోతున్నారు. నయనతార, తమన్నా, చిరంజీవిలపై పాటల చిత్రీకరణ జరగనుంది. కొరియోగ్రాఫర్ గా పని చేస్తోన్న శేఖర్ మాస్టర్ తో చిరంజీవి ప్రత్యేకంగా మాట్లాడినట్లు తెలుస్తోంది. శేఖర్ మాస్టర్ కొన్ని డాన్స్ మూమెంట్స్ ని కంపోజ్ చేయగా.. చిరు వాటిని మార్చమని చెప్పారట.

పాటల్లో డాన్స్ తక్కువగా ఉండేలా చూడమని చెప్పినట్లు సమాచారం. నిజానికి చిరంజీవి సినిమాలలో డాన్స్ లు చాలా ఎక్కువగా ఉంటాయి. అతడి రీఎంట్రీ సినిమా 'ఖైదీ నెంబర్ 150'లో కూడా మెగాస్టార్ తన డాన్స్ పెర్ఫార్మన్స్ తో అభిమానులను ఖుషీ చేశాడు. ఇది ఇలా ఉండగా.. సైరా సినిమా స్వాతంత్ర్య నేపధ్యంలో సాగే సినిమా కావడంతో డాన్స్ లు పెట్టి సినిమా ప్లాట్ ని డిస్టర్బ్ చేయడం చిరుకి ఇష్టం లేదట.

చిరు హార్డ్ కోర్ ఫ్యాన్స్ కి ఇది నిరాశ పరిచే విషయమే అయినా.. సినిమా కథ, కథనాలు ఆ లోటు తీర్చేస్తాయనే నమ్మకంతో ఉన్నారు. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఇవి కూడా చదవండి.. 

సైరా పిక్: న్యూ లుక్ తో అదరగొట్టిన మెగాస్టార్!

సైరా అప్డేట్: కట్టప్పలా వెన్నుపోటు పొడుస్తాడా?

సైరా అప్డేట్: అంతా మెగాస్టార్ వల్లే!

సైరా అప్డేట్: హైదరాబాద్ లో మెగా టీమ్ భారీ ప్లాన్!