మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 'సై రా నరసింహారెడ్డి' సినిమా వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. రామ్ చరణ్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నయనతార.. చిరుకి జోడీగా కనిపిస్తుండగా అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, సుదీప్ వంటి నటులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

రామ్ చరణ్ కూడా ఈ సినిమాలో ఓ సీన్ లో కనిపించే ఛాన్స్ ఉందని టాక్. నాగబాబు కూతురు నీహారిక కూడా ఈ సినిమాలో కనిపించాలని ఆశ పడుతోంది. ఆమె కోసం కూడా చిన్న పాత్ర రెడీ చేశారని సమాచారం. ఇప్పుడు మరో మెగాహీరో ఈ ప్రాజెక్ట్ లో భాగం కాబోతున్నారు.

అతడే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. అందుతున్న సమాచారం ప్రకారం.. దర్శకుడు సురేందర్ రెడ్డి వాయిస్ ఓవర్ తో కథను నేరేట్ చేయాలని అనుకుంటున్నాడు. దీనికోసం అల్లు అర్జున్ ని తీసుకోవాలనేది దర్శకుడు సురేందర్ రెడ్డి ఆలోచన.

ఇదే విషయాన్ని రామ్ చరణ్ తో చర్చించగా దానికి ఆయన కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై చిత్రబృందం నుండి అధికార ప్రకటన వెలువడాల్సివుంది!

ఇవి కూడా చదవండి.. 

సైరా కథ వెనుక ఇంత కథ ఉందా?

సైరా టీజర్: ఉయ్యాలవాడ మహారాణి సిద్దమ్మ

'సైరా'.. చిరు కోసం మూడు రోజులు మాత్రమే!

'సైరా' ఆన్ లొకేషన్: డైరెక్టర్ పై అరిచేసిన చిరు..?

ఒలింపిక్ షూటర్ వద్ద మెగాస్టార్ ట్రైనింగ్!

'సై రా' విషయంలో అభిమానులకి నిరాశ తప్పదా..?

సైరా పిక్: న్యూ లుక్ తో అదరగొట్టిన మెగాస్టార్!

సైరా అప్డేట్: కట్టప్పలా వెన్నుపోటు పొడుస్తాడా?

సైరా అప్డేట్: అంతా మెగాస్టార్ వల్లే!

సైరా అప్డేట్: హైదరాబాద్ లో మెగా టీమ్ భారీ ప్లాన్!